Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

62. అలుకా మానవా పలుకావేమిరా వినాయకా | Aluka maanava paluka vemira vinayaka | వినాయక భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
అలుకా మానవా పలుకావేమిరా వినాయకా
కరుణించరావయ్యా కన్న తండ్రి వినాయకా
॥ అలుకా ॥
మూషిక వాహనా మూలపురుషుడా వినాయకా
ఆపదబాంధవా అనాథరక్షక వినాయకా
నిన్ను నమ్మిన వారిని విడువకుమయ్యా వినాయకా
నీవు లేనిదే మాకు దిక్కెవ్వరు వినాయకా
॥ అలుకా ॥
సిద్ధి బుద్ధి ప్రదాత శివసుతుడవు వినాయకా
విఘ్నములను తొలగించు విఘ్నేశ్వరుడవు వినాయకా
పొరపాట్లు జరిగినా క్షమించవయ్యా వినాయకా
నీ పాదసేవలో తరింపజేయరా వినాయకా 
॥ అలుకా ॥
గజాననా గౌరీపుత్రుడవు వినాయకా
భక్తమందార సుందరరూప వినాయకా
నిత్యము నిన్నే కొలిచే భాగ్యము ఇవ్వరా వినాయకా
నీ కరుణా కటాక్షములే మాకు తోడుగా వినాయకా
॥ అలుకా ॥
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow