Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

46. Nakabali Vidhanam | నాకబలి విధానము | Veerashaiva Purohitam

P Madhav Kumar
ధార ఎరచిన పిదప నాలుగవ దినమునందు రాత్రి పురోహితుడు వివాహ మండపములో రంగవల్లి ముగ్గులతో సరోవరముగా వ్రాసి, దాని మధ్య ఎనిమిది దళములుండిన కమలమును వ్రాసి, దాని చుట్టు బియ్యముతో గోడవలె నొక గీతను వదలి, కమలము మధ్యన ఐదు రంగులుగల హంస శుకాదులను వ్రాయవలెను. సరోవరమునకు కుడి ప్రక్కన బియ్యముతో ఏనుగును, ఎడమ ప్రక్కన ఉప్ప ఏనుగును ఇవి రెండును ఎదురెదురుగా నుండునట్లుగా వ్రాసి, సరోవరము మధ్యన పూలమాలలతో నలంకరించిన ఖడ్గమునుంచి, సుగంధ విశిష్ట ములైన రంగునీటితో నింపిన రెండు పూర్ణ కుంభములనుంచి, పుష్పాదులతో నలంకరించి, సరోవరమునకు ఉత్తర భాగమున ఒకటి రౌతు [సిల] పై నొకటి బెల్లముపడి యచ్చులో జిలుకరాను నింపి ఉంచి, చుట్టు దీపములను వెలిగించి, [మంగళ వాయిద్యాలు మ్రోగుచుండ] వరుడు పత్నీసమేతముగా సరోవరమునకు పడమర దిశలో పీటలపై గూర్చుండి ప్రాణాయామము నాచరించవలెను.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow