మన భారతీయ సాంప్రదాయంలో పుట్టిన రోజు ఎలా జరుపుకోవాలి సరి ఐన పద్ధతి..🌷
పద్ధతి :
.
1) ఉదయమే లేచి అభ్యంగన స్నానం చెయ్యాలి . ( తలకు , వంటికి నూనె రాసుకొని చేసేది అభ్యంగన స్నానం అంటారు ).
.
స్నానంతరం కొత్త బట్టలు కట్టుకునిదైవస
న్నిధిలో...
.
2)ఆవుపాలు , బెల్లం , నల్ల నువ్వులు కలిపిన మిశ్రమాన్ని 3 సార్లు తీర్థం పుచ్చుకున్నట్లు తీసుకోవాలి
( అందువల్ల వచ్చే సంవత్సరం వరకూ గండాలు రాకుండా ఉంటాయి )
.
3)పుట్టిన రోజు చేసుకునేవారు గానీ , పెద్దలు గానీ సప్త చిరంజీవుల పేర్లను తలచుకోవాలి
.
సప్త చిరంజీవులు.
.
చిరంజీవులు అంటే చిరకాలం జీవించిఉండే వారు అని అర్థం. కానీ అంతం లేని వారని కాదు.
.
పుట్టినరోజు నాడు పఠించవలసిన శ్లోకం.
అశ్వత్థామా బలి ర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః |
కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః ||
.
దీనిని బట్టి తెలిసేదేమనగా అశ్వత్థామా, బలిచక్రవర్తి, వ్యాసుడూ (కృష్ణద్వైపాయనుడు) హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు. వీరు ఏడుగురు చిరంజీవులు.
{ పై విషయాలను శ్రీయుత చాగంటి కోటేశ్వర రావు గారి ప్రసంగం నుండి గ్రహించినవి}
.
4 ) 5 రంగుల బియ్యం తో ఒక చోట స్వస్తిక్ గుర్తు ఏర్పాటు చేసి దానిలో 5 దీపాలు , పెద్దవారితో వెలిగింపచేయ్యాలి . వాటిని వెలిగించుతూ దీప ప్రజ్వలన మంత్రాలు చెప్పాలి. లేదా ఓం కారం జపించండి
.
5 ) ఆయుష్య సూక్తం చదువుతూ పుట్టిన రోజు జరుపుకుంటున్న వారిని ఆశీర్వదించాలి .
.
వారిని వీపు మీద నిమరాలి .
.
6) ఇంటిలో గానీ , గుడి లో గానీ రుద్రాభిషేకం చేయించాలి .
.
7 ) చెయ్యగలిగిన సహాయం ఇతరులకు చెయ్యాలి ( దానం )లేకపోతే ఆవుకు పచ్చిగడ్డి తినిపించాలి
.
8 ) చక్కటి ఆరోగ్యవంతమైన భోజనం చెయ్యాలి
.
9) ఆ రోజు రాత్రి భ్రహ్మ చర్యం పాటించాలి
.
10 ) చిన్న పిల్లలకి ప్రతీ మాసం ( మొదటి ఏడాది ) అదే తిది రోజున పుట్టిన రోజు చెయ్యాలి .
.
సంస్కృతం లో పుట్టిన రోజు శుభాకాంక్షలు
.
జన్మదిన మిదం అయి ప్రియ సఖే ! సంత నోతు హి సర్వదా ముదం
ప్రార్ధయామహే భవ శతాయుషీ ఈశ్వరం సదా త్వాం చ రక్షతు
పుణ్య కర్మణా కీర్తి మార్జయా జీవనం తవ భవతు సార్ధకం