అదిగదిగో పందళ దేశం / Adigadigo Pandala Desham - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

 అదిగదిగో పందళ దేశం అందాల రాజ్యం

అందాల రాజ్యంలో అయ్యప్ప దేవుని రూపం. 

కొండల నడుమ కోనల నడుమ పలికే కోయిల రాగం 

కారడవుల్లో దారుల వెంట మ్రోగె నామస్మరణం 

" అదిగదిగో ".

పించిన పలికే నాథుడవు మనిషిని చంపిన దేవుడవు 

కళి బాధలను తొలగించి కరిమల లోనే వెలసినవు 

ఆపద్బాంధవుడవు స్వామి అనాధరక్షకుడవు నీవు 

ధీనులము మేము స్వామి ఆదుకొనగా దిగి రా స్వామి 

" అదిగదిగో "

నియమ నిష్ఠలతో స్వామి నీ మాలలనే వేసెదము 

నీళమల వాసా ఓ దేవా నిత్య బ్రహ్మ చారి వయా 

కన్నే స్వామి రూపమయ కారణ జన్ముడవు నీవు 

కళలో ఇళలోన మమ్ము కంటికి రెప్పల గాపాడు.

" అదిగదిగో "

నల్లని బట్టలు కట్టెదము నుదుటన గంధము పెట్టెదము 

భూతప్రేతాళను తరిమే భూతనాథ ప్రభుడవయా 

స్వామియే శరణం అయ్యిప్ప శరణం శరణం అయ్యప్ప 

స్వామియే శరణం అయ్యిప్ప శరణం శరణం అయ్యప్ప 





#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat