*బ్రహ్మ మురారి సురార్చిత లింగం* - బ్రహ్మ, విష్ణు, దేవతల చేత పూజింపబడ్డ లింగం.
*నిర్మల భాషిత శోభిత లింగం* - నిర్మలమైన మాటల చేత అలంకరింపబడ్డ లింగం.
*జన్మజ దుఃఖ వినాశక లింగం* - జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగం.
*తత్ ప్రణమామి సదా శివ లింగం* - ఓ సదా శివ లింగం నీకు నమస్కారం !
*దేవముని ప్రవరార్చిత లింగం* - దేవమునులు, మహా ఋషులు పూజింప లింగం.
*కామదహన కరుణాకర లింగం* - మన్మధుడిని దహనం చేసిన, అపారమైన కరుణను చూపే చేతులు గల శివలింగం.
*రావణ దర్ప వినాశక లింగం* - రావణుడి గర్వాన్ని నాశనం చేసినట్టి శివ లింగం.
*తత్ ప్రణమామి సద శివ లింగం* - నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!
*సర్వ సుగంధ సులేపిత లింగం* - అన్ని మంచి గంధాలు, మంచి గా పూసిన శివ లింగం.
*బుద్ధి వివర్ధన కారణ లింగం* - మనుషుల బుద్ధి వికాసానికి కారణ మైన శివ లింగం.
*సిద్ధ సురాసుర వందిత లింగం* - సిద్ధులు, దేవతలు, రాక్షసుల చేత కీర్తింపబడ్డ శివ లింగం.
*తత్ ప్రణమామి సదా శివ లింగం* - నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!
*కనక మహామణి భూషిత లింగం* - బంగారు, మహా మణుల చేత అలంకరింప బడ్డ శివ లింగం.
*ఫణిపతి వేష్టిత శోభిత లింగం* - నాగరాజు నివాసం చేత అలంకరింపబడ్డ శివ లింగం.
*దక్ష సుయజ్ఞ వినాశక లింగం* - దక్షుడు చేసిన మంచి యజ్ఞాన్ని నాశనం చేసిన శివ లింగం.
*తత్ ప్రణమామి సదా శివ లింగం* - నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!
*కుంకుమ చందన లేపిత లింగం* - కుంకుమ, గంధము పూయబడ్డ శివ లింగం.
*పంకజ హార సుశోభిత లింగం* - కలువల దండ చేత చక్కగా అలంకరింప బడ్డ శివ లింగం.
*సంచిత పాప వినాశక లింగం* - సంక్రమించిన పాపాలని నాశనం చేసే శివ లింగం.
*తత్ ప్రణమామి సదా శివ లింగం* - నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!
*దేవగణార్చిత సేవిత లింగం* - దేవ గణాల చేత పూజింప బడ్డ, సేవించ బడ్డ శివ లింగం.
*భావైర్ భక్తీ భిరేవచ లింగం* - చక్కటి భావం తో కూడిన భక్తీ చేత పూజింప బడ్డ శివ లింగం.
*దినకర కోటి ప్రభాకర లింగం* - కోటి సూర్యుల కాంతితో వెలిగే మరో సూర్య బింబం లాంటి శివ లింగం.
*తత్ ప్రణమామి సదా శివ లింగం* - నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివ లింగమా ..!
*అష్ట దలోపరి వేష్టిత లింగం* - ఎనిమిది రకాల ఆకుల మీద నివాసముండే శివ లింగం.
*సర్వ సముద్భవ కారణ లింగం* - అన్నీ సమానంగా జన్మించడానికి కారణమైన శివ లింగం.
*అష్ట దరిద్ర వినాశక లింగం* - ఎనిమిది రకాల దరిద్రాలను (అష్ట దరిద్రాలు) నాశనం చేసే శివ లింగం.
*తత్ ప్రణమామి సదా శివ లింగం* - నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివ లింగమా ..!
*సురగురు సురవర పూజిత లింగం* - దేవ గురువు (బృహస్పతి), దేవతల చేత పూజింప బడ్డ శివ లింగం.
*సురవన పుష్ప సదార్చిత లింగం* - దేవతల తోటల్లో పూచే పువ్వులు (పారిజాతాలు) చేత ఎప్పుడూ పూజింప బడే శివ లింగం.
*పరమపదం పరమాత్మక లింగం* - ఓ శివ లింగమా, నీ సన్నిధిఏ ఒక స్వర్గము.
*తత్ ప్రణమామి సదా శివ లింగం* - నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివ లింగమా ..!
*లింగాష్టక మిదం పుణ్యం యః పట్టేత్ శివ సన్నిధౌ* - ఎప్పుడైతే శివుడి సన్నిధిలో చదవబడుతుందో, వారికి చాలా పుణ్యం వస్తుంది.
*శివ లోక మవాప్నోతి శివేన సహమోదతే* -
శివ లోకం లభిస్తుంది (శివుడి లో ఐక్యమయ్యే మార్గం దొరుకుతుంది).
🙏 *సర్వం శ్రీపరమేశ్వరార్పణమస్తు*