జీవుడు ఉన్నంత వరకు / Jeevudu unnantha varaku - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

జీవుడు ఉన్నంత వరకు మనం వెళ్ళాలి శబరిమలకు
హరి హర నామం పలుకు మన బాధలు తానే తొలుగు
స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప


కార్తిక మాసమున నీ మాలలు వేసుకొని.  (2)
నలుబది దినముల దీక్షతో. (2)
నీ సన్నధి చేరేము ఇరుముడి తీసుకు వచ్చేమూ...(2)
స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప


స్వామి కి ఆభరణ అలంకారం
దానిని చూస్సే తొలగును అహంకారం (2)
శరణమనే ఓంకారం..... (2)
సర్వం మందుల లింగారం. (2)
స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప


ఆశలు వచ్చును అలలాగ
జ్యోతి చూస్తే తొలగును బుడగలాగ.  (2)
చాలు చాలు మనకింక (2)
వలదు వలదు ఈ జన్మ
వలదు వలదు ఈ నర జన్మ
స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!