🌷 ఎంతో సువాసన ఇచ్చే సంపంగి పుష్పమును దేవుని పూజ లో ఉపయోగించము, కారణము ఏమిటో ,, ఒకానొక కాలంలో ఒక దురాత్ముడు ఉండేవాడు. అయినను అతడు నిత్య శివపూజాసక్తుడు. ప్రతిదినం సంపెంగలచేత శివుని పూజించి ఆయన కరుణాకటాక్ష వీక్షణాలకు పాత్రుడైనవాడు.
🌷 ఆ దేశపు చక్రవర్తినే శాసించగల స్థితికి చేరుకున్నవాడు. చక్రవర్తి అంతటి వాడిని, పాదాక్రాంతుడిగా చేసుకున్న గర్వంతో అతడు ప్రజలను పీడించసాగాడు. కానీ, అతడిపై ఫిర్యాదు చేసినా రాజు పట్టించు కొనేవాడుకాదు.
🌷 ఇలా ఉండగా - అతడు ప్రతిరోజు తన అర్చన (సంపెంగపూలతో) మానివేయకుండా జాగ్రత్త పడుతూవచ్చాడు. ఆ కారణాన అంతులేని శివానుగ్రహానికి పాత్రుడయ్యాడు. నారదుడు ఓసారి భూలోక సంచారార్థం వచ్చినప్పుడు ఈ వైనం అంతా చూశాడు. కానీ ఆయనకు మొదట్లో ఈ దుష్ఠుని అంతర్యం అంతుపట్టలేదు.
🌷 అతడెటువంటివాడని అడగ్గా, సంపంగి బదులివ్వలేదు. కేవలం ఆ దుష్టబుద్ధి అకృత్యాలకు భయపడి సంపంగి మారుపల్కలేదు.
🌷 అయినా దేవర్షి అంతటివాడు అడిగినప్పుడు సత్యం చెప్పాలి కదా! దుష్టుని బెదిరింపు వల్ల చెప్పలేకపోవచ్చు! అసత్యమేల? నారదుడు తరచి తరచి ప్రశ్నించినా తనకేమీ తెలియదంది సంపంగి. అసత్యదోషానికి పాల్పడినందువల్ల 'నేటినుంచీ నీ పూలు శివపూజార్హత కోల్పోవుగాక!' అని శపించాడు నారదుడు.
🌷 అంతవరకు శివప్రీతికరమైన సంపెంగకు శివపాద సన్నిధి చేరే అవకాశం నశించింది.
*(శ్రీ శివ మహాపురాణము నుండి సేకరించిన కధ)*..