నవగ్రహ పురాణం - 8 వ అధ్యాయం - పురాణ ప్రారంభం - 8

P Madhav Kumar


*పురాణ ప్రారంభం - 8*


దితి'కి హిరణ్యాక్షుడు , హిరణ్య కశ్యపుడు , వజ్రకుడు అనే పుత్రులు కలిగారు. తామసికమైన రాక్షస లక్షణాలు కలిగిన వ్యక్తిత్వాలు వాళ్ళవి. 'దితి' పుత్రులైన కారణంగా వాళ్ళు 'దైత్యులు'గా వ్యవహరించబడ్డారు.


'దను' అనే కశ్యపత్నికి మయుడు , విప్రచిత్తి , శంబరుడు , నముచి , పులోముడు , అసిలోముడు , విరూపాక్షుడు మొదలైన రాక్షసులు కలిగారు. దను పుత్రులైనందువల్ల వీళ్ళు 'దానవులు' అనబడ్డారు.


'అనాయువు' అనే పత్నికి విక్షరుడు , బలుడు , వీరుడు , వృత్రాసురుడు అనే రాక్షసులు జన్మించారు. 'కాల'కు వినాశకుడు , క్రోధుడు అనే రాక్షసులు , కాలకేయులు పుట్టారు.


'ముని' అనే కశ్యప పత్నికి భీమసేనుడు , ఉగ్రసేనుడు మొదలైన గాంధర్వ పుత్రులు కలిగారు. వీళ్ళంతా దేవగంధర్వులు.


ప్రాధ అనే పత్నికి కూడా దేవ గంధర్వ సంతతి కలిగింది. 'క్రోధ'కు క్రోధవశులు , 'క్రూర'కు సుచంద్రుడు , హంతుడు , చంద్రుడు కలిగారు. ఇతర పత్నులకు పక్షులు , జంతువులు కశ్యప సంతతిగా జన్మించాయి.


దేవ లక్షణాలు కలిగిన అదితి పుత్రులకూ , రాక్షస లక్షణాలున్న దితి , దను , అనాయు పుత్రులకూ , రాక్షస లక్షణాలతో జన్మించిన ఇతర కశ్యప పత్నుల పుత్రులకూ ద్వేష

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat