44. స్వర్ణగౌరీ వ్రతము | Swarna Gouri vratamu | Veerashaiva Purohitam
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

44. స్వర్ణగౌరీ వ్రతము | Swarna Gouri vratamu | Veerashaiva Purohitam

స్వర్ణగౌరీ వ్రతము :- ఈ వ్రతమును భాద్రపదశుద్ధ [శుక్ల] తృతీయతిథియందు ఆచరించవలెను. సంకల్ప దేశకాలాదులను బేర్కొని,

మంత్రము :- 
“మమఇహజన్మని జన్మాంతరేచ అక్షయ సౌభాగ్యప్రాప్తి కామాయాః పుత్రపౌత్రాది ధనధాన్య ఐశ్వర్యప్రాప్త్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం స్వర్ణగౌరీవ్రతమహం కరిష్యే” అని సంకల్పించి

మంత్రము :- 
“దేవదేవి సమాగచ్ఛ ప్రార్థయేహం జగన్మయే । ఇమాం మయాకృతాం పూజాం గృహాణ సురసత్తమే”

అని యుచ్చరించి గౌరీ దేవిని ఆవాహించునది, ఆ మీదట

మంత్రము :- 
“భవానీత్వం మహాదేవి సర్వసౌభాగ్యదాయకి । అనేక రత్న సంయుక్తం ఆసనం ప్రతిగృహ్యతాం”

అని చెప్పి ఒక బిల్వపత్రిని ఉంచి,

మంత్రము :- 
“సుచారుశీతలం దివ్యం నానాగంధ సువాసితం । పాద్యం గృహాణ దేవేశి మహాదేవి నమోస్తుతే”

అని పాద్యోదకముతో నభిషేకించి,

మంత్రము :- 
“శ్రీ పార్వతీ మహాభాగే శంకర ప్రియవాదిని । అర్ఘ్యం గృహాణ కల్యాణి భర్తృ సహపతివ్రతే”

[బంగారు రేకుతో గౌరీ ప్రతిమను జేయించి దానిని బూజించవలెను. షోడశోపచారములతో సమయానుసారముగా బూజించవలెను.]

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow