హైదరాబాద్ - చిలుకూరు బాలాజీ దేవాలయం

P Madhav Kumar

 


🙏🌺చిలుకూరు బాలాజీ🌺🙏


🌺ఒకప్పుడు శ్రీనివాసుని భక్తుడొకాయన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళి ఏడుకొండల స్వామిని దర్శించుకొనేవాడు. ఒకమారు అనారోగ్యకారణంగా అతను తిరుపతి యాత్ర చేయలేకపోయాడు. ఆభక్తుడికు కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి నీవు దానికి చింతించవద్దు, నీ సమీపంలోని అడవిలోనే నేనున్నాను అని చెప్పాడు. కలలో కనిపించిన స్థలానికి వెళ్ళి, ఆ భక్తుడు అక్కడి పుట్టను త్రవ్వుతుండగా, పలుగుకు రాతి విగ్రహం తగిలి రక్తం కారసాగింది. ఆ అపచారానికి దుఃఖిస్తున్న భక్తునికి పాలతో కడగమని వాణి వినిపించింది. అలా చేయగా పుట్టనుండి శ్రీదేవీభూదేవీ సమేతుడైన శ్రీవేంకటేశ్వరుని విగ్రహం బయల్పడింది. ఇలా మూడు మూర్తులు ఒకే విగ్రహంలో ఉండడం అరుదు. ఆ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి, మందిరాన్ని నిర్మించారు. ఇలా స్వయంభూమూర్తిగా ఉభయ నాంచారులతో వెలసిన శ్రీవేంకటేశ్వరుని,రెండు తెలుగు రాష్ర్టాల,ఇతర రాష్ర్టాల భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు. 🌺


🌺1963లో రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అమ్మవారు మూడు చేతులలో పద్మాలు ధరించి ఉంటారు. నాలుగవ చేయి భక్తులను శరణాగతులను కమ్మని చూపుతూ ఉంటుంది.


ఈ ఆలయం పెద్ద ఆర్భాటాలు లేకుండా, సీదా సాదాగా ఉంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొంటుంటారు. మ్రొక్కుగా ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలామంది నమ్మకం. అందుకే ఇక్కడి బాలాజిని వీసా బాలాజీ అని కూడా పిలుస్తారు.


హైదరాబాద్ నగరానికి చేరువలోని మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉంది ఈ టెంపుల్.. అలా ఈ టెంపుల్‌కు చిలుకూరు బాలాజీ టెంపుల్ అని పేరొచ్చింది. ఈ ఆలయం వద్ద నిత్యం భక్తుల రద్దీ ఉండటం విశేషం. ప్రతీ రోజు ఇక్కడికి దేవుడి సందర్శనార్థం సుమారు ముప్పై వేల మంది వరకు భక్తులు వస్తుంటారు. ఇక హాలీ డేస్‌లో అయితే ఏకంగా యాభై వేల మంది వరకు భక్తులు వస్తుంటారు. ఇకపోతే ఈ ఆలయంలో వీఐపీ దర్శనాలు, టికెట్లు ఉండవు. 🌺


🌺ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్‌కు ఇంకో స్పెషాలిటీ ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో వెంకటేశ్వరస్వామితో పాటు మహాశివుడు కూడా పూజలందుకుంటాడు. ఇది ఈ ఆలయ విశిష్టతని స్థానికులు చెప్తున్నారు. పురాణాల ప్రకారం..కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి మూడు చోట్ల వెలిశాడు. అందులో ఒకటి చిలుకూరు బాలాజీ టెంపుల్. కాగా, దీనిని తెలంగాణ తిరుమల అని పిలుస్తుంటారు. తెలంగాణ తిరుమల టెంపుల్‌గా చిలుకూరు బాలాజీ బాగా ఫేమస్ అయ్యారు కూడా. ఈ చిలుకూరు బాలాజీ ఆలయానికి దాదాపు ఐదొందల ఏళ్ల చరిత్ర ఉంది. 🌺

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat