18. కొండగట్టులో వెలసిన అంజన్న నీ పూజకు పువ్వులు తెచ్చినమయ్యా | Kondagattulo velisina Anjanna | హనుమాన్ భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

18. కొండగట్టులో వెలసిన అంజన్న నీ పూజకు పువ్వులు తెచ్చినమయ్యా | Kondagattulo velisina Anjanna | హనుమాన్ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

కొండగట్టులో వెలసిన అంజన్న
నీ పూజకు పువ్వులు తెచ్చినమయ్యా
మెడలో దండలు వేసినమయ్యా
అభయమునిచ్చి ఆదుకో అంజన్న
||కొండగట్టులో వెలసిన||
నిన్ను కొలువని భక్తులు లేరు
నిన్ను కొలువని జనులే లేరు
భక్తకోటికి అండగా ఉంటూ
భయభ్రాంతులను తొలగించేవు

బాధలు తీర్చే బంధువు నీవై
కొండగట్టుపై కొలువున్నావయ్యా
||కొండగట్టులో వెలసిన||   
పూలు పండ్లతో పూజలు నీకు
అన్న పూజలతో అర్చన నీకు
జిల్లేడాకుల దండలు నీకు
తమలపాకుల మాలలు నీకు

గుండెల నిండా భక్తి నింపుకొని
దండిగా పూజలు చేస్తున్నామయ్యా
||కొండగట్టులో వెలసిన|| 
చందన తేజం నీదేనయ్యా
సింధూర వర్ణం నీదేనయ్యా
వాడవాడనా పూజలు అందే
వానర వీరుడు నీవేనయ్యా

శక్తి స్వరూపుడు నీవేనయ్యా
భక్త వరదుడు నీవే అంజన్న
 ||కొండగట్టులో వెలసిన|| 
పాడి పంటలు పైలంగా చూసే
పవన సుతుడవు నీవేనయ్యా
పిల్లజల్లలను చల్లంగా చూసే
మారుతి వీరుడు నీవేనయ్యా

మహిమలు గల కొండగట్టులో
మమ్ముల నేలగా వెలసిన అంజన్న
||కొండగట్టులో వెలసిన|| 

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow