🔱 శబరిమల వనయాత్ర - 34 ⚜️ శరంగుత్తి ఆల్ ⚜️

P Madhav Kumar


⚜️ శరంగుత్తి ఆల్ ⚜️


స్వామివారి యొక్క సత్యమగు స్థానమైన శరణమయ్యప్ప అని పిలువబడు పావన పదునెనిమిది మెట్లుయున్న స్థలము శబరి పీఠమునుండి ఒక మైలు దూరములో

మాత్రము కలదు. ఈ దూరమునకు మధ్యన కన్ని అయ్యప్పస్వాములు పూజించవలసిన స్థలము ఒకటి గలదు. అదియే *'శరంగుత్తి ఆల్'* అను స్థలము. గురు స్వాములకు దక్షిణాదులు  లొసంగి అతని యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ఎరుమేలియందు కన్నీ. అయ్యప్ప స్వాములు స్వీకరించిన శరములను ఇచ్చటనే వీడవలయును (వదల వలయును) శబరి పీఠమునుండి బయలుదేరినప్పటి నుండియూ పదునెనిమిది మెట్ల వద్ద ప్రేల్చబడు టపాకాయల శబ్దము మనకు వినబడుచునే యుండును. ఆనందమూర్తియైన ఆ కరుణానిధి దర్శనము మరికొన్ని క్షణములలో అగును. మనము ఆ పరాత్పరుని దర్శించి తరించెదము అను ఆకాంక్షతో ఎల్లరూ శరణాలు పలుకుచునే  ఆ స్థలమును త్వర త్వరగా వీడుదురు.


🙏🌹ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప💐🙏



⚔️ కలియుగవరదన్ అయ్యప్ప  🏹


      ॐ  హరిహర  卐


హర్ హర్ మహాదేవ్.,జై శ్రీ రామ్


స్వామియే శరణం అయ్యప్ప


    ధర్మో రక్షతి రక్షితః


లోకా సమస్త సుఖినో భవంతు🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat