ఓ రామా శ్రీరామా జయ జయ రామా - శ్రీరామ భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

ఓ రామా శ్రీరామా జయ జయ రామా - శ్రీరామ భజన పాటల లిరిక్స్

 

ఓ రామా శ్రీరామా జయ జయ రామా రఘురామా

కౌశిక యాగము కాచితివయ్యా రాతిని నాతిగ చేసితివయ్యా
హర విల్లు విరచి మురిపించి సీతను పరిణయ మాడిన కళ్యాణ రామా

ఒకటే మాట ఒకటే బాణం ఒకరే సతి అని చాటితివయ్యా
కుజనుల నణచి సుజనుల బ్రోచిన ఆదర్శమూర్తివి నీవేనయా

కానల కేగి కాంతను బాసి ఎంతో వేదన చెందితివయ్యా
అంతేలేని చింతల నెన్నో ఎంతగ ఓర్చావో రామయ్యా

📢 Follow