పల్లవి
అతి బలవంతా హనుమంతా
నీవేలే నా మనసంతా
ఎచ్చట భజనలు జరుగుతువున్నా-"2"
అచ్చట నీవు వుందువటా
అతిబలవంతా హనుమంతా. నీవేలే నా మనసంతా
చరణం 1
పరమ పురుష ఓ పవన సుతా
శ్రీ రామునికే నిజ దూత
అమితానందం నీ చరిత"2"
పరమానందం నీ ఘనత
అతిబలవంతా హనుమంతా. నీవేలే నా మనసంతా
చరణం 2
అంజని తనయా ఓ ఆంజనేయా
దయగనుమా ఓ దయామయా
అమితానందం నీ చరిత"2"
పరమానందం నీ ఘనత
అతిబలవంతా హనుమంతా. నీవేలే నా మనసంతా
చరణం 3
భజనలు చేసే భక్తుల బ్రోవగ
ఇలలో వెలసిన హనుమంత
భూతము నీ పేరు విన్నంత "2"
భయపడి పరుగున అల్లంత
అతిబలవంతా హనుమంతా. నీవేలే నా మనసంతా
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
