శ్రీ కృష్ణుని వ్యక్తిత్వము - Sri Krishna

P Madhav Kumar

 

కర్షయతి ఇతి కృష్ణః అనే వ్యుత్పత్తి ఆధారంగా జనించిన అర్థానికి సార్థకత కల్గించినవాడు కృష్ణుడు.

“బ్రహ్మణో వయసా యస్యనిమేశ ఉపచార్యతే
సచాత్మా పరమం బ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే”
(శ్రీ బ్రహ్మవైవర్త పురాణంలోని ద్వితీయ ఖండంలో గల రెండవ అధ్యాయం)

ఎవని కనురెప్పపాటు కాలం బ్రహ్మ ఆయుర్దాయమో అటువంటి ఆత్మ స్వరూపుడైన పరబ్రహ్మమే కృష్ణుడు అని అర్థం.

కృష్ణుడు పరమ యోగీశ్వరేశ్వరుడు. నిర్వికల్ప సమాధిలో ఉంది తిరిగి సామాన్య స్థితికి రాగలిగిన సామర్థ్యం కలవాడు. కర్మలను చేస్తూ కూడా ఆ కర్మవాసన తనకంటకుండా తామరాకు మీది నీటి బొట్టులాంటి జీవనం గడిపిన యోగి. ఇతని యోగీశ్వరత్వానికి భగవద్గీత చక్కని ఉదాహరణ.

వాస్తవానికి భగవద్గీత మొదటి సారిగా సూర్యునికి ఉపదేశింపబడింది. అయితే ఇక్కడ సూర్యశబ్దం సాంకేతిక పరమైనది. సూర్య శబ్దం జ్ఞానమయం అని గ్రహిస్తే తొలిసారిగా భగవద్గీత జ్ఞాన మార్గాన ఈ లోకానికి అంద చేయబడింది అనుకోవచ్చును. సహజంగా జ్ఞానం ఒకరినుంచి ఇంకొకరికి అందచేయబడేదే. కాబట్టి సూర్యశక్తి ఆధారంగా జ్ఞానం లోకానికి అందచేయ బడిందని అర్థం చేసుకోవాలి. కాబట్టే ఈ గీత అతి ప్రాచీనమైనది. అంటే చరిత్ర కందిన నాగరికతల కంటే కూడా ప్రాచీనమైనది అనుకోవాలి. సూర్యుని దగ్గరనుంచి శాసనకర్తయైన మనుచక్రవర్తి ఈ జ్ఞానాన్ని అందుకున్నాడు. అనేక కారణంతరాల వలన ఈ జ్ఞానం కోంత మరుగున పడింది. అయినప్పటికీ బ్రహ్మకీ, యాజ్ఞావల్క్య మహర్షికి కూడా ఈ జ్ఞానం అందుబాటులో ఉందని తెలుస్తోంది.

కర్మ సిద్ధాంతం భగవద్గీతలో వివరంగా చెప్పబడింది. అంటే సమాజంలో అనాటికీ కర్మలపట్ల విశ్వాసం, నమ్మకం ఉందనుకోవాలి. ఈ భావన అప్పటికే బలపడింది. అంటే ఇదెంతో ప్రాచీనమైన విశ్వాసం అని తేలుతోంది. ఈశావాస్య ఉపనిషత్తు కర్మ సిద్ధాంతపు బీజాలను ఈ రకంగా ప్రకటించింది.

“కురువణ్ణే నేహ కర్మాణి జిజివిషేత్ శతమ్ సమోః
ఏవమ్ త్వయిన అస్యతా ఇతః అస్తి నకర్మ లిప్యతే నరే”

ఈ మంత్రంలో కర్మయోగానికి సంబంధించిన బీజాలు కనిపిస్తున్నాయి. ఇది సూర్య భగవానుడు చెప్పినట్లు తెలుస్తున్నది. ఇది సూర్య భగవానుడు చెప్పినట్లు తెలుస్తున్నది. తనకు తెలిసన జ్ఞానాన్ని బహుశః సూక్ష్మంగా చెప్పి ఉండవచ్చును. నిస్వార్థమైన కర్మ ఎన్నటికి వృథాకాదు. వాసనారహిత జీవనాన్ని జీవన్మరణ చక్రం నుంచి విముక్తిని, మోక్షాన్ని అందిస్తుందని ఈ మంత్రం స్పష్టం చేస్తున్నది. ఈ విషయాన్ని భగవద్గీత పదేపదే వక్కాణించింది. సర్వకాలాలకు అన్వయిమ్పబడే ఈ విషయం అందరికి శిరోధార్యమే. యుద్ధరంగంలో కృష్ణుడు ఆ విషయాన్ని రేఖా మాత్రంగా అర్జునునికి జ్ఞప్తికి తెచ్చాడు. అర్జునునితో పాటు ఆ గీతాబోధకు ఆంజనేయుడు, సంజయుడు ప్రత్యక్ష సాక్షులు. ఇంత మహిమోపేతమైన భగవద్గీతను చెప్పిన కృష్ణుని వ్యక్తిత్వం ఎంత ఉన్నతమైనదో ఒక్కసారి సింహావలోకనం చేద్దాం. భగవద్గీతతో పాటు హరివంశం, విష్ణుపురాణం, మహాభారతం, భాగవతం కూడా పరిశీలిస్తే తప్ప కృష్ణుని సంపూర్ణం వ్యక్తిత్వం అర్థం కాదు.

యయాతి కుమారుడైన యదు యాదవుల యొక్క మూల పురుషుడుగా చెప్పబడుతున్నాడు. కాని, యాదవులలో కాలక్రమేణ ఎన్నో శాఖలు ఏర్పడ్డాయి. వృష్టి భోజ, శూర, అంధక, యాదవ మొ|| అందులో కొన్ని. వీరందరూ ఎంతో శౌర్యపరాక్రమాలు గలవారు అయినప్పటికీ స్వేచ్చాప్రియులు. సామాజికంగా, రాజకీయంగా వీరందరికీని ఏకం చేయాలని సంకల్పించాడు కృష్ణుడు. 

సంఘటితమైన మంచితనం ఎప్పుడూ చెడును ఎదుర్కొనటానికి తగిన సామర్థ్యాన్ని కల్గి ఉంటుంది. విడివిడిగా చెడును ఎదుర్కోనలేము. ఇది వాస్తవం. సంఘంలో ప్రబలిపోయిన చెడును సమర్థవంతంగా ఎదిరించాలంటే ఈ సమీకరణ చాల అవసరం. అందుకే తనకు తానుగా నాయకత్వం వహించి యాదవులందరిని ఏకం గావించగలిగాడు. ఈ నాయకత్వ లక్షణాలు అతనికి పసితనం నుంచే ఉన్నాయి. లోక రక్షణ కోసం, ధర్మకోసం కృష్ణుడు పడిన తాపత్రయం చిన్నప్పటి నుంచే కన్పిస్తుంది. అన్నిటా తానే ఉంటూ కూడా తామరాకు మీద నీటిబొట్టు లాంటి సాధుజీవనం గడిపాడు. తనకొక, కీర్తి రావాలని కాని, ధనం సంపాయించాలని గాని ఎన్నడూ ప్రయత్నించలేదు. 

ఆదర్శవంతమైన సంఘాన్ని నిర్మించాలని, అందులోని ప్రజలందరూ ఏ కలతలు లేకుండా సుఖజీవనం గడపాలని, మనస్ఫూర్తిగా నమ్మినవాడు, దానికి ప్రయత్నించి సఫలీకృతుడైన వాడు, కృష్ణుని ఏ చర్య గమనించినా దాని వెనకాల గల అతని ధర్మసంరక్షణ మనకతని వ్యక్తిత్వాన్ని ఎత్తి చూపుతుంది. ఈ ధర్మ సంరక్షణలో కృష్ణుడు ఎంతో మంది అసురురులను సంహరించాడు. సంసుడు, సాళ్వుడు, సృగాల వాసుదేవుడు, పౌండ్రక వాసుదేవుడు శిశుపాల దంత వక్త్రులు, కాలయవనుడు, జరాసంధుడు, నరకుడు – ఇట్లా చెప్పుకుంటూ పొతే ఎందరో … జరా సంధుడు, నరకుడు బంధించిన రాజన్యులకు, రాకుమర్తెలకు విముక్తి కలిగించాడు. వారందరికి తానే నీడగానిలిచాడు. ఇదొక విప్లవాత్మకమైన నిర్ణయం. ఇంత ధైర్యం, విచక్షణ, సానుభోతూ ఇంకొక వ్యక్తిలో మనకు కనిపించవు.

స్వజానాన్ని చంపుకోవతంలో వెనకంజ వేసిన అర్జునునికి కర్మసిద్ధాంతాన్ని విన్పించి, జాగారూకుడిగా చేసాడు. ఇది కేవలం అర్జునుడు తనకు బంధువన్న ప్రీతితో కాదు. పాండవులు ధర్మ రక్షకులు కాబట్టి అన్నివేళలా వారికి అండగా నిలిచాడు. 

కృష్ణుడు నిర్యాణం చెందే సమయానికి చాలా వృద్ధుడు. బోయవాని బాణఘాతంలో తనవు చాలించాడు. తనకు గాయం చేసిన బోయవానిని చిరునవ్వుతో క్షమించాడు. మృత్యువును నిర్వికారంగా ఆహ్వానించడం కృష్ణునికి తగింది. అందుకే కృష్ణుడు యోగీశ్వరేశ్వరుడేగాదు. యోగీశ్వరతత్వానికి సరైన నిర్వచనం కూడా. ఇంతటి ఆధ్యాత్మికత గల ఇంకొక వ్యక్తి నభూతో నభవిష్యతి. యోగీశ్వరులను చాలామందిని మనం చూస్తూనే ఉన్నాం. కాని, యోగీశ్వరేశ్వరుడు కృష్ణుడోక్కడే. అతని కంటే ముందు కాలంలో గాని, అతని తర్వాతి కాలంలోకాని ఇంటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తి లేడు. యోగీశ్వరేశ్వరుడు అంటే యోగులకు మంత్రదీక్ష ఇవ్వడమో, యోగులకు యోగ రహస్యాలు ఉపదేశించాదమో కాదు. వీటన్నింటికి అతీతమైనదాస్థానం. 

కృష్ణుడు అత్యంత సులభంగా నిర్వికల్ప సమాధిలోకి ప్రవేశించగల్గుతాడు, తిరిగి రాగలుతుగాడు కూడా. నిర్వికల్ప సమాధి స్థాయికూడా దాటి సచ్చిదానందాన్ని అనుభవించగల్గుతాడు. నిజానికి కృష్ణుడే సచ్చిదానంద స్వరూపుడు. అందుకే యోగీశ్వరేశ్వరుడనే పదానికి అర్హుడు. సోహం, తత్వమసి,ఆయావ్యక్తులు సంపూర్ణంగా  పరబ్రహ్మం అన్న పదాలకు ఆధార భూతుడు. అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచాడు. అంటే కొడుకుగా, స్నేహితుడుగా, భర్తగా, తండ్రిగా, రక్షకునిగా, శిష్యునిగా ఏ పాత్ర గమనించినా, తనవల్ల ఆయావ్యక్తులు సంపూర్ణంగా సంతృప్తి చెందినట్లు కన్పిస్తుంది. ఇవన్ని అతని వ్యక్తిత్వంలో లీనమై అతని నొక గీతాచార్యునిగా, జగద్గురువుగా నిలబెట్టాయి. అందుకే గీతలోని ప్రత్యక్షరము ఎంతోవిలువైనది, అమూల్యమైనది, విశ్వజనీనమైంది, మానవాళిని ఉద్ధరించడానికి హేతుభూతమైనది.

కర్మ, సాంఖ్య భక్తి, హఠయొగాలను మొక్షానికి మార్గాలుగా చెప్పారు.  మన ప్రాచీనులు. కృష్ణుడు మొదటి మూడు మార్గాలను ఎంతో హేతుబద్ధంగా, విజ్ఞానయుతంగా వివరించాడు. 
  • అతను చూపిన మార్గం ఎంతో సులభమైనది. 
  • సాధారణంగా మోక్ష సాధకులకు ఎన్నోసార్లు మార్గం దుర్గమంగా కన్పిస్తుంది. 
  • కాని కృష్ణుడు ఉపదేశించిన తీరు అత్యంత రమ్యమైనది. 
  • బాధ్యతల నుండి తప్పించుకొని పారిపోయే వారిని నిలబెట్టి గమ్యాన్ని చూపిస్తుంది. 
  • సాధకులను సరైనమాగ్రం వైపు నడిపిస్తుంది. 
  • ఇటువంటి అధ్బుతమైన వ్యక్తిత్వంకల వ్యక్తి అష్టమి తిథి నాడే ఎందుకు జన్మించినట్లు అని సందేహం రాకపోదు. 
నిజానికి అష్టమి తిథి ఎన్నో కష్టాలు కల్గిస్తుందని జన సామాన్యం నమ్మకం. కాని కృష్ణుని జీవితమ గమనిస్తే అష్టమి తిథి కార్యసాధకులకు, శతృంజయులకు అనుకూల మైనదని అర్థమవుతుంది. జ్యోతిష శాస్త్రం కూడా ఈ విషయాన్ని నిర్థారిస్తున్నది. అట్లాంటప్పుడు అష్టమి నవమితిథులు మంచివి కావేమోనన్న మూఢనమ్మకాలతో మనవి మనం మోసపుచ్చుకుంతున్నామేమో! సాధారణంగా గోవును మనం ధర్మానికి ప్రతీకగా భావిస్తాం. కృష్ణుడు వృషభ రాశిలో జన్మించటం అతని ధర్మ సంరక్షణను సూచిస్తున్నది. అదే విధంగా రోహిణీ నక్షత్రం ఆకర్షణీయ శక్తి కలది. కృష్ణునిరూపు డానికి తార్కాణం, కృష్ణ శబ్దవ్యుత్పత్తి కూడా ఇదే నిర్ధారిస్తున్నది. కర్షయతి ఇతి కృష్ణః – జీవాత్మలకు ఆకర్షించే పరతత్త్వం అది.

‘కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన
మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సజ్గోస్త్వుకర్మణి’

ఆ స్వామిది అనితరసాధ్యమయిన వ్యక్తిత్వం. మనకు ఆదర్శప్రాయం.

సంకలనం: నాగవరపు రవీంద్ర

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat