నిజంగా నీరు మహత్వపూర్వక మైనదా..!

P Madhav Kumar

--------------------------------------

శివుడు అంటేనే అభిషేకం...నీరు 

   నిజంగా నీరు మహత్వపూర్వక 

   మైనదా..మన సంకల్పాలను 

   నీరు విశ్వవ్యాప్తి చేయగలదా..!?

   పరిశోధనలు చేసినకొద్దీ నీటికున్న 

   ప్రత్యేకతలు తెలియవచ్చాయి.     

   జీవియొక్క మొదటి ఆకృతి 

   ఏర్పడింది నీటిలోనే. 




తల్లి గర్భంలో 

    శిశువు తేలుతూ వుండేది నీటిలోనే.

    నీటి మాధ్యమంగానే శిశువుకి తల్లి 

    నుండి; పరిసరాల నుండి ప్రభావాలు

    చేరతాయి. ఆశ్చర్యం ఏమంటే గర్భస్థ 

    నీటిలోని ఉప్పుశాతం సముద్రం లోని 

    ఉప్పుశాతం దాదాపు ఒకటేనని తెలిసి

    నపుడు.


విశ్వ ఖగోళాల 

    నుండి వచ్చే ఏ కాంతి కిరాణాలైనా

    ముందుగా మనిషి శరీరంలోని నీటిని 

    ప్రభావితం చేసిన తరువాత మాత్రమే

    అతనిని సమీపించ గలుగుతాయి. 


సముద్రంలోని 

    కొన్ని చేపలు కూడా చంద్రుని గమనం; 

    ఆటుపోట్లు ఆధారంగా తీరానికి వచ్చి 

    మరి గుడ్లుపెట్టి వెడతాయి. 


దీనిని బట్టి 

     ప్రతిజీవిలోనూ విశ్వ ప్రభావాలను గ్రహించే      

     అంతర్గత జ్ణానేంద్రియ ఒకటి కలిగివుంది.

     బహుశ మనిషికి కూడా అలాంటిదే వుండీ   

     వుండాలి. కానీ తనమేధపై ఎక్కువశ్రద్ధ    

     పెట్టటంవల్ల, దాని ఎరుక కోల్పోయాడు. 


మేధాజీవిగా లేనివి కనిపెట్టాడు. 

   కానీ వున్నది పోగొట్టు కొన్నాడు. 

   అతి చిన్నజీవికి సైతం అంతర్గత 

   మూలం వుంది.అది విశ్వంలోని 

   అన్నిటితో సంధింపబడి వుంది.


కనుక విశ్వంలో 

     ఏదీ ఒంటరి కాదని ఆధారం దొరికింది.

     మరి నీరు మాధ్యమంగా పూఙాదికాలు     

     చేయటం వెనుక నున్న రహస్యం ఇదేనేమో!..

.

అవునూ..ఎందుకిలా జరిగిందంటారూ.,🤔!?

-------------------------------------------------------

అష్టకష్టాలు పడి ఓ గురువుగారి

  ప్రాపకం సంపాదించాడో శిష్యుడు.

  ఇంతకీ ఆయనగారి గొప్పతనం ఏమంటే

  వారి కుటుంబంలో కొన్ని తరాల నుండి 

  నీటిమీద అలవోకగా నడిచేస్తారని ప్రతీతి.


ఈ అద్భుతాన్ని 

   తానూ ఎలాగైనా సాధించాలని

   తీవ్రమైన ఆకాంక్షతో వున్నాడు 

   శిష్యుడు. ఎన్నో శుశ్రూషల అనం

   తరం ప్రసన్నమైన గురూగారు 

   శిష్యునికి ఆ మంత్రోపదేశం చేశారు. 


పాదాభివందనం 

    చేసి గురుదక్షిణ సమర్పించి ఆశీసులు 

    పొంది సాధనకోసం శలవు తీసుకొని     

    వెళ్ళిపోయాడు శిష్యుడు. కొన్నాళ్ళకి 

    ఆ వార్త దావాలనంలా వ్యాపించింది. 

    ఓ స్వామివారు నీటిమీద అలవోకగా   

    నడిచేస్తున్నారని.


అది విన్న గురూజీ 

    తక్షణమే వెళ్లి ఆ ఘటనని కళ్లారా చూసారు.

    ఆ వ్యక్తి ఎవరోకాదు ఆనాటి తన శిష్యుడే.     

    వంశపారంపర్యంగా వచ్చిన విద్యని చెప్పట

    మేగానీ తానూ ఎప్పుడూ ప్రయోగించి చూడ

    లేదాయన. కనుక తనకి ఇదొక అద్భుతం

    లానేవుంది. అవునా! నే చెప్పిన ఆ మంత్రం

   తోనే ఇదంతా చేశాడా😮 కుతూహలం పట్ట

   లేక వెళ్లి శిష్యుడిని కలిసి అడిగేసాడు 

   ఎవ్వరూ లేకుండా చూసి. 


@ ఇంతకీ ఇదెలా చేయగలిగావు..!?

# అంతా మీ దయే గురూజీ. మీరు చెప్పిన

   మంత్ర మహిమే. కొన్ని ఏళ్లపాటు దానిని 

   సాధన చేసాక..ఓ రోజు మిమ్మల్నే గాఢంగా

   తలుచుకొని నీటిమీద పాదం పెట్టా. అంతే

   గురూజీ! ఆశ్చర్యం.. నడిచేసా.,🤗

   అంటూ కన్నీళ్లతో పాదాభివందనం చేసాడు.


తిరిగి వెళ్ళాక

    అదే మంత్రాన్ని బాగాజపించి తానూ

    నీటిమీద నడక Try చేశారు గురుగారు.

    అంతే ధడేలున నీటిలో చతికిల పడి

    పోయారు😤నడక కాదుకదా ఒక్క 

    అడుగు పడితే ఒట్టు. ఎవ్వరూ చూడ

    లేదుకదాని..చుట్టూ ఓసారి పరికించి, 

    గొప్ప ఇబ్బందిగా లేస్తూ అనుకున్నారు     

    తనలోతాను..ఎందుకిలా జరిగిందని😕

................................................................

అవునూ..ఇంతకీ ఎందుకిలా

     జరిగిందంటారూ...🤔!?.

.


విధి లేదా ఒక సంఘటన వల్లా 

ఎంత భాధించ బడ్డావు లేదా 

ఎంత ఎఫెక్ట్ అయ్యా వు అన్నది మ్యాటర్ కాదు..


 అదే సమయంలో ఆ బాధ పడుతున్న వాణ్ణి

ఆ ఎఫెక్ట్ అయిన వాణ్ణి మనలో నుండి ఏ 

మేరకు రిలీజ్ చేసి బయటికి పంపాము అన్నదే

మ్యాటర్....


నిజానికి భాధ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అనేది

లేనే లేదు అని తెలుసుకునేకి ఇదే దారి..

ఆ ఎఫెక్ట్ అయ్యే వాడు,,,భాధ పడే వాడు శాశ్వతంగా 

బయటికి వెళ్లి పోవడం వల్లా మాత్రమే

ఈ విషయం అర్థమవుతుంది ..ఎది

అసలు భాధ అనేది స్వయం కృతమే అని.....

.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat