ఉపచారాలు

P Madhav Kumar

 🙏ఉపచారాలు🙏

సంక్షేపం విస్తారం అని షోడశోపచారాలు అనేక విధాలుగా ఉన్నాయి. ఐదు, పది, పదహారు, పదునెనిమిది, ముప్ఫైఆరు, అరవైనాలుగు. అవి ఇక్కడ ఇవ్వబడుతున్నాయి.


☀పంచోపచారాలు- 1. గంధం 2. పుష్పం 3. ధూపం 4. దీపం 5. నైవేద్యం

☀దశోపచారాలు-  1. పాద్యం 2. అర్ఘ్యం 3. ఆచమనం 4. స్నానం 5. వస్త్రనివేదనం 6. గంధం 7. పుష్పం 8. ధూపం 9. దీపం 10. నైవేద్యం

☀షోడశోపచారాలు- 1. పాద్యం 2. అర్ఘ్యం  3. ఆచమనం 4. స్నానం 5. వస్త్రనివేదనం 6. ఆభూషణం 7. గంధం 8. పుష్పం 9. ధూపం 10. దీపం 11. నైవేద్యం 12. ఆచమనం 13. తాంబూలం 14. స్తవపాఠం 15. తర్పణం 16. నమస్కారం


అష్టాదశోపచారాలు- 1. ఆసనం 2. స్వాగతం 3. పాద్యం 4. అర్ఘ్యం  5. ఆచమనీయం 6. స్నానీయం 7. వస్త్రం 8. యజ్ఞోపవీతం 9. భూషణం 10. గంధం 11. పుష్పం 12. ధూపం 13. దీపం 14. నైవేద్యం 15. దర్పణం 16. మాల్యం 17. అనులేపనం 18. నమస్కారం


ముప్ఫైఆరు ఉపచారాలు- 1. ఆసనం 2. అభ్యంజనం 3. ఉద్వర్తనం 4. నిరుక్షణం 5. సమ్మార్జనం 6. సర్పిఃస్నపనం 7. ఆవాహనం 8. పాద్యం 9. అర్ఘ్యం  10. ఆచమనం 11. స్నానం 12. మధుపర్కం 13. పునరాచమనం 14. యజ్ఞోపవీతం, వస్త్రం 15. అలంకారం 16. గంధం 17. పుష్పం 18. ధూపం 19. దీపం 20. నైవేద్యం 21. నైవేద్యం 22. పుష్పమాల 23. అనులేపనం 24. శయ్యా 25. చామరం 26. వ్యంజనం 27. ఆదర్శం 28. నమస్కారం 29. గాయనం 30. వాదనం 31. నర్తనం 32. స్తుతిగానం 33. హవనం 34. ప్రదక్షిణం 35. దంతకాష్ఠం 36. విసర్జనం


☀చతుష్షష్టి ఉపచారాలతో అంటే (64) ఉపచారాలు- 1. ద్యానం 2. ఆవాహనం 3. ప్రభోధనం 4. మణి మందిరం 5. రత్న మండపం 6. దంత ధావనం 7. సిబికాం 8. రత్న సింహాసనం 9. వితానం 10. పాద్యం 11. అర్ఘ్యం  12 ఆచమనీయం 13 మధుపర్కం 14. అభ్యంగనమ్‌ 15. ఉద్వర్తనం 16. పంచామృతం 17. ఫలోదకం 18. శుద్దోదకం 19. సమ్మార్జనమ్‌ 20. వస్త్రం 21 పాదుకా 22 ఆభరణం 23 కిరీటం 24 కుండలం 25 కవచం 26 యజ్ఞోపవీతం 27 శ్రీ గంధం 28 అక్షతం 29 హరిద్రాచూర్నమ్‌ 30 కుంకుమ 31 పరిమళ ద్రవ్యం 32 సింధూరం 33. పుష్పాణి 34. దూర్వాదళం 35. ధూపం 36. దీపం 37. కుంభ నీరాజనం 38. నైవేద్యం 39. హస్త ప్రక్షాళనం 40 కరో ద్వర్థనమ్‌ 41. పానీయం 42ఫలసమర్పణ 43.తాంబూలం 44.దక్షిణ 45 ఛత్రం 46 చామరం 47. దర్పణం 48. మంగళ నీరాజనం 49. మంత్రపుష్పం 50. ప్రదక్షిణం 51 నమస్కారం 52. తురంగవాహనమ్‌ 53. మదగజం 54. రధం 55. సైన్యం 56. దుర్గం 57. మూషిక వాహనం 58 ఆయుధం 59. వ్యజవీజనం (వింజామర) 60. నృత్యం 61. వాద్యాని 62. గీతశ్రవణం 63. అబినయం 64. క్షమా ప్రార్ధన

ఈ 64 ఉపచారాలు ప్రధానమైనవిగా శాస్త్రాలలో చెప్పబడ్డాయి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat