*హనుమ బోధించిన కాల మహిమ ,కలియుగ లక్షణాలు:*
— ” శక్తి పురం అనే దేహం లో శ్రేష్ట మైన ప్రాణాన్ని ,ఆవేశించి ,క్రియా శక్తి అవుతుంది .అది ,వ్యక్తీ జ్ఞానేంద్రియ ,కర్మేంద్రియాల తో కూడి ,ప్రాణం గా మారుతోంది .అదే ప్రాణా తీత మైన పరమ మైనది గా ,భావించి ,శక్తి గా ,ఉపాశించి నపుడు ,చిత్ శక్తి గా భావిస్తారు .ఆ చిత్ శక్తి నే శ్రీ అంటారు .శ్రీ యొక్క గుణో పాసకులే శ్రీ విద్యోపాసకులు .
జీవుని ఉచ్వాస నిస్శ్వాసాలు ప్రాణ తరంగాలే కాని ప్రాణం మాత్రం కాదు .సముద్ర తరంగాలు శక్తి కాదు .శక్తి విలాసమే తరంగాలు .వాయువు క్రియా ప్రాణం కాదు .జీవులలో ప్రాణ శక్తి ,ఉచ్చ్వాస ,నిస్శ్వాసాలతో క్షీణిస్తుంది .ఆత్మ శక్తి పేర గాలంటే ,కాళీ మాతను ఉపాసించాలి .ఈ విద్య ఇహం లో భోగ భాగ్యాలను ,చివరికి మోక్షాన్ని ఇస్తుంది .
భీమా !ఈ విద్యనే వేదం ”సంసర్గ విద్య ”అంది .”ముఖ్య ప్రానోద్గీత విద్య ”గా పేర్కొంది .ఆ ముఖ్య ప్రాణాన్ని నేనే .నన్ను ఉపాశిస్తే ,కాలాతీతులౌతారు ..త్రికాలజ్నులు అవుతారు .జన్మ రాహిత్యం పొందు తారు .నువ్వు నా సోదరుడివి కనుక ఈ రహశ్యాలన్నీ నీకు చెప్పాను ”అని కాల మహిమను హనుమ భీమ సేనునికి బోధించాడు .భీముడు పరమానంద భరితుడయాడు .”అన్నా ఆంజనేయా !జీవ భ్రాంతి తో కొట్టు కో పోతున్న మా లాటి వారికి కాల తత్వాన్ని ,పరమార్ధాన్ని సవివరం గా బోధించావు .మనుషులు సుఖాలన్నీ తమ ప్రయోజకత్వం అనీ ,కష్టాలకు కారణం ఇతరులని చెప్పు కొంటారు .లేక పొతే కాలాన్ని నిందిస్తారు .కాని కాలాన్ని ,పరమాత్మ తత్త్వం గా ఉపాశించటం మరిచి పోయారు .”అని భీముడు కృతజ్నత తెలియ జేశాడు .
హనుమ బోధించిన కలియుగ లక్షణాలు
” భీమ సేనా! భయంకర మైన కలియుగ లక్షణాలు విను .కృత ,త్రేతా ,ద్వాపర యుగాలలో ధర్మం ఒక్కొక్క పాదం కోల్పోయింది .కలియుగాన్తానికి ధర్మం ఏమీ మిగలదు .ద్వాపరం నువ్వు చూస్తూనే వున్నావు కదా . .
కలి లో కాలాను గుణ వర్శాలుండవు .చల్లిన విత్త నాలు పొల్లు పోతాయి .కరువు పీడిస్తుంది .పొట్ట గడ వక ,జనం వలసలు పోతారు .తేలిక పంటలే ఎక్కువ .భూమి నిస్సార మవుతుంది .పువ్వు లలో వాసన వుండదు .తినే వాటిలో సారం వుండదు .ప్రజలు దుర్బలులు అవుతారు .రోగాలేక్కువ .మరుగుజ్జులు గా తయారవు తారు .అల్పాయుస్స్సు .కలి లో పూర్నా యుర్దాయం ఇరవై ఏళ్ళు మాత్రమే .ఏడు ,ఎనిమిది ఏళ్ళ కే స్త్రీలు సంతానం పొందు తారు .
వివాహ ,దాంపత్య వ్యవస్తలు భ్రష్టం అవుతాయి .సంపాదన వున్న భర్తనే భార్య గౌర విస్తుంది .స్వేచ్చా ప్రవ్రుత్తి అందరి లోను ఎక్కువ .భార్య ,భర్తలు ,గురు శిష్యులు ,వంచన కు గురి అవుతారు .అత్త మామలను కోడళ్ళు లెక్క చేయరు .తలిదండ్రులను పిల్లలు గౌరవించరు . .క్రయ, విక్రయాల్లో అంతా కపటమే .దాచుకొన్న సొమ్ము దోపిడీకి గురి అవుతుంది .పుణ్యం ,పాపం ,స్వర్గ ,నరకాలను లెక్క చేయరు .శాస్త్ర పాండిత్యం తక్కువ .వాగాడంబరం ఎక్కువ .వేద నిందా చేస్తారు .శాస్త్రం మీద విశ్వాసం వుండదు .ఆత్మ విచారణ చేయరు .
స్త్రీ లకు కేశాలే అలంకారం .ధన వంతున్నే కొలుస్తారు .ఆవు పాలు లభించవు .ఆవు మీద పవిత్ర భావం వుండదు .బ్రాహ్మణున్ని లెక్క చేయరు .హింస ఎక్కువ అవుతుంది .అన్నిటికీ ప్రమాణం చేస్తారు,దానికి కట్టు బడరు .స్వార్ధం తో ధర్మాన్ని వదిలి పర ధర్మాన్ని అనుసరిస్తారు .స్త్రీలు వ్యభిచరిస్తారు .కుల గోత్రాలు పాటించరు .బహు భార్యాత్వం ,బహు బత్రుత్వం ఎక్కువ అవుతాయి . .వర్ణ వ్యవస్థకూలి పోతుంది .డబ్బు వున్న వాడే రాజు .అంతా ధన ప్రభావమే .దొంగలే రక్షకులు .నటులే ప్రభువు లవు తారు .అందరూకవులే .పాలకులు ప్రజల్ని పట్టించు కోరు .ప్రజల ,ధన ,మాన ప్రాణాలకు రక్షణ వుండదు . .
దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలు పెట్టె దిక్కుండదు .దేవుడి భూముల ఆక్రమణ ఎక్కువ .దైవ దర్శనానికి డబ్బు గుంజు తారు .నిషిద్ధ వస్తువులనే తింటారు .భక్తి అనేది సంపాదనకు మార్గం అవుతుంది .మాంసా హారులే ఎక్కువ .బ్రాహ్మణులు కుక్కల్ని పెంచుతారు .ప్రజలు అనాధలను ,స్త్రీ లను హింసిస్తారు .దొంగలు ,నాస్తికులు ,పాషండులు పాలకులవుతారు .రక్షకులే భక్షకులవుతారు .
కలి కాలమ్ చివర లో రాజ్యాల మధ్య శత్రుత్వం పెరిగి పోతుంది .మహా భయంకర యుద్ధాలు చేల రేగుతాయి .విశ్వ ప్రాణి నాశనం అవుతుంది .కొద్ది మంది మాత్రం వేదం నేరుస్తారు .తిరిగి క్రమం గా ప్రజల్లో ధార్మిక భావం పెరుతుంది .వైదిక ధర్మం మళ్ళీ పరమ వైభవ స్తితి లోకి వస్తుంది .రాజులు ,ప్రజలు ధర్మ బద్ధం గా ప్రవర్తిస్తారు .ఆ ధర్మ చాయలో ప్రజలంతా ,శాంతి సౌభాగ్యాలతో హాయిగా ,సుఖం గా ,ఆనందం గా జీవిస్తారు ”అని హనుమ ,భీమ సేనునికి కలియుగ ధర్మాలను ,లక్షణాలను సవివరం గా తెలియ జేశాడు .భీముడు పరమానందం పొందాడు .
*సశేషం....*