83. నా మది కైలాసం… నా శ్వాస ఓంకారం… | Naa madi kailasam | శివ భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

83. నా మది కైలాసం… నా శ్వాస ఓంకారం… | Naa madi kailasam | శివ భజన పాటల లిరిక్స్

నా మది కైలాసం… నా శ్వాస ఓంకారం…
రావేలా ఈ వేళ శ్రీశైల మల్లేశ్వరా…!
రావేలా ఈ వేళ శ్రీశైల మల్లేశ్వరా…!


ఏ రీతిగా నిన్ను కొలవలయ్యా మల్లికార్జునా…
మల్లికార్జునా… నాకంటూ ఏమి మిగిలిందయ్యా తండ్రి ఈశ్వరా…
తండ్రి ఈశ్వరా…

గంగతో పాదము కడగాలంటే చేప ఎంగిలి చేసెనయ్యా…
పాలతో అభిషేకిద్దామంటే దూడ ఎంగిలి చేసెనయ్యా…
ఏమి చేసి నిన్ను పూజింపగలనయ్యా గుండెల్లో కొలువుండరా… ఓఓఓ…

రావయ్యా మహా తండ్రి మల్లీశ్వరా…
రావయ్యా మహా తండ్రి మల్లీశ్వరా…

||నా మది కైలాసం||

వేదాలు చదివి కీర్తించలేను ఋషిని కాను రా…
ఋషిని కాను రా…
నీ గీతాలు అల్లి పొగడగలేను కవిని కాదు రా…
కవిని కాదు రా…

రెండక్షర శివ పదమే నేను ఎంచిన పాటమయ్యా…
శివ స్మరణతో నిండి ఉన్నా ఎద నీకు పీఠమయ్యా…
ఏమి చేసి నిన్ను పూజింపగలనయ్యా గుండెల్లో కొలువుండరా… ఓఓఓ…

రావయ్యా మహా తండ్రి మల్లీశ్వరా…
రావయ్యా మహా తండ్రి మల్లీశ్వరా…

||నా మది కైలాసం||

కన్నప్ప భక్తుడు ఏమి చదివెను నిన్ను చేరలేదా…
నిన్ను చేరలేదా…
నీ భక్తి తప్ప వేరేమి ఎరుగను నన్ను బ్రోవరా…
నన్ను బ్రోవరా…

శ్రీశైల వాస నా తండ్రి ఈశా నేను సైతము నీవేనయ్యా…
భక్త వరద అందుకోవయ్యా కొండత భక్తి నైవేద్యమయ్యా…
ఏమి చేసి నిన్ను పూజింపగలనయ్యా గుండెల్లో కొలువుండరా… ఓఓఓ…

రావయ్యా మహా తండ్రి మల్లీశ్వరా…
రావయ్యా మహా తండ్రి మల్లీశ్వరా…

||నా మది కైలాసం||

📢 Follow