శబరి కొండలలో / ShabariKondalalo - అయ్యప్ప భజన పాటల లిరిక్స్


శబరికొండలలో ఆ బంగరు కోవెలలో   ||2||

వెలసితివా ఆ శిఖరముపైకి  జ్యోతి స్వరూపముతో  ||2||

శిలగా వెలిశావే మా దేవుడవై నావే  ||2||

||శబరి కొండలలో||

తులసి మాలను మెడను ధరించి
ఇరు సంధ్యలలో స్నానము చేసి ||2||

పూజలు చేశామే నీ భజనలు చేశామే  ||2||

||శబరి కొండలలో||

స్వామి శరణమే జప మంత్రముగా
విషయ వాసనలు తృణ ప్రాయముగా  ||2||

సాధన చేశామే నీ భక్తులమయ్యామే  ||2||

||శబరి కొండలలో||

ఇరుముడి మూటను శిరమున దాల్చి
వావరు స్వామిని తోడుగా చేసి    ||2||

త్రోవను చూపావే మా గమ్యము చేర్చావే  ||2||

||శబరి కొండలలో||

పంబా నదిలో స్నానము చేసి 
పదునెట్టాంబడి 
అధిరోహించి  || 2||

దర్శనమోంద్యామే 
నీ ధన్యత పొంద్యామే ||2||

||శబరి కొండలలో ||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!