🌹🙏ఘంటా యక్షిణీ సాధన 🙏🌹
సాధన: ఈ ప్రయోగం ఆర్దిక పరిస్థితుల దృష్ట్యా మంచి సాఫల్యాన్ని ప్రసాదిస్తుంది. ఇది అత్యంత మహత్వ పూర్ణమైనది. ఈ ప్రయోగం చేస్తే ఇంటిలోని దారిద్ర్యం పూర్తిగా సమసిపోతుంది. ఈ ప్రయోగాన్ని ఏ బుధవారం నాడయినా ప్రారంభించవచ్చు. ఈ ప్రయోగం రాత్రి వేళ మాత్రమే చేయాలి. ఎదుట ఎర్రని వస్త్రాన్ని పరచి దానిపై "నక్క కొమ్ము" ఉంచాలి. ("నక్క కొమ్ము" ను Jackal Horn / Siyar Singi అని వ్యవహరిస్తారు. ఇది పూజ సామగ్రి అమ్మే దుకాణాలలో లబిస్తుంది). అగరు వత్తులు, దీపం వెలిగించాలి.
సాధకులు ఉత్తర ముఖంగా కూర్చోవాలి. ఎదుట కర్ర ఆసనం పై ఎర్రని వస్త్రాన్ని పరచి దానిపై నక్క కొమ్ము ఉంచాలి.
🌹మంత్రం:-🌹
"ఓం ఐం సర్వ సమృద్ధిం దేహి దాపయ స్వాహా"
అన్న మంత్రాన్ని 21 మాలలు (21 x 108) అంటే మొత్తం 2268 సార్లు జపించాలి. 2268 సార్లు మంత్ర జపం పూర్తి చేసిన తరువాత "నక్క కొమ్ము" ను మీ పూజ చేసే ప్రదేశం లే పెట్టుకుని ఈ మంత్రాన్ని నిత్యమూ 21 సార్లు లేదా 108 సార్లు జపిస్తూ వుంటే చాలు. ఈ ప్రయోగం వలన ఇంటిలోని దారిద్ర్యము పూర్తిగా తొలగిపోతుంది మంచి ఆర్ధిక ప్రగతి లబిస్తుంది.
నక్క కొమ్ము అంటారు అది నక్క నుండి తీస్తారు ఇది వరకు కొన్ని తాంత్రిక ప్రయోగల్లో ఎక్కువగా వాడేవారు, వ్యాపార వృద్ధి, శత్రు భయ నాశనం లాంటి వాటిలో నక్క కొమ్ము అని అడిగితే షాప్ లో ఇస్తారు...
🌹శ్రీ మాత్రే నమః🌹