ఆదిదేవుడవు నీవయ్య - వినాయక భజన పాటల లిరిక్స్ - Aadi devudadu neevayya

ఆదిదేవుడవు నీవయ్య అందరి దైవం నీవయ్య
అంధకారములో ఉన్న వారిని వెలుగులోకి తేవయ్య
గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా


నీ పూజలు చేయనిదే ఏ పూజలు చేయరయా
నీ నామం పలకనిదే ఏ నామం పలకరయా
గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా


తల్లి మాటను పాలించుటకై తండ్రినే ఎదురించిన ఘనుడవయ్య
తల్లిని తండ్రిని మించిన దైవం వేరే లేదని చాటితివయ్యా
గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!