హరతాలికా వ్రతము :- [ఈ వ్రతమును మాంగల్యాపేక్షులైన కన్యకలతో నాచరించబడును.] ఇది భాద్రపదశుక్ల తృతీయ తిథియందాచరించదగును. ఆ దినమున కన్యక నదినుండిగాని, వాగునుండిగాని, ఇసుకను దెచ్చి దానితో ఈశ్వరుని [లింగాకారమును] జేసి బూజించవలెను.
సంకల్పము :- వ్రతమునాచరించు కన్య దేశకాలాదుల నుచ్చరించి
మంత్రము :-
“మమసమస్త పాపక్షయ పూర్వక సప్తజన్మ సౌభాగ్యాది వివిధ భోగప్రాప్తి ద్వారా ఉమామహేశ్వర ప్రీత్యర్థం ఆచరితం హరతాలికా వ్రతపూజనమహం కరిష్యే”
అని సంకల్పించి, పూర్వోక్త ఉపచారములతో [ఇసుకతో జేయబడిన] మహాదేవ మూర్తిని [విగ్రహాన్ని] బూజించవలెను. పిదప యథాశక్తి మాహేశ్వరులను తృప్తి పరచవలెను.
[ఇతి హరతాలికావ్రతము]
అని సంకల్పించి, పూర్వోక్త ఉపచారములతో [ఇసుకతో జేయబడిన] మహాదేవ మూర్తిని [విగ్రహాన్ని] బూజించవలెను. పిదప యథాశక్తి మాహేశ్వరులను తృప్తి పరచవలెను.
[ఇతి హరతాలికావ్రతము]