శివుడే దేవుడని నేనంటే / Shivude Devudani - శివ భజన పాటల లిరిక్స్


శివుడే దేవుడని నేనంటే

శివుడే దేవుడు కాదంటారు

శివ స్మరణే చేయొద్దంటారు


శంభో శంకర హర హర మహాదేవ  పార్వతిపతియే నమః



శివుడే దేవుడని నేనంటే ||2|| శివుడే దేవుడు కాదంటారు ||2||

శివ స్మరణే చేయొద్దంటారు ||2||


శివయ్య శివయ్య శివయ్య

నీమాయ  ||2||


శివయ్య శివయ్య నీ మాయ తెలియదయ్యా


||శివుడే దేవుడని నేనంటే||


పరమా శివుడని నేనంటే

||2||

పాములాడిస్తడని నింన్నంటారు ||2||


పాములా దారడని నింన్నంటారు  ||2||



శివయ్య శివయ్య శివయ్య

నీమాయ  ||2||


శివయ్య శివయ్య 

నాకు ఏమి తెలియదయ్యా



||శివుడే దేవుడని నేనంటే||


గరళా కంఠుడని నేనంటే

||2||


గంగిరెద్దులోడని నింన్నంటారు  ||2||

గంగిరెడ్లకాస్తడని నింన్నంటారు


శివయ్య శివయ్య శివయ్య

నీమాయ  ||2||


శివయ్య శివయ్య ఎవరు తెలియరయ్యా



||శివుడే దేవుడని నేనంటే||



కాశి విశ్వనాథుడని నేనంటే  ||2||

కాటిలో పండుతడని నింన్నంటారు

కాటికాపలా అని నింన్నంటారు



శివయ్య శివయ్య శివయ్య

నీమాయ  ||2||


శివయ్య శివయ్య ఎవరు తెలియరయ్యా



||శివుడే దేవుడని నేనంటే||


.......…................





శివుడే దేవుడని నేనంటే

శివుడు దేవుడు కాదంటారు

(సదాశివతత్త్వం అందరికీ అంత సులభంగా అర్థంగాదు)


శివుడే గరళ కంఠుడని నేను అంటే

గంగిరెద్దు లోడు అని నిన్ను అంటారు

గంగిరెద్దులు కాస్తాడని నిన్ను అంటారు

(గరళమును కంఠమున నిల్పి సర్వులోకాలను,సమస్తదేవతా మునిజనులనుసదారక్షించున్న వాడు,ధర్మానికి సంకేతమైన గంగిరెద్దుమీద దశదిక్కుల సదా సంచరించుచూ గంగిరెద్దులమైన మనలను సదా కాస్తున్నవాడు

సదాశివుడేనని సదాశివత్త్వంబు ఎఱిగినవారు తప్ప ఇతరులు గ్రహించలేరు.)


శివుడే కాశీ విశ్వనాధుడు అని నేను అంటే 

కాటిలో పంటాడు అని నిన్ను అంటారు

కాటి కాపరోడు అని నిన్ను అంటారు

(కాశీయే మహాశ్మశానమని అందుగల కాటికాపరియే కాశీ విశ్వనాధుడని,కాటికి చేరినవారికి ప్రత్యేకించి కాశీలో తుదిశ్వాస విడుచుసమయాన కుడి కర్ణికలో ప్రణవోపదేశము జేసి ముక్తి ప్రసాదించువాడు ఆ స్వామియే

అని అంతఃకరణమున సదాశివా తత్త్వంబు తెలిసినవారికి తప్ప అన్యులెవరికి తెలుస్తుంది సదాశివ మాయ

ఎవరేమనుకొంటే ఏమిఅది నీకూ నాకూ తెలుసు అదే నీవు జేసే మాయేయని సదాశివా! )

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!