12 రకాలవర్షాలు 64 రకాల మెరుపులు 33 రకాల పిడుగులు.
...........................................................
వేలసంవత్సరాల కిందటనే మన పూర్వీకులు శాస్త్రసాంకేతిక రంగాలలో అభివృద్ధి సాధించారు. అంతేకాదు కొన్నింటిని గ్రంథస్తం చేయడం జరిగింది.
మన పాశ్ఛత్య సంస్కృతిసాంప్రదాయాలను విదేశీయులు నిర్లక్ష్యం చేయడం వలన
విదేశీమాయలో విదేశీఉచ్చులో పడినమనం కూడా స్వంతవారసత్వ సంపదలను పూర్తిగా త్యజించడం వలన మనగొప్ప శాస్త్రసాంకేతిక సంపత్తిని కోల్పోయాము.
ఉన్నవాటిని కాపాడుకోవాలనే ధ్యాస కూడా లేనివారం మనమే.
మన దార్శనీకులైన బుుషులు అనే కళలలో నిష్ణాతులు వారు తాము దర్శించిన విషయాలను గ్రంథస్తం చేయడం జరిగింది.
అవేమిటో చూద్దాం.
(1) మేఘశాస్త్రం - ఇది అత్రిముని విరచితం. మేఘాలు ఏర్పడే విధానం, వర్షానికి కారణంవంటి విషయాలు చర్చించినది. 12 రకాల వర్షాలు, 64 రకాల మెరుపులు 33 రకాల పిడుగుల గురించి ఈ శాస్త్రం చర్చించింది.
(2) కాలశాస్త్రం - ఇది కార్తీకేయుడి సృష్టి. కాలవిభజన సేకనులు నిమిషాలు గంటలు రోజులు నెలలు సంవత్సరాల వెగైరా వాటి విభజన గురించి వివరించింది. ఆ రోజులలో సేకనులు లేవు, కాలాన్ని ఎంత సూక్ష్మంగా విభజించారో చెప్పటానికి ఉదాహరించడం జరిగింది.
(3) అక్షరలక్ష - రచయిత వాల్మీకి.ఈ గ్రంథం సృజించని అంశమంటూ లేదు. Encyclopedia of Sciences అంటారు.భూగర్భ వాయు భౌతిక యంత్ర గణిత రేఖాగణిత ఉష్ణ విద్యుత్ ఖనిజ జలయంత్ర వంటి అంశాలను క్షుణ్ణంగా వివరించింది.
(4) శబ్దశాస్త్రం - ఇది కండిక మహామునిచే రచింపబడింది. ఈ సృష్టిలోని ప్రాణమున్నవి ప్రాణంలేని నిర్జీవపదార్థాలచే సృష్టించబడిన శబ్దాలు వాటి పరిమాణం ప్రయాణం వంటి విషయాలను ఈ శాస్త్రం విశదీకరించింది.
(5) సూపశాస్త్రం - సూపశాస్త్రమునే పాకశాస్త్రమని అంటాము. రచయిత సుకేశుడు. మనకు చెందిన 108 రకాల భోజనపదార్థాలు వివిధరకాలైన ఊరగాయలు మిఠాయిలు పిండివంటల గురించి ఇంకా 3032 రకాల వంటకాల గురించి వివరిం చింది.
(6) శిల్పశాస్త్రం - ఇది కశ్యపుడి రచన.307 రకాల శిల్పాల గురించి గృహాలు దేవాలయాలు రాచభవనాలు కోటలు మిద్దెలు మేడలు పూరిగుడిసెల నిర్మాణం గురించి చక్కగా ఈ గ్రంథం వివరిస్తుంది.
(7) లక్షణశాస్త్రం - జీవపదార్థాల పుట్టుకగురించి వాటిలో స్త్రీపురుష లక్షణాల గురించి వివరిస్తుంది.
(8) మాలినీశాస్త్రం - పూలదండల కూర్పు. వివిధరకాల పూలతో రకరకాల డిజైన్లను ఏర్పాటుచేయడం గురించి బుుష్యశృంగుడు వ్రాసిన ఈ శాస్త్రం చర్చిస్తుంది.
(9) స్థాపతవిద్య - అధర్వణవేదమునుండి గ్రహించిన ఈ శాస్త్రంలో భవననిర్మాణ వైజ్ఞానిక ( ఇంజినీరింగ్ & ఆర్కిటెక్చర్) వంటి విషయాలు చర్చించడం జరిగింది.
(10) యంత్రశాస్త్రము - భూమిపై ప్రయాణించటానికి అనువైన 339 వాహనాలు నీటిపై ప్రయాణించటానికి 783 వాహనాలు గాలిలో ప్రయాణించటానికి వీలైన 101 వాహనాల వివరాలను ఇందులో గ్రంథకర్త భరద్వాజుడు వివరించాడు.
(11) విషశాశాస్త్రము - ఇది అశ్వనీకుమారుని రచన. ఇందులో 32 విషపదార్థాలు వాటి తయారీ లక్షణం ప్రయోగం విరుగుడు వంటి అంశాలు చర్చించడం జరిగింది.