🕉☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️
ఎంతోకాలంగా మీ ఉప్పు తింటూ బ్రతుకుతున్నవాడిని ! మహారాజుకు నేను చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో లేరు ! అందుకే మిమ్మల్ని హెచ్చరించడం నా బాధ్యతగా భావించి వచ్చాను ’ అన్నాడు చేతులు కట్టుకుని నిలుచుని !
అతని మాటలు అర్థం కానట్లు చూస్తూ *‘‘మీరు చెప్పదలచుకున్నదేమిటో సూటిగా చెప్పండి !’’* అన్నది రాణి !
*‘‘చెబుతాను మహారాణి ! అది నా బాధ్యత ! మీరే నిదానంగా ఆలోచిస్తే నేను చెప్పేది నిజమని ఒప్పుకుంటారు ! ధర్మబద్ధంగా మీకు జన్మించిన పుత్రునికి మారుగా మహారాజు అడవిలో లభించిన అనాథ బాలుడికి పట్టం కట్టడం అన్యాయం కాదా ? అతనిపై వాత్సల్యానురాగాలు మొదటినుండీ ఎక్కువే మహారాజుకు ! స్వంత పుత్రుడిని పెంపుడు పుత్రునిగా చూస్తూ అతనికి న్యాయంగా రావలసిన సింహాసనంపై తమకిష్టమైన వారిని కూర్చోబెట్టాలని చూస్తున్నారు ! ఈ విషయం మీతో ముందుగా చెప్పకుండా సభలో ప్రకటించడం గమనిస్తే మీరందుకు అంగీకరించరన్న అనుమానం వారికి కలిగివుంటుంది ! అందుకే మాట మాత్రమైనా మీతో చెప్పకుండా వారే నిర్ణయం తీసుకున్నారు ! అమాయకుడు , ఉత్తమ రాజవంశంలో జన్మించిన మీ పుత్రుడిని భావి మహారాజుగా ఊహించుకుంటూ వచ్చా ఇంతకాలంగా ! ఇపుడు ఆ అడవిలో లభించిన తనకి మంత్రిగా సేవ చేయడం నాకు సమ్మతం కాదు. అందుకే నా పదవి త్యాగం చేసి మహారాజుకు చెప్పకుండా రాజ్యం విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను ! మీకు , మీ పుత్రుడికి జరుగుతున్న అన్యాయాన్ని ఆపలేని ఈ నిస్సహాయుడిని. ఎప్పుడూ మీ మంచే కోరే ఈ సేవకుడిని మన్నించి వెళ్లడానికి అనుమతి ప్రసాదించండి !’’* కళ్లనుండి జలజలా నీరు కారుతుంటే రుద్ధకంఠంతో అన్నాడు మంత్రి !
అతను ఊహించినట్లే అతి వినయం నటిస్తూ శ్రేయోభిలాషిలా అతను అన్నమాటలు రాణిమీద విపరీత ప్రభావం చూపాయి ! అంతవరకు మణికంఠుని పట్ల ఆమెకుండిన వాత్సల్యానురాగాల స్థానంలో కోపావేశాలు చోటుచేసుకున్నాయి. తన కుమారునికి రావలసిన సింహాసనాన్ని అతను అధిష్ఠించడం అన్యాయం , అక్రమం అన్న భావాలు బలపడ్డాయి !
అందుకే చివాలున లేచి అటూ ఇటూ పచార్లు చేస్తూ *‘‘వీల్లేదు ! నా కుమారునికి అన్యాయం జరగడం నేను సహించలేను ! మణికంఠునికి పట్ట్భాషేకం జరగనివ్వను !’’* అంటూ మంత్రివైపు చూసింది !
విచారం నిండిన ముఖంతో కళ్ళు వత్తుకుంటూ నిలిచిన మంత్రిని తమ మేలు కోరేవాడిగా తలచింది !
అతనివైపు సానుభూతితో చూస్తూ *‘‘మహామంత్రి ! మీ వంటి విశ్వాస పాత్రులు మా అండగా వుండటం నిజంగా మా అదృష్టం ! ఈ అనర్థాన్ని ఆపే ఉపాయం ఏదైనా వుంటే మీరే చెప్పాలి ! నాకు ఏమీ తోచటంలేదు ! కానీ ఎట్టి పరిస్థితిలోనూ మణికంఠుడు మాత్రం సింహాసనం అధిష్ఠించకూడదు !’’* అన్నది కఠినత్వం నిండిన స్వరంతో !
ఆ మాట కోసమే ఎదురుచూస్తున్న మంత్రి ముఖం వికసించింది.
*‘‘నా బాధను మీరు అర్థం చేసుకున్నందుకు సంతోషిస్తున్నాను మహారాణి ! ఇప్పుడు మీరు తలచుకుంటేనే ఆ పని సాధ్యవౌతుంది ! మీ మాట విని ఒకవేళ మహారాజు మనస్సు మార్చకుని మీ పుత్రుడికే పట్టం కట్టినా మణికంఠుడు కోపంతో మీ పుత్రునికి హాని కలిగించే అవకాశం వుంది.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏