పల్లీ (బల్లి) సరట (ఊసరవెల్లి-తొండ) ఈ ప్రాణులు తాకగానే (ముట్టగానే) స్నానముజేసి, గురు, జంగమముల పాద తీర్థమును స్వీకరించి, నెయ్యిని జూచి, దేశ కాలాదులను ఉచ్చరించి,
మంత్రము :-
“మమపల్లీ పతనజనితాశుభఫలనాశార్థం శుభఫలాభి వృద్ధ్యర్థం పల్లీపతనంవా (సరటారోహణ) శాంతిం కరిష్యే” అని సంకల్పించి, గణేశపూజ, పుణ్యాహవాచనము, ఆచార్యవరణాదుల నాచరించవలెను. తదుపరి ఆచార్యుడు యథావిధి కలశమును స్థాపించి, దానిపైన రుద్రమూర్తిని, బంగారముతో జేయబడిన పల్లీ విగ్రహాన్ని, అథవా సరట (తొండ) ప్రతిమను ఉంచి రెండు ఎరుపు వస్త్రములను వాటిపై గప్పి, షోడశోపచారములతో బూజించునది. తరువాత అగ్ని ప్రతిష్ఠాపన యొనర్చి ఆజ్య భాగాంతముగా హోమము నాచరించి
మంత్రము :-
మంత్రము :-
“త్ర్యంబకంయజామహే...మామృతాత్” అను మృత్యుంజయ మంత్రముతో, తిల-ఖదిరసమిత్తులతో నూటా యెనిమిది [108] ఆహుతుల నొసగి కలశోదకముచేత యజమానుని అభిషేకించి, బంగారము, వస్త్రము, నువ్వులు, ప్రతిమలను ఆచార్యునకు దానముగా నొసగి యథాశక్తి గణతృప్తి గావించవలెను.
[ఇది శాంతి ప్రకరణములో పల్లీ సరట పతనశాంతి సమాప్తము]
[ఇది శాంతి ప్రకరణములో పల్లీ సరట పతనశాంతి సమాప్తము]