ఇక్కడ చెట్టు కొమ్మలో కనిపిస్తున్న ఈ బల్లి అరుణాచలం గుడిలో పిడారీఅమ్మన్ సన్నిధిలో ఉంటుంది ఇవి కనిపిస్తే మహా భాగ్యం గా అదృష్టం గా భావిస్తారు ఇక్కడ వీటిని బల్లులు అనే పదం తో పిలవరు ఆ మాట కూడా అనరు ఎందుకంటే వీటిని 7 కనిపిస్తే సప్తమాతృకలుగా, రెండే దర్శనం ఇస్తే పార్వతిపరమేశ్వరులు గా ఇలా పిలుచుకునే ఆనందిస్తుంటారు..
బల్లి మన ఇంట్లో ఉంటే మన తోట చట్టల్లో ఉంటే ఎంత చిరాకు పెడతాము కదా, పుట్టకు పాలు పోసి పూజ చేస్తాము అక్కడ కానీ ఒక పాము దర్శనం కానీ అయితే ఆమె మహాభక్తురాలు నాగమ్మ దర్శనం ఇచ్చింది అంటాము అదే పాము ఆమె ఇంటికి వస్తే కర్రలతో కొడతారు ప్రాణభయం
నీటిలో ఉండగా ముసలి ఏనుగుని కుడా బందించగలదు అదే ముసలి గట్టు పైకి వస్తే కుక్క కూడా మొరుగుతుంది
ఇదే స్తాన బలం అంటే ఎవరి స్థానంలో వారు ఉండాలి అదే గౌరవం ఎవరి స్థాయిలో వారిని ఉంచాలి అదే మంచిది , మనది కానీ చోట మన మాట వినని చోట వాదించకూడదు మన విలువ మనము తగ్గించుకోకూడదు... స్తాన బలం చాలా గొప్పది , కళ్ళు కొట్టు దగ్గర నిలబడి పాలు తాగితే అది పాలు అని ఎవరూ అనరు , ఒకరిని నమ్మించాల్సిన అవసరం మాకు లేదు మెమెంటో మాకు తెలుసు అని దబాయిస్తారు కొందరి మరి ఈ సమాధానం కూడా ఎందుకు చెప్తున్నారు మీ గురించి తప్పుగా అనకూడదు అనే కదా అప్పుడు తప్పు అని ఒప్పుకుంటునట్టే కదా.. మనము ఇంకొకరు మెచ్చుకునే లాగా బతకాల్సిన అవసరం లేదు కానీ మనకు మనము నిజాయితీగా సమాధానం చెప్పుకోగలుగుతున్నామ తెలుసుకోవాలి...
కంటికి దగ్గర ఉంటే అది దేవుడైన కనిపించడు కంటికి కాస్త దూరంగా ఉంటేనే అది ఏంటి అనేది అర్థం అవుతుంది..
సేకరణ:- 🌿#శుభమస్తు🌿