నల్లనివాడైనా గోవిందుడు చల్లనివాడోయి
గోపాలకుడైనా గోవిందుడు గిరిధరుడతడోయి॥
గోపాలకుడైనా గోవిందుడు గిరిధరుడతడోయి॥
కోరస్: నల్లనివాడైనా గోవిందుడు చల్లనివాడోయి
గోపాలకుడైనా గోవిందుడు గిరిధరుడతడోయి॥
పిల్లనగ్రోవితో పిలిచేవాడు ఎల్ల జగంబుల బ్రోచేవాడు॥
కల్లలెరుంగని యశోద తనయుడు ముల్లోకాలకు మూలపురుషుడు
కల్లలెరుంగని యశోద తనయుడు ముల్లోకాలకు మూలపురుషుడు॥
కోరస్: నల్లనివాడైనా గోవిందుడు చల్లనివాడోయి
గోపాలకుడైనా గోవిందుడు గిరిధరుడతడోయి॥
గీతలు ఎన్నో మార్చినవాడు గీతార్థము బోధించినవాడు॥
అండపిండ బ్రహ్మాండమందున నిండియున్న సర్వేశ్వరుడతడు
అండపిండ బ్రహ్మాండమందున నిండియున్న సర్వేశ్వరుడతడు॥
కోరస్: నల్లనివాడైనా గోవిందుడు చల్లనివాడోయి
గోపాలకుడైనా గోవిందుడు గిరిధరుడతడోయి॥
పాలు వెన్నా ఆరగించి గోపకన్నెలకు చిక్కినవాడు॥
తులసి దళమునకు దక్కినవాడు భక్తి బంధమున చిక్కినవాడు
తులసి దళమునకు దక్కినవాడు భక్తి బంధమున చిక్కినవాడు॥
కోరస్: నల్లనివాడైనా గోవిందుడు చల్లనివాడోయి
గోపాలకుడైనా గోవిందుడు గిరిధరుడతడోయి॥
