1. (వాస్తు పురాణం):
పూర్వకాలంలో అంధతాసురడనే రాక్షసుడు ముల్లోకాల వాసులను ముప్పతిప్పులు పెట్టుచుండెను. అప్పుడు లోక సంరక్షణార్థం పరమేశ్వరుడు ఆ రాక్షసునితో యుద్ధం చేశాడు. ఆ సమయంలో శివుని లలాటం నుండి రాలిన ఒక చెమట బిందువు భూమిపై పడి దాని నుండి భయంకరమైన కరాళ వదనంతో ఒక గొప్ప భూతం ఉద్భవించి క్రమక్రమంగా భూమి, ఆకాశాలను ఆవరించి సాగింది. ఆ మహాభూతాన్ని చూసిన ఇంద్రాది దేవతలు భయభ్రాంతులయ్యారు. బ్రహ్మదేవుని శరణువేడారు. సమస్త భూతములను సంభవించువాడు, సర్వలోక పితామహుడు అయిన బ్రహ్మ దేవతలను ఊరడించి ఆ భూతమును ఆధోముఖంగా భూమి యందు పడవేసి విధానం చెప్పాడు. బ్రహ్మదేవుని ఆనతి ప్రకారం దేవతలందరూ ఏకమై ఆ భూతమును పట్టి అధోముఖంగా క్రిందకు పడవేశారు. ఆ భూతం భూమిపై ఈశన్య కోణమున శిరస్సు, నైరుతి కోణమున పాదములు, వాయువ్య, ఆగ్నేయ కోణాలందు బాహువులు వుండునట్లు ఆధోముఖంగా భూమిపై పడింది.
అది తిరిగి లేవకుండా దేవతలు దానిపై కూర్చున్నారు. ఇంతమంది దేవతల తేజస్ర్సముదాయంతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఆ భూతాకార అద్భుతాన్ని తిలకించిన బ్రహ్మ దేవుడు దాన్నే వాస్తు పురుషుడుగా సృష్టిగావించాడు.
వాస్తు పురుషుడు భాద్రపద బహుళ తదియ, శనివారం, కృత్రికా నక్షత్రము, వ్యతీపాత యోగము, భద్రనా కరణము గుళికతో కూడిన కాలంలో ఆ వాస్తు పురుషుడు జన్మించాడు. ఏ అపకారం చేయని నాపై అధిష్టించి ఈ దేవతలు పీడించుచున్నారు. వీరి నుండి నన్ను కాపాడమని వాస్తు పురుషుడు బ్రహ్మదేవున్ని వేడుకున్నాడు.అప్పుడు బ్రహ్మదేవుడు సంతోషించి వాస్తు పురుషా ! గృహములు నిర్మించునప్పుడు, త్రివిధమయిన గృహ ప్రవేశ సమయములందు, గ్రామ, నగర పట్టణ, దుర్గ దేవాలయ, జలాశయ, ఉద్యానవన నిర్మాణ సమయములందు ముందుగా నిన్నే పూజిస్తారు.
అలా పూజించని వారికి దరిద్రముతో పాటు అడుగడుగునా విఘ్నములు చివరకు మృత్యువు కూడా సంభవించునని వాస్తు పురుషునికి వరమిచ్చారు. అంతేకాక వాస్తు పరుషునిపై అష్టదిక్కులలో వున్న దేవతలు తృప్తి పొందు విధంగా ఆయా స్థలాలలో నివసించే దేవతలు వారివారి విధులు నిర్వహించుట వలన గృహస్థులకు సర్వసుఖములు, సత్ఫలితులు కలుగునట్లు ఆశీర్వదించారు.
బ్రహ్మదేవుని ఆశీస్సులు ప్రకారము:
- ఈశాన్యమున – ఈశ్వరుడు (ఈశ),
- ఆగ్నేయమున – అగ్ని,
- నైరుతిన - ఆదిత్యడు,
- వాయువ్యమైన – వాయువు,
- తూర్పున – వరుణుడు,
- ఉత్తరమున – కుబేరుడు (సోమ),
ఈశాన్యములో పూజలు, పవిత్ర కార్యములు అగ్నేయమున అగ్నిదేవునికిసంబంధించిన వంటావార్పు నైరుతిన ఆయుధ సామాగ్రి, వాయువ్యమున స్వతంత్రాభిలాష చిహ్నములు, తూర్పున ఆధిత్యునికి ప్రీతికరమైన పనులు,యమస్థానమైన దక్షిణము శిరస్సు ఉంచి నిద్రించుట, కుబేర స్థానమైన ఉత్తరాన్ని దర్శిస్తూ మేలు కొనుట, వరుణ స్థానమైన పశ్చిమాన పాడి పశువులను పెంచుట మొదలైన విధులు ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు తృప్తిని కలిగిస్తాయి. ఈ సారాంశాన్ని వాస్తు శాస్త్రం నియమాలు మనకు వెళ్లడిస్తున్నాయి.
గృహ నిర్మాణాలు చాలా రకాలు వీటిలో మనష్యోపయుక్తములు, పశవులకు సంబంధించిన నిర్మాణాలు, పక్షులకు సంబంధించిన నిర్మాణాలు దేవతలకు సంబంధించిన నిర్మాణాలు ఇలాగ అనేక విధాలుగా వున్నాయి.
వాస్తుశాస్త్రకర్తలు నిర్మాణాలను ముఖ్యంగా 4 భాగాలుగా విభజించారు.
(1) సాధారణ మనుష్య నివాసములు
(2) ప్రభు నిర్మాణములు
(3) దేవతా నిర్మాణములు
(4) సర్వసాధారణ ప్రజోపయోగ నిర్మాణాలు.
సామాన్యంగా ప్రతి గృహస్తులకు అవసరమైన సదుపాయములను గురించి మార్పులతో నిర్మాణాలు చెప్పబడియున్నవి.
ఏనాటిదీ వాస్తుశాస్త్రం?
వాస్తు ఈనాటిదికాదు.. రాజుల కాలం నుంచే ఉంది. ప్రతి రోజు కొలువులో ఒక జ్యోతిషునితో పాటు ఒక వాస్తు పండితుడు కూడా ఉండేవాడు. మహారాజు ఏ నిర్మాణం చేయాలన్నా వాస్తు పండుతుల సూచనలు పాటించినట్లు చారిత్రక ఆధారాలు లభిస్తున్నాయి. అంతేకాదు.... వాస్తు వేదకాలం నాటిది అని చెప్పేందుకు ఆధారంగా పలు తాళపత్ర గ్రంథాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
2. స్థలంలో దిక్కుల-సూచనలు:
స్థలంలో దిక్సూచినుపయోగించి ఉత్తర దక్షిణాలకు నిర్ధారించాకే తూర్పు, పడమరలను తదనుగుణంగా నిర్ణయించడం సులవవుతుంది. స్థలానికి నాలుగు దిక్కులే కాదు. నాలుగు మూలలు కూడా ఉంటాయి. వాటిని నిర్ణయించడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నా, గ్రంథస్తంగా అందుతున్న పరిజ్ఞానాను సారంగా అయితే.... ఒక దిక్కును తొమ్మిది భాగాలుగా విభజించి, అటుపై మూలల నిర్ణయం చేయాలి. ఆ వివరాలు వివరంగా తెల్సుకుందాం.
తూర్పు దిక్కును '9' భాగాలు చేయండి. మీరు తూర్పుకు తిరిగి నిలబడినపుడు తూర్పు దిక్కులో మీ కుడిచేతి వైపు ఉన్న రెండు భాగాలు తూర్పు ఆగ్నేయంగా భావించాలి. అలాగే మీ ఎడమ చేతివైపు ఉన్న చివరి రెండు భాగాలు తూర్పు ఈశాన్యంగా.. ఈ రెంటి నడుమ ఉన్న అయిదు భాగాలను తూర్పు దిక్కుగా భావించాలి.
ఒక ఉత్తరం విషయానికొస్తే... మీరు ఉత్తరదిశగా తిరిగితే... మీ కుడిచేతి వైపున ఉండే చివరి రెండు భాగాలు ఉత్తర ఈశాన్యం, ఎడమచేతి చివరగా ఉండే రెండు భాగాలు ఉత్తర వాయువ్యం, వీటి నడుమ ఉన్న అయిదు భాగాలు ఉత్తర దిక్కుగా భావించాలి.
ఇక పడమర వియానికొస్తే... మీరు పడమర దిక్కుగా నిలబడినపుడు పడమర దిక్కులోని 9 భాగాలలో మీ కుడిచేతివైపు చివరగా ఉండే రెండు భాగాలు పశ్చిమ వాయువ్యంగాను, మీ ఎడమ చేతివైపు చివరగా ఉండే రెండు భాగాలు పశ్చిమ నైఋతిగాను వీటి నడుమ ఉండే అయిదు భాగాలు పశ్చిమ దిశగా గ్రహించాలి.
దక్షిణాన్ని కూడా ఇలానే గమనిస్తే.. మీరు దక్షిణ దిశగా తిరిగి నిలబడినపుడు.. మీకుడి చేతి చివరన ఉన్న రెండు భాగాలు... దక్షిణ నైఋతి. అలానే ఎడమచేతి వైపు చివరగా ఉండే రెండు భాగాలు దక్షిణ ఆగ్నేయం అని గ్రహించాలి. స్థలం ఏదయినా సరే దిక్కులు, మూలల్ని ఇలా నిర్ణయించుకోవాలి.
3. గృహ నిర్మాణ స్థల వైశిష్ట్యం:
గృహ నిర్మాణ సమయంలోనే వాస్తు నియమాలు పాటిస్తే సరిపోదు. గృహ నిర్మాణ నిమిత్తం స్తలాన్ని చేసుకునే తరుణంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆ స్థలం విషయంలో వాస్తు నియమాలు పాటించాలి. ఏ మాత్రం వాస్తుకు వ్యతిరేకంగా లేని స్థలాన్ని మాత్రమే సెలక్టు చేసుకుని... ఆ స్థలంలోనే పూజాది కార్యక్రమాలు నిర్వహించి వాస్తు పూజ విధిగా చేసి... అప్పుడు గృహ నిర్మాణం ప్రారంభించాలన్నది శాస్త్రం చేస్తున్న సూచన.
- మీరు తీసుకునే స్థలం బల్లపరుపుగా చదునుగా ఉండాలి.
- మీ స్థలానికి పడమర దిశలో కానీ, దక్షిణ దిశలో కానీ తటాకాలు, కాలువలు, జలాశయాలు, పెద్ద పెద్ద గోతులు ఏ మాత్రం ఉండకూడదు.
- పడమర, దక్షిణ దిశలలో స్థలం ఎత్తుగా ఉండవచ్చు. ఆనుకుని ఉన్నస్థలం మెరకగా ఉండవచ్చు. ఎత్తయిన కొండలు, గుట్టలు ఏవయినా ఉండవచ్చు. ఇది గృహ నిర్మాణానికి అనువైన స్థలంగా వాస్తు చెబుతుంది.
- మీరు సెలక్టు చేసుకున్న స్థలం... ఉత్తరం పల్లంగా ఉండవచ్చు... ఉత్తర భాగాన జలాశయాలు, కాలువలు ఉండవచ్చు.
- అలాగే తూర్పు దిశలో కూడా ఎలాంటి మెరలు, గుట్టలు లేకుండా మీ తూర్పుదిక్కున స్థలం పల్లంగా ఉండాలి. స్థలానికి తూర్పున తటాకం, జలాశయం, బావి, గొయ్యి, కాలువ ఇలాంటివి ఏవి ఉన్నా దాన్ని శుభప్రదమైన స్థలంగా పరిగణించాలి.
- మీరు నిర్ణయించుకున్న స్థలానికి నైఋతి దిశలో ఎంత ఎత్తయిన కట్టడాలువ ఉంటేవ మీకు అంత శుభప్రదం, నైఋతిలో మెరక, కొండలు, గుట్టలు ఉన్నా అది శుభాదయకమే.
- నైఋతి, ఆగ్నేయం, వాయువ్య దిక్కులతో పోల్చినపుడు... ఈశాన్య దిక్కు పల్లంగా ఉంటే అది ఎంతో మంచిది.
- ఒకవేళ ఇలా లేకున్నా.... ఈశాన్యాన్ని పల్లంగా చేసుకుంటే ఉత్తమం. పొరపాటున కూడా ఈశాన్యం కన్నా ఇతర మూడు మూలలు పల్లంగా ఉండరాదు.
- స్థలాన్ని సెలక్టు చేసుకునే సమయంలో... మీ స్థలానికి అతి చేరువలో స్మశానం, కర్మాగారాలు, అధిక ధ్వనిని కల్గించే రైల్వే మార్గాలు, స్టేషన్‌లు, విమానాశ్రయాలు లేకుండా తగు జాగ్రత్త పాటించాలి. ధ్వని కాలుష్యం మీరు నివశించే చోటుకు అతి చేరువగా ఉంటే... మీ ఆరోగ్యం పై ఈ ధ్వని కాలుష్యం ప్రభావం చూపుతుంది.
- స్థలానికి అతి చేరువలో మురుగు ప్రవహించే కాలువలు లేకుండా చూసుకోవాలి. అలానే నీరు నిలిచిపోయే గోతులు లేకుండా జాగ్రత్త వహించాలి.
- స్థలాన్ని త్రవ్వినపుడు ఎముకలు, దంతాలు బయటపడినా, పాము పుట్టలు, దిబ్బలు బయటపడినా అది నివాసయోగ్యం కాని స్థలంగా భావించి దాన్ని వదిలివేయాలి.
- ఉత్తరం కన్నా దక్షిణం మెరకగా అంటే ఎత్తుగా ఉన్న స్థలంలో గృహ నిర్మాణం చేసినట్లయితే... ఆ గృహంలో నివశించే వారి ఆర్ధిక పరిస్థితి ఉన్నతంగా ఉంటుంది.
- ఇలా కాకుండా దక్షిణం పల్లం ఉత్తరం మెరకగా ఉన్న స్థలంలో గృహ నిర్మాణం చేసినట్లయితే ఆర్ధికంగా, ఆరోగ్య పరంగా పలురకాల సమస్యలు ఈ గృహంలో నివశించే వార్ని వేధిస్తాయి.
- తూర్పు కన్నా, పడమర ఎత్తుగా ఉన్న స్థలంలో గృహ నిర్మాణం చేశారంటే... ఈ గృహంలో నివసించే వారికి చక్కని మనశ్శాంతి, సమాజంలో గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. ప్రశాంతంగా జీవించ గల్గుతారు.
- తూర్పు ఎత్తుగాను, పడమర పల్లంగాను ఉన్న స్థలంలో గృహ నిర్మాణం చేసినట్లయితే.. మానసిక ప్రశాంతత ఉండదు. ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, పలురకాల ఇబ్బందులు వీర్ని వెన్నాడుతూనే ఉంటాయి.
- నైఋతి దిక్కుకన్నా ఈశాన్య దిక్కులో స్థలం పల్లంగా ఉన్నట్లయితే.. ఈ స్థలం గృహ నిర్మాణానికి ఎంతో శుభప్రదమైనదిగా వాస్తుశాస్త్రం చెబుతుంది. మంచి ఆరోగ్యం, మంచి గౌరవ ప్రతిష్ఠలు, పదుగురు అభినందించే సంతతి ఇలాంటి గృహంలో నివశించే వారికి లభ్యమవుతాయి.
- ఆగ్నేయం కన్నా వాయువ్యం పల్లంగా ఉండాలి. ఇలాంటి స్థలంలో గృహనిర్మాణం వాస్తు నియమానుసారం చేస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సమాజంలో మాంచి గౌరవ ప్రతిష్ఠలు పొందగల్గుతారు.
- వాయువ్యం ఎత్తుగా ఉండి... వాయువ్య కన్నా ఆగ్నేయం తక్కువ ఎత్తులో ఉండే స్థలంలో గృహ నిర్మాణం చేయరాదు.
- నైఋతి మూలకన్నా ఈశాన్యం మూల ఎత్తుగా ఉన్న స్థలంలో కూడా గృహనిర్మాణం చేయరాదు.
అన్ని స్థలాలు చక్కగా చతురస్రంగానో, దీర్ఘ చతురస్రంగానో ఉంటాయనుకోవడం పొరపాటే రకరకాల ఆకారాల్లో స్థలాలు ఉంటాయి. ఆ స్థలం ఏ ఆకారంలో ఉంటే ఆ స్థలం నివాస యోగం అవుతుందో తెల్సుకుందాం.
- ఘటాకార స్థలం... ఇది కుండను పోలి ఉంటుంది.
- విసనకర్ర ఆకారంలో ఉండే స్థలం అర్ధవృత్తాకారంలో ఉండే స్థలం,
- రోకలి ఆకారంలో ఉండే స్థలం,
- మద్దెల ఆకారం గల స్థలం,
- ఢమరుకాకార స్థలం,
- అండాకార స్థలం
5. వీదిశూల విషయంలో..
వీధిశూల అని వీధి పోటు అని పిలువబడే వీటి విషయంలో చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. స్థలం తీసుకునే తరుణంలోనే ఈ వీధిపోట్లును గుర్తించాలి. వీధి ఫలితాలు తెల్సుకుని స్థలాన్ని కొనడం చేయాలి. మన స్థలానికి ఎదురుగా వీధి ఉంటే దానిని వీధిపోటు అంటాము. ఏ వీధిపోటు ఎలాంటి ఫలితాలనిస్తుందో సవివరంగా తెల్సుకుందాం.
తూర్పు ఈశాన్య వీధిపోటు:
- ఇక్కడి చిత్రాన్ని గమనిస్తే చాలు.... ఈ వీధిపోటు ఎలా ఉంటుందో మీరు సులభంగా అర్ధం చేసుకోగల్గుతారు.
- తూర్పు ఈశాన్య వీధిపోటు ఆ గృహంలో నివశించే పురుషులపై ప్రభావం చూపుతుంది.
- ఇంటా బయటా వీరిదే పైచేయి అన్నట్లుంటుంది వీరి పరిస్థితి.
- ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మంచి గుర్తింపు, మన్నన వీరికి లభిస్తాయి.
- సమాజంలో మంచి గౌరవ ప్రతిష్ఠలు పొందగల్గుతారు.
- ఇది శుభప్రదమైన వీధిశూలే.
- ఇలాంటి వీధిపోటు ఉన్న స్థలంలో గృహ నిర్మాణం ఆమోద యోగ్యమే.
- ఉత్తర ఈశాన్యం వీధిపోటు... ఎంతో శుభప్రదం, లాభదాయకం, ఇంట సిరులు కురిపించే వీధిపోటు ఇది.
- ఈ ఇంట ధనమే కాదు, ఆరోగ్యం కూడా దండిగా ఉంటుంది.
- ఈ ఇంటో నివశించే దంపతులు ఎంతో అన్యోన్యంగా దాంపత్యాన్ని సాగిస్తారు.
- కుటుంబంలో సభ్యుల నడుమ మమతానురాగాలు పెనవేసుకుంటాయి.
- ఇంటా బయటా స్త్రీ పురుష బేధం లేకుండా ఈ ఇంట నివసించే వారికి మంచి పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి.
- ఇలా ఉత్తర ఈశాన్యం వీధిపోటు ఉన్న స్థలం లభిస్తే... వెయ్యి రూపాయలు అదనంగా చెల్లించి అయినా తక్షణం కొనేసుకోండి.
- ఈ వీధిపోటు శుభదాయకం కాదు. ముఖ్యంగా ఈ వీధిపోటు ఆ ఇంట నివశించే మహిళలపై ప్రభావం చూపుతుంది.
- మనశ్శాంతిగా ఉండలేరు.
- సంసారంలో సుఖ సౌఖ్యాలు కరువవుతాయి.
- ఆడపిల్లలకు చదువు అబ్బదు.
- వివాహాల సమయంలో కూడా ఎన్నోచిక్కులు ఎదురవుతాయి.
- ఇలాంటి స్థలాన్ని కానీ, ఇంటిని కానీ కొనకూడదు.
- పశ్చిమ వాయువ్య దిశలో ఇంటికి ఎదురుగా వీధి ఉన్నట్లయితే దాన్ని పశ్చిమ వాయువ్య వీధిపోటుగా పరిగణించాలి.
- ఈ వీధిపోటు ఉన్న స్థలం కొనదగినది.
- గృహ నిర్మాణం చేయదగినది.
- ఈ వీధిపోటు పురుషులపై సత్ప్రభావం చూపుతుంది.
- రాజపూజ్యం, గౌరవ ప్రతిష్ఠలు, ఎల్లెడలా ఆధిపత్యం, రాజకీయాలలో నాయకులుగాను త్వరగా ఎదుగుతారు.
- మట్టి ముట్లుకున్నా బంగారం అన్నట్లుంటుంది ఈ ఇంటి నివశించే పురుషుల పరిస్థితి.
- ఇలాంటి స్థలాన్ని రెండో ఆలోచన లేకుండా కొనేయాలి.
- ఈ వీధిపోటు ఆ ఇంట నివశించే పురుషులపై ప్రధానంగా ప్రభావం చూపుతుంది.
- జీవితం గొర్రెకు తోక బెత్తెడే అన్నట్లుంటుంది. కష్టానికి తగ్గ ఫలితం లభించదు.
- నిరాశా నిస్పృహలకు గురిచేస్తుంది.
- మనశ్శాంతిని హరిస్తుంది.
- జీవితం ఆపజయాల జాతర అన్నట్లు మారుతుంది.
- ఆపవాదులు, నిందలు, ఈ ఇంట మగవారిని బాధించి వేధిస్తాయి.
- విజయం చేతికందినట్లే అంది పరాజయాన్ని మిగులుస్తుంది.
- మగవారి పరిస్థితి ఇలా ఉంటే ఇక ఆ కుటుంబం ఎలా ఉంటుందో మీరే అలోచించండి.
- దక్షిణ నైఋతికి ఎదురుగా వీధి ఉంటే.. దాన్ని దక్షిణ నైఋతి వీధిపోటుగా భావించాలి.
- ఇలాంటి వీధిపోటు ఉన్న స్థలాన్ని, ఇంటిని కొనకూడదు.
- ప్రత్యేకించి ఈ వీధిపోటు ప్రభావవం ఆ ఇంట గృహిణిపైన ఉంటుంది.
- కాపురం కలతల కల్లోలంగా ఉంటుంది.
- దాంపత్యంలో అనురాగం కొరవడుతుంది.
- ఇంటి యజమానురాలి ఆరోగ్యం బాగుండదు.
- ఏ కార్యం తలపెట్టినా ఎదురుతిరుగుతుంది.
- మనసు ఎప్పుడూ కల్లోల సాగరంలా ఉంటుంది.
- ఊరకే కృంగిపోతుంటారు.
- ఇంటా బయటా అవమానాలే.
- ఇలాంటి వీధిపోటు... ఉన్న స్థలాన్ని, ఇంటినీ నిశ్చింతగా కొనవచ్చు.
- ఈ ఇంట నివసించేవారు.. ఆనందప్రదమైన జీవితాన్ని అనుభవిస్తారు.
- డబ్బుకు కొదవే ఉండదు.
- అలానే ఈ ఇంట నివసించే వారికి ఆరోగ్యానికీ కొదవ ఉండదు.
- ఎప్పుడూ ఈ ఇల్లు ధన ధాన్యాలతో తులతూగుతుంటుంది.
- బంధుమిత్రులతో కళకళలాడుతుంటుంది.
- ఈ ఇంట నివశించే ఆడవారు, ఆడపిల్లల చదువుల్లో సరస్వతుల్లా రాణిస్తారు.
- మంచి ఉద్యోగాలను పొందగల్గుతారు.
- మంచి ఖ్యాతి విఖ్యాతులు సొంతం చేసుకుంటారు.
- తూర్పు ఆగ్నేయ దిశలో వీధిపోటు ఉందంటే... ఆ ఇంట నివశించే వారి జీవితం... నిత్యం అల్లకల్లోలం అన్నట్లుంటుంది.
- జయాలు శూన్యం.
- అపజయాలు అపారం.
- జీవితంలో కష్టాలు కోకొల్లలు.
- సుఖాలు కోటి దివిటీలతో వెతికినా కన్పించవు.
- మనసు సునామీ నాటి సంద్రంటా ఉంటుంది.
- వేయి ప్రయత్నాలు చేస్తే 999 విఫలం అన్నట్లుంటుంది జీవితం.
- అటు వృత్తిలో అయినా, ఇటు వ్యాపారంలో అయినా విజయం ఎండమావే అవుతుంటుంది. తూర్పు ఆగ్నేయ వీధిపోటున్న ఇంటిని, స్థలాన్ని కొనకూడదు.
- వాస్తుశాస్త్రం రీత్యా వీధిపోట్లు విషయంలో చాలాచాలా అప్రమత్తంగా ఉండాలి.
- సుఖశాంతుల్ని, జీవితంలో సెక్సెస్‌లను మింగేసి... అశాంతిని మిగిలించే వీధిపోట్లు ఉన్నా ఇళ్ళు, స్థలాలు, వ్యాపార దుకాణాలు... వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
- శాస్త్రాన్ని, శాస్త్ర సూచనలను నిర్లక్ష్యం చేసి... కోరి కలతల్ని కొనితెచ్చుకోవలన్నదే మా విన్నపం.
వాస్తుశాస్త్ర విరుద్ధంగా మూలలు పెరిగిన స్థలాలను వాస్తు నియమాల రీత్యా సరిచేసుకుని అప్పుడు గృహనిర్మాణం చేసుకుంటే.. ఆ ఇల్లు సుఖశాంతుల నిలయం అవుతుంది. పారిజాతపు వనంలా సంతసంతో ప్రకాశిస్తుంది.
ఇక పెరిగిన మూలలు వాటిని సరిచేసుకునే విధానం తెల్సుకుందామా?
A. తూర్పు ఆగ్నేయం
ఈ మూల పెరగడం ఏ మాత్రం క్షేమదాయకం కాదు. ఆ మూలను సరిచేసుకున్నాకనే గృహ నిర్మాణం చేపట్టాలి. పెరిగిన మూలలో వున్న స్థలాన్ని కట్‌చేసి... గృహ నిర్మాణ స్థలంలో కలపకుండా వేరుగా ఉంచాలి. ఈ స్థలాన్ని మొక్కలు పెంచుకునేందుకు ఉపయోగించండే తప్ప... నిత్యం వాడుకునే విధంగా మాత్రం మలచుకోవద్దు. ఇక్కడి చిత్రంలో ఉన్న భాగాన్ని కట్‌చేసి వదిలివేయాలి.
B. తూర్పు ఈశాన్యం
తూర్పు ఈశాన్యం స్థలం పెరిగితే... తొలగించాల్సిన అవసరం లేదు. ఇలాంటి స్థలం అదృష్టదాయకం. ఆయురారోగ్య ధనధాన్యాభివృద్ధికి నిలయం అవుతుందీ స్థలం. ఎంత అదనపు సొమ్ము చెల్లించి అయినా ఇలాంటి స్థలాన్ని నిశ్చింతగా కానండి.
C. ఉత్తర ఈశాన్యం
ఇలా ఉత్తర ఈశాన్యం పెరిగి వున్న స్థలాన్ని కూడా మరో ఆలోచన చేయకుండా కొనుక్కోవచ్చు. ఇలా ఉత్తర ఈశాన్యం పెరిగిన స్థలాన్ని కట్‌చేసి తొలగించాల్సిన అవసరం లేదు. నిశ్చింతగా ఉంచుకోవచ్చు. ఈ ప్రదేశంలో బరువైన నిర్మాణాలు చేయకూడదు. ఈ స్థలాన్ని వదిలేస్తేనే వాస్తురీత్యా శుభప్రదం.
D. ఉత్తర వాయువ్యం
మీరు కొనే స్థలం ఉత్తర వాయువ్యం పెరిగి ఉంటే... పెరిగిన మేర కట్‌చేసి దానిని నిర్మాణాలకు ఏమాత్రం వినియోగించకుండా... మిగిలిన స్థలంలో గృహ నిర్మాణం చేసుకోవాలి.
E. పశ్చిమ వాయువ్యం
పశ్చిమ వాయువ్యం పెరిగి ఉండడం కూడా వాస్తు శాస్త్ర రీత్యా శుభ సూచకంకాదు. కనుక పశ్చిమ వాయువ్యంలో పెరిగి వున్న స్థలాన్ని కట్ చేసి తొలగించి... మిగిలిన స్థలంలో గృహ నిర్మాణం చేయాలి.
F. పశ్చిమ నైఋతి
పశ్చిమ నైఋతి పెరిగి ఉండటం కూడా వాస్తురీత్యా ఆమోదనీయం కాదు. జాగ్రత్తగా పెరిగిన పశ్చిమ నైఋతీ భాగాన్ని కట్‌చేసి, స్థలాన్ని చతురస్ర లేదా దీర్ఘ చతురస్రాకారంగా తయారు చేసుకుని ఆ స్థలంలో గృహ నిర్మాణం చేయాలి.
G. దక్షిణ నైఋతి
ఇక్కడి చిత్రాన్ని గమనిస్తే దక్షిణ నైఋతి పెరిగినట్లు అర్ధం అవుతుంది. దక్షిణ నైఋతి పెరిగి ఉండకూడదు. పెరిగిన మేర కట్ చేయాల్సిందే. తూర్పు, పడమర భుజాలు సమంగా ఉండేలా చూసుకుని దక్షిణ నైఋతిని కట్ చేయాలి.
H. దక్షిణ ఆగ్నేయం
దక్షిణ ఆగ్నేయం పెరగడం కూడా వాస్తు శాస్త్ర రీత్యా సమ్మతమైన విషయం కాదు. పెరిగిన దక్షిణ ఆగ్నేయాన్ని తప్పకుండా కట్‌చేసి తొలగించాల్సిందే. దక్షిణ ఆగ్నేయం పెరగటం అంటే.. నైఋతి తగ్గటం అన్నమాట. నైఋతి పెరిగినా, తగ్గినా అది శుభప్రదం కాదు.
కొన్ని స్థలాలు.. ఒకమూలే కాకుండా... రెండు మూలలు కూడా పెరిగి ఉంటాయి. వాటిని సరిచేసుకున్నాకనే గృహ నిర్మాణం కావించాలి. ముఖ్యంగా ఇలా మూలలు పెరిగిన వాటిని కరెక్టు చేయకుండా నిర్మాణాలు చేపట్టి ఉంటే.. ఒకవేళ అలాంటి నిర్మాణాలు మీరు కొనుగోలు చేయవలసి వస్తే... ఆ నిర్మాణం గావించబడిన స్థలం.. ఏ మూల పెరిగిందో తెల్సుకోండి. ఒకవేళ ఆ పెరుగుదల అశుభ సూచకం అయినట్లయితే.. ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆ మూలలలో అదనంగా ఉన్న స్థలాన్ని కట్ చేయడానికి అనువుగా గృహ నిర్మాణం జరిగి ఉంటే... మీరా ఇంటిని కొన్నాక అయినా.. ఇంటి స్థలంలో పెరిగిన భాగాన్ని కట్ చేయండి. దాన్ని ఏ మాత్రం వాడుకలో ఉండకుండా పూర్తి జాగ్రత్తలు వహించండి. ఒకవేళ పెరిగిన మూలలు సరిచేసేందుకు వీలుగా గృహ నిర్మాణం లేకపోయినట్లయితే ఆ గృహాన్ని కొనకుండా వదిలేయండి. ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం పెరిగి వున్న స్థలాన్ని అలాంటి స్థలంలో నిర్మించబడిన గృహాలను నిశ్చింతగా కొనేయండి.
7. ప్రహరీ గోడ నిర్మాణం:
ముందుగా వాస్తుపరంగా మన ఇంటి ప్రహారీ ఎలా నిర్మంచుకోవాలో తెల్సుకుందాం. ప్రధానంగా ప్రహారిగోడ ఎత్తు విషయంలో వాస్తు నియమాలు తప్పని సరిగా పాటించాలి. తూర్పు ప్రహారీ గోడ కన్నా ఉత్తరం వైపు ప్రహారీగోడ తప్పకుండా కొంత ఎత్తుగా ఉండాలి. ఉత్తరం ప్రహారీ గోడకన్నా పడమర ప్రహారీగోడ కొంత ఎత్తుగానే ఉండాలి. ఇక పడమర ప్రహారీగోడకన్నా దక్షిణం ప్రహారీగోడ ఇంకొంత ఎత్తుగా ఉండాలి. అన్నింటికన్నా తక్కువ ఎత్తులో తూర్పు ప్రహారీగోడ, అన్నింటికన్నా ఎక్కువ ఎత్తులో దక్షిణ ప్రహారీగోడ ఉండాలి. అలానే తూర్పుకన్నా పడమర... ఉత్తరం కన్నా దక్షిణం ప్రహారి గోడలు పోల్చి చూసినపుడు ఎత్తుగా ఉండి తీరాల్సిందే.
ప్రహారిగోడకు గేట్లు నిర్ణయం: కాంపౌండ్ వాల్‌కు గేట్లు అమర్చుకునే విషయంలో వాస్తు చక్కని నియమాలను సూచించింది. ఆ నియమాలకు అనుగుణంగా ప్రహారీగోడకు గేట్లు ఏర్పాటు చేసుకోవాలి. తూర్పు వైపు కాంపౌండ్ వాల్‌కు ఎక్కడ గేటు అరేంజ్ చేసుకోవాలో ముందుగా తెల్సుకుందాం. సహజంగా దక్షిణం కన్నా ఉత్తరం వైపు గృహ నిర్మాణ సమయంలో ఎక్కువ జాగా వదులుతాం. ఆ స్థలాన్ని కొలచి.. ఖచ్చితంగా దానికి మధ్యలో ఉంచేలా తూర్పు ఈశాన్యంలో కాంపౌండ్ వాట్ గేటు అమర్చుకోవాలి. ఇది సులవైన విధానం. ఇలానే తూర్పు కాంపౌండ్ వాల్ పొడవుఉ 9 భాగాలుగా విభజించి, ఉత్తరం నుండి మూడు నాల్గు భాగాలలో కూడా కాంపౌండ్ వాట్ గేటు అమర్చుకోవచ్చు. అలానే స్థలంలో గృహ నిర్మాణం జరిగినపుడు... ఇంటి సింహద్వారం ఎక్కడయితే వస్తుందో... దానికి ఎదురుగా కూడా తూర్పు కాంపౌండ్ వాల్‌కు మరో గేటు... వాహనాల రాకపోకలకు అనువుగా ఏర్పాటు చేసుకోవచ్చు.
ఉత్తరం ప్రహరీ గోడకు గేట్లు విషయంలో కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలి. గృహ నిర్మాణానికి ఉపయోగించే స్థలం పోగా తూర్పున ఎంత స్థలం అయితే వదిలారో... ఆ స్థలానికి మధ్యలో వచ్చేలా ఉత్తర ఈశాన్యంలో గేటు ఏర్పాటు చేసుకోవచ్చు. ఉత్తరం కాంపౌండ్ వాల్‌ను 9 భాగాలు చేసి తూర్పు నుండి 3,4 భాగాలలో కూడా గేట్‌ను అమర్చుకోవచ్చు.
పడమర కాంపౌండ్ వాల్‌కు గేటు అమర్చుకోవాలంటే కూడా ఇలాంటి నిబంధనలనే పాటించండి. సహజంగా దక్షిణం కన్నా ఉత్తర దిశలో ఇంటిని ఎక్కువ స్థలం వదులుతాము కనుక... ఈ ఖాళీ స్థలానికి మధ్యభాగంలో ఉండేలా పడమర కాంపౌండ్ వాల్‌కు పడమర వాయువ్యంలో గేట్ అమర్చుకోవాలి. అలానే పడమర కాంపౌండ్ వాల్‌ను తొమ్మిది భాగాలుగా విభజించి... మూడు, నాల్గవ భాగాలలో వచ్చేలా గేట్‌ను నిర్మించుకోవచ్చు.
ఇక దక్షిణ కాంపౌండ్ వాల్ విషయానికొస్తే... గృహ నిర్మాణానికి వినియోగించే స్థలం పోగా తూర్పున ఎలాగూ ఎక్కువ జాగా వదలడం జరిగి తీరుతుంది కనుక... ఈ తూర్పున ఉన్న ఖాళీ స్థలానికి మధ్యలో వచ్చేల దక్షిణ ఆగ్నేయంలో కాంపౌండ్‌వాలో గేటు అమర్చుకోవాలి. అలానే దక్షిణ ప్రహరీ గోడను 9 భాగాలుగా విభజించి తూర్పు వైపు నుండి 3,4 భాగాలలో కూడా ప్రహరీ గోడ గేట్‌ను అమర్చుకోవచ్చు.
- ప్రహరీ గోడకు అమర్చిన గేట్ పరికరాలు ఎప్పుడూ కాంతివంతంగా ఉండాలి. ఈ గేటు ఉన్న ప్రాంతంలో చీకటిగా ఉండకూడదు.
- గేట్‌ను లోపలకు తెరిచే విధంగా అమర్చుకోవాలన్న నిబంధనను తప్పక పాటించండి.
- కాంపౌండ్‌వాల్ గేటుకు ఎదురుగా కరెంటు స్తంభాలు, కరెంటు ట్రాన్స్‌ఫార్మర్స్ ఉండకూడదు.
- కాంపౌండ్‌వాల్ గేటుకు ఎదురుగా చెట్లు ఉండడం, గోతులు, గుట్టలు ఉండడం, పాడుబడిన ఇళ్ళు ఉండడం కూడా వాస్తుశాస్త్ర విరుద్ధమే.
- కాంపౌండ్‌వాల్ గేటు ఇంటి ప్రధాన సింహద్వారం కన్నా తక్కువ ఎత్తులో ఉండి తీరాలి. ఈ నిబంధనను కూడా విధిగా పాటిచాలి.
- కాంపౌండ్‌వాల్ గేటుకు ఎదురుగా చెత్తాచెదారం కుప్పలు, చెత్త కుండీలు, మురికినీరు నిల్వ ఉండడం వంటివి లేకుండా తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి.
- కాంపౌండ్‌వాల్‌కు అమర్చే గేటు ఇంట్లోని అన్ని తలుపుల కన్నా స్ట్రాంగ్‌గా, హెవీగా, పెద్దదిగా ఉండాలి.
- ప్రహరీ గోడ గేటు తీసే సమయంలో వేసే సమయంలో శబ్దం చేయకూడదు.
- మెయిన్‌గేట్‌కు ఎదురుగా దేవాలయం ఉండకూడదు.
ఖాళీస్థలం, గృహం రెండింటికీ ఉచ్ఛనీచ స్థానాలు ఉంటాయి. గేట్లు, ద్వారాలు కూడా అటు ఇంటికి, ఇటు కాంపౌండ్ వాల్స్‌కు ఉచ్ఛస్థానాలలో ఉండాలి. అలా ఉంటే నడక ఉచ్ఛస్థానంలో ఉంటుంది. ఇలా ఉచ్ఛస్థానంలో నడక సాగించడం వలన ఆ గృహంలో నివశించే వారికి ఎంతో మేలు జరుగుతుంది. నీచస్థానంలో ద్వారాలు, గేట్లు, నడక ఉండడం ఏ మాత్రం వాస్తు రీత్యా మంచిది కాదు. ఈ ఇంట నివశించే వారి జీవితాలలో మంచికన్నా కీడు అధికంగా ఉంటుంది.
కనుక ముందుగా గృహంలో, స్థలంలో ఉచ్ఛ నీచాలు ఏమిటన్నది వివరంగా తెల్సుకుందాం. కాంపౌండ్‌వాల్‌ను కానీ, ఇంటి గోడల్ని కానీ మూడు భాగాలుగా చేయండి.
ఈ వివరాలు మరింత వివరంగా తెల్సుకుందాం.
- తూర్పు గోడను తీసుకుందాం. మూడు భాగాలు చేద్దాం. ఉత్తరానికి దగ్గరగా తూర్పు ఈశాన్యాన్ని తాకుతూ ఉండే భాగం ఉచ్ఛస్థానం. అలానే దక్షిణానికి దగ్గరగా తూర్పు ఆగ్నేయాన్ని తాకుతూ ఉండే స్థానం నీచస్థానం.
- ఉత్తరపు గోడ విషయానికొస్తే... దీన్ని మూడు భాగాలుగా చేయండి. ఉత్తర ఈశాన్యాన్ని తాకుతూ తూర్పు దిశగా ఉండే భాగం ఉచ్ఛస్థానం. ఉత్తర వాయువ్యాన్ని తాకుతూ పడమర దిక్కున ఉండే స్థానం నీచస్థానం.
- పడమర గోడ విషయానికొస్తే... మూడు భాగాలతో పడమర వాయువ్యాన్ని తాకుతూ... ఉత్తరంలో ఉండే భాగం ఉచ్ఛస్థానం. అలానే దక్షిణాన్ని తాకుతూ పడమర నైఋతిలో ఉండే భాగం నీచస్థానం.
- దక్షిణం గోడను కూడా ఇలానే మూడు భాగాలు చేయండి. ఈ గోడలో... పడమర దిక్కుగా దక్షిణ నైఋతిని తాకుతూ ఉండే భాగం నీచస్థానం. అలానే తూర్పు దిశగా దక్షిణ ఆగ్నేయాన్ని తాకే భాగం ఉచ్ఛస్థానం. ఈ కారణంగానే.. కాంపౌండ్‌వాల్ గేట్లయినా.. ఇంటి గుమ్మాలయినా ఉచ్ఛస్థానాలలో ఉండేలా జాగ్రత్త వహించమంటుంది వాస్తుశాస్త్రం.
ఆస్తులు కొనుక్కోవాలనుకున్నప్పుడు... ఉంటున్న చోటుకు దూరంగా పోయి కొనుక్కునే కన్నా.. ఆనుకుని ఉన్న ఇళ్ళు. స్థలాలు అమ్మకానికి వస్తే కొనేసుకుని తమ ఆస్తిలో కల్పుకుందా అనుకుంటారు. అలా కల్పుకునే సమయంలో ప్రధానంగా లే అవుట్లలో ఫ్లాట్లు కొన్నవారు ఎక్కువగా ఈ సమస్యలకు లోనవుతుంటారు. ఇలాంటివారు వాస్తు నియమ విరుద్ధంగా స్థలాలను కొని తమ స్థలంలో కల్పుకోకూడదు. ఆ నియమాలు ఏమిటో తెల్సుకుందాం. మీ స్థలానికి... మీ ఇంటికి తూర్పున, ఉత్తరాన ఉన్న స్థలాన్ని ఇంటిని ఆలోచించకుండా కొని మీ స్థలంతో, లేదా మీ ఇంటితో నిశ్చింతంగా కలుపుకోమంటుంది వాస్తు. ఇలా మీ ఆస్తిని ఉత్తరం వైపుకు తూర్పు వైపుకు పెంచుకోవడం వాస్తురీత్యా ఎంతో శుభకరం. ఆరోగ్యం, ఆయుష్షు, ధనం ఇబ్బడి ముబ్బడిగా పెరిగి నట్టింట 'సిరి' నాట్యం చేస్తుంది. జీవితం మూడు పిందెలు... మూడొందల కాయలు అన్నట్లు ఉంటుంది.
ఇక దక్షిణక, పడమర దిశలో ఉన్న స్థలాలను కల్పుకోవడం లేదా ఇండ్లను కొనడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. దక్షిణ దిశలో స్థలం అయితే ఉచితంగా వచ్చినా కల్పుకోరాదన్నది వాస్తు పండితులు చేస్తున్న హెచ్చరిక.
అలానే ఆగ్నేయం మూలనున్న స్థలం, నైఋతి మూలనున్న స్థలం, వాయువ్యమూలనున్న స్థలం ఊడా ఆనుకుని ఉన్నాయి కదాని ఎట్టి పరిస్థితుల్లో కాని కల్పుకోకుడదు. కల్పుకున్నారంటే జీవితంలో అన్నీ అవాంతరాలే. ఎన్నో ఎదురు దెబ్బలు.. ప్రధానంగా నైఋతీ మూలనున్న స్థలం ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరకే వచ్చినా అంగుళం కూడా కల్పుకోకుడదు.
10. ఇంటి చుట్టూ ఖాళీ స్ధలము ?
స్ధలాల ఖరీదులు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో ఇంటి చుట్టూ ఖాళీ వదలడానికి ఎక్కువ శాతం ఎవరూ అంగీకరించడం లేదు. స్ధలంలో వీలయినంత ఎక్కువగా గృహ నిర్మాణం కావించి, ఇంటిలోని అన్ని గదులూ పెద్దవిగా ఉండేలా ఆలోచిస్తురే తప్ప, ఇంటి చుట్టూ ఖాళీ స్ధలం వదలకపోతే గాలీ వెలుతురు కరువుతాయిని, ఆ కారణంగా ఆ ఇంట్లి నివశించే వారికి అరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్న దిశలో ఎవరూ అలోచించట్లేదు.
- అపార్టుమెంటు అయినా, గృహం అయినా నాలుగు దిక్కులా ఖాళీ అన్నది ఉత్తమం. అయితే అపార్టుమెంట్స్ ఇలా నిర్మాంచడం చాలా కష్టం. కనీసం వీలయినంత మేరకు అపార్టుమెంటులోకి గాలి, వెలుతురు వచ్చేలా నిర్మాణం చేయడం వాస్తు రీత్యా ఉత్తమం.
- దక్షిణం కన్నా ఉత్తరం రాస్త ఎక్కువ ఉంటే చాలు.
- పడమర కన్నా తూర్పు కాస్త అధికం ఉంటే చాలు... శాస్త్రానికేగా... అనవసరంగా స్ధలం వేస్టు చేయకండి అనే గృహ యజమనులు ఈ మధ్య పెరిగిపోతున్నారు.
- ఇంటి చుట్టూ ఖాళీ వదిలే సమయంలో వాస్తుశాస్త్ర నియమాలను విధిగా పాటించండి.
- ఆవరణంలో పడమర కన్నా కనీసం మూడురెట్లు ఆపైన అధికంగా తూర్పు దిశన ఖాళీ వదలి తీరాలి. ఇలా ఖాళీ వదిలి నిర్మితయమైన గృహం... సుఖశాంతుల నిలయం అవుతుంది.
- అలానే దక్షిణం వైపు కన్నా మూడు రెట్లు అంత కన్నా ఎక్కువ ఖాళీని ఉత్తర దిక్కులో వదలడం వలన ఆ ఇంట లక్ష్మీదేవి స్ధిరనివాసం ఏర్పరచుకుటుంది.
- స్ధిరాస్తుల రూపంలోనో, చరాస్తుల రూపంలోనో డబ్బుకు కొదవ లేకుండా ఉంటుంది.
- భవిష్యత్ విషయంలో దిగులు ఉండని అర్ధిక పరిస్ధితిలో ఆ కుటుంబం అలరారుతుంది.
గృహ నిర్మాణ సమయంలో మనం విధిగా పాటించవలసిన వాస్తు సూత్రాలు... ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. మెదట ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణం ఎలా చేయాలో తెల్సుకుందాం.
- ఓవర్‌హెడ్ ట్యాంక్.... పడమర వైపు లేదా, నైఋతి మూలన ఉండేలా చూసుకోవాలి.
- ఓవర్‌హెడ్ ట్యాంక్.... పై స్లాబ్‌కు రెండడుగుల ఎత్తులో నిర్మించుకోవాలి. పై స్లాబ్‌ను ఆనుకుని ఉండకూడదు.
- ఈశాన్యంలో వాటర్ ఉండటం వాస్తురీత్యా సమంజసమే అయినా.. ఓవర్‌హెడ్ ట్యాంక్ వంటి బరువుల్ని ఈశాన్యం వైపు ఉంచకూడదు.
- అగేయ దిక్కులో ఓవర్‌హెడ్ ట్యాంక్‌ను ఎట్టి పరిస్ధితిలో నిర్మించ తగదు. చాలా దుష్ప్రభావాలకు కారణం అవుతుంది.
- పడమరదిక్కున ఓవర్‌హెడ్ ట్యాంక్‌ను నిర్మించుకోవడం వాస్తు సమ్మతమే.
- వాయువ్య దిశలో ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణం చేయకూడదు.
- బిల్డింగ్ పైన మధ్య భాగంలో ఓవర్‌హెడ్ ట్యాంక్ ఎట్టి పరిస్ధితుల్లో నిర్మించకూడదు.
వంటగది నిర్మాణ విషయంలో విధిగా వాస్త నియమాలను పాటించి తీరాలి. వంటగదిలో ఏర్పాట్లు ఎలా ఉండాలి.. ఈ విషయంలో వాస్తు ఏమి చెబుతుందో తెల్సుకుందాం.
- విధిగా వంటగదిను అగ్నేయ ములనే ఏర్పాటు చేసుకోవాలి. వీలుకాని పక్షంలో వాయ్యుంలో మాత్రమే కిచెన్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
- ఈశాన్యం, నార్త్ మధ్యలో, వెస్ట్ మధ్యలో, నైఋతిలో, దక్షిణం మధ్యలో, ఇంటికి నడుమ... ఎట్టి పరిస్ధితిలోనూ కిచెన్ నిర్మాణినికి అనువైనవి కావు.
- కిచెన్‌లో అమర్చుకునే కుకింగ్ ప్లాట్‌ఫాం ఎట్టి పరిస్ధిలో తూర్పు గోడను లేదా ఉత్తరపు గోడను తాకుతు ఉండరాదు. ఈ నియమేల్లంఘన ఎల్లెడలా జరుగుతూనే ఉంది. అగ్యేయంలో వంటగది అంటే... ఖచ్చితంగా కిచెన్ ప్లాట్‌ఫాం... ఇంటి తూర్పు గోడకు తాకుతూ ఉంటుంది. కనీసం అంగుళం అయినా ఈ ప్లాట్‌ఫాంకు ఇంటి తూర్పు గోడకు మధ్య ఖాళీ వుంచండి. ఇదే నియమాన్యి ఉత్తరపు గోడ విషయంలో కూడా వాయువ్యంలో కిచెన్ నిర్మించుకునే సమయంలో విధిగా పాటించాలి.
- వంట చేసే సమయంలో తూర్పు దిక్కును చూస్తూ ఉండేలా కిచెన్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసుకోవాలి.
- స్టవ్ అతి చేరువగా సింక్, టాప్స్ ఉండకూడదు.
- కిచెన్‌లో ఈశన్య మూల సింక్ ఏర్పటు చేసుకోవలి.
- డిష్ వాషర్ ఉన్నట్లాయితే దీన్ని కిచెన్‌లో నైఋతి మూలన ఉంచలి.
- త్రాగునీరు కిచెన్‌లో ఈశన్య దిశలో ఉంచలి. మైక్రో ఓవెన్,ఫ్రీఙె వంటి అప్లయెన్సెస్...కిచెన్‌లో నైఋతి మూల ఉండడం మంచిది.
- కిచెన్‌లో క్రస్ వెంటిలేషన్ విషయంలో వాస్తూ నియమాలు పాటించాలి.తూర్పు గోడకు పెద్ద సైజ్ కిటికిలు..దక్షణ గోడకు చిన్న సైజ్ కిటికిలు అమర్చుకోవలి.
- కిచెన్‌కు అనుకోని, కిచెన్ క్రింద భాగంలో ఎట్టి పరిస్ధీతులో నిర్మాణం చేయకూడదు.
- కిచెన్‌లో సరుకులు ఉంచుకునేందుకు వినియోగించే షెల్ఫలు అల్‌మరలు...దక్షణ , పడమర గోడలకు అమర్చుకోవాలి.
- అపార్టుమెంట్స్‌లో ప్రత్యేక పూఙగది నిర్మాణనికి స్ధలం చాలక పూజాగది కిచెన్‌లోనే ఓ మూలన ఏర్పాటు చేయడం ప్రస్తుతం జరుగుతుంది.పలు అపార్టుమెంట్సలో దీన్ని చూస్తూన్నాం.వాస్తుశాస్త్రరీత్య ఇది శాస్త్ర విరుద్ధమైన విషయం.
- కిచెన్‌లో డైనింగ్ టేబుల్ అమర్చుకోవడం శాస్త్ర విరుద్ధ విషయమే. కిచెన్ దోరకు ఎదురుగా గ్యాస్‌స్టవ్ ఉంచకూడదు.
- పడక గది విషయంలో వాస్తు చాలా నియమాలను తెలియఙేసింది.విధిగా ఈ నియమాలను పడక గది నిర్మాణ సమాయంలో పాటించారంటే...కుటుంబ వాతవరణం దంపతుల నడుమ ఆప్యాయతానురాగాలు బాగుంటాయి.బెడ్‌రూమ్‌లో నిర్మాణం విషయలలోనే కాకుండా బెడ్‌రూమ్ లోపల అరేంఙెమ్‌ంట్స్ విషయంలో కూడా ఎన్నో ఙాగ్రతలు తీసుకోవలి.
- ఇంటిలో ప్రధన బెడ్‌రూమ్ నైఋతీమూల ఏర్పటు చేసుకోవలి.
- పడక గదిలో బుక్ షెల్ఫలు, డ్రసింగ్ టేబుల్స్...బెడ్‌రూమ్‌లో పడమర వైపు లేదనైఋతి దిశలో అమర్చుకోవాలి. చతురస్ర, దీర్ఘచతురస్రాకార ఆకారంలోనే బెడ్‌రూమ్‌ల నిర్మాణం ఙరగాలి.అంతే తప్ప ఆడ్‌షేస్స్‌లో బెడ్‌రూమ్స్ నిర్మాణం ఙరకూడాదు.
- పడక గది డోర్ మినిమం 90 డిగ్రీలు అయినా తెరచుకునేలా ఏర్పాటు చుసుకోవాలి.
- పడక గదిలో మిర్రర్స్ లేకూండా ఉండడమే సముచితం.ఒకవేళ ఉన్నా మీ బెడ్‌కు ఎదురుగా గోడకు అమర్చకూడదు.
- పడక క్రింద.. బెడ్‌కు ఉంటున్న పెద్ద షెల్ఫ్‌లో చెత్తా చెదారం, పాత వస్తూవులూ, పనికిరాని వస్తూవులు. పనికిరాని దూస్తూలను ఉంచకండి.అలానే పాత పనికిరాని సామన్లు అంత పడక గదిలో బెడ్ దిగువకు నెట్టడం చేస్తూంటారు.ఇదీ వాస్తూరీత్యా మంచిది కాదు.మీకు సరయిన నీద్ర రాకూండ చేస్తూంది.
- పడక గదిలో అక్వేరియాంను ఉంచకూడదు.
- పడక గదిలో నిద్ర లేవగానే చూడలానో,నమస్కరించుకోవలనే దేవత విగ్రహలను ఉంచుతుంటారు.ఇది ఏ మాత్రం వాస్తూనమ్మకం కాదు.
- ఇంట్లో నైఋతి దిక్కున ఏర్పటు చేసీన మాస్టర్ బెడ్‌రూమ్‌ను ఆ ఇంటి యఙమానులే వాడుకోవాలి తప్ప.. పిల్లలు, గెస్ట్‌లు, ఇతరత్రా మరెవరూ ఉపయోగించరాదు.
- మీరు నిద్రించే బెడ్‌పై భాగాన భీమ్‌లు ఉంచకూడదు.
- పడక గదిలో బెడ్ ఎపూడు దక్షణం, పడమర గోడలకు ఆనుకునీ గానీ, లేదా పడమర గోడలకు అనూకోని గాని, లేదా వాటికి చేరువగా గాని ఆమర్చుకోవాలి.
- అలాగే అల్‌మైరాలు, ఇనుప బీరవలు... బెడ్‌రూమ్‌లో దక్షణం లేదా పడమర గోడకు ఆనుకుని ఉండేలా అమర్చుకోవాలి.
- పడక గదిలో ఎలాంటి ఎలక్ట్రనిక్ పరికరలు ఉంచరాదు.ఫోన్, టీ,విలను కూడా బెడ్‌రూమ్‌లో ఉంచకూడదు.
- పడకగది డోర్‌కు ఎదురుగా పడక గదిలో బెడ్‌ను ఉంచరాదు.
- డబల్ బెడ్ అయినప్పటికీ.. దానిపై సింగిల్ మేట్రెస్ మాత్రమే ఉండాలి. రెండు పరుపులు పెట్టి పరిస్థితిలోనూ ఉపయోగించకండి.
ఇంటికి వచ్చిన అతిధులకు ముందుగా దర్శనమిచ్చేది లివింగ్‌రూమ్. లివింగ్‌రూమ్‌ను తూర్పు, ఉత్తర దిశలలో ఏర్పాటు చేసుకోవడం వాస్తురీత్యా శుభకరం. ఆగ్నేయ దిక్కున లివింగ్‌రూమ్ నిర్మాణం జరపరాదు. అయితే దక్షిణం ఫేసింగ్ ఇళ్లకు మాత్రం.... ఆగ్నేయంలో లివింగ్‌రూమ్ ఏర్పాటు చేసుకోవచ్చు.
- కుటుంబ సభ్యులంతా కల్సి కూర్చుని మాట్లాడుకునేందుకు, టి.వి, వీక్షించేందుకు, రిలాక్స్ అయ్యేందుకు ఈ లివింగ్‌రూమ్ ప్రధానంగా
- ఉపయోగపడుతుంది. సహజంగా షాండిలియర్స్, క్రిస్టల్ లాంప్స్ ఏర్పాటు చేస్తారు. లివింగ్‌రూమ్‌లో లైటింగ్ ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉండేలా చూసుకోవాలి. డిమ్ లైటింగ్ ఉండకూడదు. అందమైన సోపాలు, టీపాయ్‌లు, టి.వి వంటివి అమర్చుకుంటాం కనుక... లివింగ్‌రూమ్ ఎంత పెద్దదిగా ఉంటే అంత బాగుంటుంది.
- వాస్తురీత్యా లివింగ్‌రూమ్‌లో లేవెట్రీ కానీ, బాత్‌రూమ్ కానీ హలుకు నైబుతీ మూల... పడమర, దక్షిణ గోడలకు ఆనుకుని ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.తూర్పు,ఉత్తర గోడలకు అనుకుని ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. తూర్పు, ఉత్తర గోడలకు ఆనుకొని ఉండకుండా గృహ నిర్మాణ సమయంలోనే జాగ్రత్తలు వహించాలి.
- లివింగ్‌రూమ్ ఇంటకిి ఉత్తర దిక్కుగా ఉండడం ఎంతో శుభప్రదం.
- వాయువ్యంలో కూడా లివింగ్‌రూమ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.
- ఉత్తరంలో లివింగ్‌రూమ్ ఉంటే ఆ ఇల్లు సుఖశాంతులతో అలరారుతుంది.
- నైఋతి దిశలో మాస్టర్ బెడ్‌రూమ్‌కు అనువైన స్ధలం. అయితే ఈ దిశలో కూడా లివింగ్‌రూమ్ నిర్మాణం వాస్తురీత్యా ఆమోద యోగ్యమే.
- లివింగ్‌రూమ్‌లో ఫ్లోరింగ్ ఉత్తరం వైపుకు, వాలు కల్గి ఉండాలి. అంటే నీరు పోస్తే... అవి ఉత్తరం, తూర్పు దిశలలో పారాలి తప్ప, పడమరకు, దక్షిణానికి పారకూడదు.
- లివింగ్‌రూమ్ ఏరియాలో నిర్మితమైన సీలింగ్ కూడా... తూర్పు, ఉత్తరాలకు కాస్త దిగి ఉండాలి.
- లివింగ్‌రూమ్‌కు డోర్ తూర్పు లేదా ఉత్తర దిక్కున ఏర్పారచుకోవడం వాస్తు నియమాల రీత్యా అదృష్ట ప్రదం.
- లివింగ్‌రూమ్‌కు పడమర వైపున ఎంట్రన్స్ ఉంటే.... మేథావులు, రీస్చెర్స్‌కు ఎంతో మేలు.
- దక్షిణ, ఉత్తర ఈశాన్యం, దక్షిణ ఆగ్నేయం ఎంట్రర్స్‌లు లివింగ్‌రూమ్‌కు ఉంటే... మంచిదే కానీ జరిగే చాలా లేట్‌గా జరుగుతుంది.
- లివింగ్‌రూమ్‌లో బరువైన ఫర్నిచర్ ఎప్పుడూ... దక్షిణ గోడలను ఆనుకుని, పడమర గోడలకు ఆనుకోని ఉండేలా తగు జాగ్రత్త వహించాలి. బరువైన సోఫాలు, దివాన్ సెట్స్ లాంటివి ఉత్తరపు గోడకు ఆనుకొని ఉండకుడదు. ఈ జాగ్రత్త లివింగ్‌రూమ్‌లో తప్పక పాటించాలి.
- లివింగ్‌రూమ్‌లో ఇంటి యజమాని ఎప్పుడూ... తూర్పు లేదా ఉత్తర వైపు తిరిగి కూర్చోవాలి. అప్పుడే కుటుంబంలో ఆయన ఆథిపత్యంకు గౌరవం లభిస్తుంది.
- టివిని ఎట్టి పరిస్ధితిలో ఈశాన్యం మూల ఉంచరాదు. టివి ఎప్పుడూ ఆగ్నేయ మూల ఉండడం వాస్తురీత్యా సమజసం.
- నైఋతిలో టివి ఉంచితే దాని ప్రభావం గృహంలో నివశించే వారి మీదే కాదు.... టివి మీద కూడా ఉంటుంది. తరుచు అది రిపెరిగ్‌కు వస్తుంది.
- లివింరూమ్‌లో ఫోన్‌ను తూర్పు, ఉత్తరం, ఆగ్నేయంలో ఉండేలా చూడండి.
- ఎయిర్‌కూలర్, ఎయిర్ కండీషనర్లను లివింగ్‌రూమ్‌లలో పడమర, వాయువ్యం, తూర్పు దిశలలో ఏర్పాటు చేయండి. పొరపాటు కూడా ఆగ్నేయంలో ఉంచరాదు.
- లివింగ్‌రూమ్ ఈశాన్యం మూల దేవుని చిత్రాపటాలు హేంగ్ చేయండి.
- లివింగ్‌రూమ్‌లో వార్, క్త్రెమ్, బాథాకరమైన, మరణించిన పెద్దల పటాలను ఉంచరాదు.
- లివింగ్‌రూమ్‌లో రెడ్ కలర్‌ను వాల్స్‌కు వేయకండి. వైట్, లైట్ ఎల్లో, బ్లూ, గ్రీన్ రంగులు లివింగ్‌రూమ్‌లో వాల్స్‌కు వేసుకోవచ్చు.
- లివింగ్‌రూమ్‌లో చతురస్త్రకారం, దీర్ఘచతురస్రాకార ఫర్నిచర్సనే వాడండి.రౌండ్, ఓవల్ ఇతరత్రా ఏ షేప్ ఫర్నీచర్స వాడకండి.
- డూప్లేక్స్ అయితే మెట్లు హలు నుండి ఏర్పటు చేసుకోవలసి వస్తే దక్షణ దిశలో , పడమరలో నైఋతి మూలా ఏర్పటు చేసుకోవచ్చు.
- ఈశన్యం మూలన ఉన్న విండోస్‌కు ఎప్పూడు లైటు వెయాట్ కర్టన్స్ మాత్రమే వాడలి.డోర్ కర్టన్స్ విషయంలో కూడా ఈ నియమం పాటించండి.ఇతరత్ర ఏ విండో అయినా డోర్ అయినా హెవీ కర్టన్స్ వాడవచ్చు.
- లివింగ్‌రూమ్‌లో ఈశన్యం మూలన ఖాళీగా ఉంచండి.
- లివింగ్‌రూమ్‌లో ఆర్టిఫిషీయల్ ఫ్లవర్స్, ఎండిపోయిన పూలు, సూదులుగా ఉండే ఆకులు గల చెట్లు, బోనసాయ్‌గా పిలువబడే మరుగుఙూ మొక్కలు ఉంచకూడాదు. వాస్తూరీత్యా ఇది శుభకరం కాదు.
- లివింగ్‌రూమ్ ఏరియాలో ..పడమర లేదా, దక్షణంకు దగ్గరగా షాండీలియర్ వ్రేలాడ తీయవచ్చు.షాండిలియర్‌ను లివింగ్‌రూమ్ మధ్యలో వ్రేలాడ తీయకూడదు.
- లివింగ్‌రూమ్ ఉత్తర దిశలో వాటర్ ఫౌంటెయిన్ ఏర్పటు చేసూకోవాలి.
- ఉత్తరం, తూర్పు, ఈశన్య దిశలో అక్వేరియం ఉంచడం ఎంతో శుభదాయకం.
బావి, బోర్ ఏర్పరచుకునే సమయంలో వాస్తు నిబంధనలు విధిగా పాటించాలి.
- స్థలానికి ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యంలోనే బావి కానీ బోర్‌కానీ ఉండాలన్నది వాస్తు నియమం, నీరు పడలేదు కదాని స్థలంలో వేరే చోట్ల బావి గాని, బోర్ కానీ త్రవ్వేయటం వాస్తు నియం విరుద్ధంగానే భావించ బడుతుంది.
- ఉత్తర ఈశాన్యంలో బోర్ పడకపోతే ఉత్తర సరిహద్దును రెండు బాగాలుగా చేసి, బావి కానీ బోర్ కానీ తూర్పు దిక్కుకు ఆనుకుని ఉన్న సగంలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఉత్తర సరిహద్దుకు పడమర దిక్కువైపున ఉన్న అర్ధబాగంలో బావి, బోర్ నిర్మాణం జరగకూడదు.
- అలానే తూర్పు ఈశాన్యంలో నీరు పడని పక్షంలో తూర్పు సరిహద్దులు రెండుగా విభజించి, ఈశాన్య దిక్కును ఆనుకుని ఉన్న భాగంలో ఎక్కడైన బావి, బోర్‌లు త్రవ్వుకోవచ్చు.
- ఎట్టి పరిస్థితిలో తూర్పు ఆగ్నేయాన్ని ఆనుకుని ఉన్న అర్ధబాగంలో బావి, బోర్‌లు ఉండకుండా పూర్తి జాగ్రత్తపడాలి.
- తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయువ్యం పడమర వాయువ్యం, పడమర నైఋతి, దక్షిణ నైఋతి, దక్షిణ ఆగ్నేయం, ఈ ప్రదేశాలలో బోర్ కానీ బావి కాని ఉండనే ఉండకూడదు. నీరు పడ్డాయి కదా అని సౌకర్యం కోసం స్థలంలోని ఈ ప్రదేశాలలో బావి త్రవ్వడం బోర్ వేయ్యడం చేశారంటే... ఆ ఇంట సుఖ శాంతులు ఉండవు. దరిద్రం ఆ ఇంటి తిష్ట వేసుకుంటుంది. కుటంబ సభ్యుల మద్య అనురాగ మమకారాలు కరువై గొడవలు, చికాకులు పెరిగిపోతాయి. తీవ్ర అనారోగ్యాలు ఆ ఇంట నివశించే వారిని వేధించి తీరుతాయి.
పూజా మందిరం ఇంట్లో... ఈశాన్యంలో ఉండడమే ఉత్తమోత్తమం. కుదరని పక్షంలో ఉత్తరం, తూర్పు దిశలలో మాత్రమే పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎట్టి పరిస్థితిలో పూజా మందిరం దక్షిణం వైపు ఉండరాదు. సాధ్యమైనంత వరకు విధిగా మీ పనూజా మందిరాన్ని మీ ఇంటో గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే ఏర్పాటు చేసుకోవాలి తప్ప... పై ఫ్లోర్‌లో కాదు.
- పూజా మందిరంలోని దేవతా విగ్రహాలు దేవతా చిత్రపటాలు తూర్పు దిక్కును లేదా పడమర దిక్కును చూసేలా ఉండాలి తప్ప ఉత్తర దక్షిణాల వైపు చూససే విధంగా అమర్చుకోరాదు.
- పూజా గదిలో తూర్పు గోడకు ఆనించి దేవతా మూర్తుల్ని అమర్చుకోరాదు. తూర్పు గోడకు, దేవాతా మూర్తికి మినిమంగా అంగుళం గ్యాప్ అయినా ఉండాలి.
- పూజామందిరానికి పై భాగంలో లేదా దిగువ భాగంలో టాయిలెట్స్ నిర్మాణం జరగకూడదు. పూజ గదిని దైవ సంబంధిత కార్యక్రమాలకు మినహా మరే ఇతర అవసరాలకు వినియోగించరాదు. మరణించిన ఆత్మీయుల ఫోటోగ్రాఫ్స్ కూడా పూజ మందిరంలో ఉంచరాదు.
- ఇంటి పూజ మందిరంలో బాగా వెయిట్ ఉన్న దేవతా మూర్తుల్నిఉంచకండి. ఎంత లైట్‌వెయిట్ అయితే అంత మంచిది. దేవాలయాల నుంచి, ప్రాచీన మందిరాల నుంచి తెచ్చుకున్న విగ్రహాలను పూజ మందిరంలో ఉంచకూడదు.
- పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం కుదరని కొందరు... తూర్పున లేదా ఈశాన్యంలో ఓ అరుగు నిర్మించి దానిపై దేవతా మూర్తుల్ని ఉంచి పూజలు చేస్తుంటారు. అరుగు రూపంలో తూర్పుమీద బరువు పడుతుంది కనుక ఇదీ శాస్త్ర సమ్మతం కాదు.
- ఈశాన్యంలో, తూర్పున పూజామందిరం ఏర్పాటు చేయడానికి సౌలభ్యం లేనప్పుడు ఒక మాస్టర్ బెడ్‌రూమ్‌ను మినహాయించి వేరు గదుల్లో ఈశాన్యం మూలన దేవతా విగ్రహాలనుంచి పూజ చేసుకోవచ్చు.
- గతంలో స్నానాల గది లేవట్రీలను విడివిడిగా నిర్మించుకోవడం జరిగేది. ప్రస్తుత కాలంలో ఈ రెంటినీ కల్పి నిర్మించడమే అధిక శాతం జరుగుతోంది. సాధ్యమైనంత మేర బాత్‌రూమ్, లావెట్రీలు మరీ ఇరుకుగా ఉండకుండా చూసుకోవాలి. వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి.
- బాత్‌రూమ్, లేవెట్రీలు ఆగ్నేయం, నైఋతీలలో నిర్మించుకోవడం శ్రేష్ఠం. వాయువ్యంలో కూడా బాత్‌రూమ్, లేవెట్రీలను నిర్మించుకోవచ్చు. ఎట్టి పరిస్థితులలో ఇంటికి ఈశాన్య దిశలో బాత్‌రూమ్ లావెట్రీలు నిర్మించడం తగదు. బయటవైపున బాత్‌రూమ్‌లు లేవెట్రీలు ఏర్పాటు చేసుకునే సమయంలో ఇవి ఉత్తరం, తూర్పు గోడల్ని తాకకుండా ఉండేలా జాగ్రత్త వహించాలి. పడమర, దక్షిణ గోడలకు ఆనించి బాత్‌రూమ్‌లు ఏర్పాటు చేసుకోవడం చేయవచ్చు.
- బాత్‌రూమ్‌లో ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసుకోవడం మంచి పద్ధతి. వెంటిలేటర్స్ ఉన్నా ఎగ్జాస్ట్‌లు బాగా పనిచేసి, బాత్‌రూమ్ లేవెట్రీలను దుర్వాసన రహితంగా ఉంచగుల్గుతాయి.
- బాత్‌రూమ్ లేవెట్రీల విషయంలో వాస్తు నియమాలు పాటించకపోతే, ఆర్ధికంగా ఇబ్బందులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు తప్పవని వాస్తు చెెబుతుంది.
- దక్షి నైఋతి, పడమర నైఋతి బాత్‌రూమ్ లేవెట్రీల నిర్మాణానికి నెంబర్‌వన్ ప్లేస్. ఇక ఉత్తర వాయువ్యం, పడమర వాయువ్యంలు కూడా బాత్‌రూమ్ నిర్మాణానికి సెకండ్ బెస్ట్‌గా భావించాలి.
కాంపౌండ్‌వాల్‌కు నిర్మించుకున్న గేటు తర్వాత ఇంటికి ప్రధానమైన ద్వారానే సింహద్వారం అంటారు. ఇంట్లోకి ప్రధాన రాకపోకలను ఈ ద్వారం ద్వారానే జరుగుతాయి.
- సింహద్వారం నిర్మించుకునే సమయంలో వాస్తు నియమలు విధిగా నిర్మించుకోవాలి.
- సింహద్వారం......... ఇంట్లోని అన్ని ద్వారల కన్నా కొలతలలో పెద్దదిగా ఉండాలి. దీనికిఅమర్చే తలుపు కూడా బలిష్ఠంగా, దృఢంగా ఉండాలి. సింహద్వారం ఎట్టి పరిస్ధితిల్లో ఇంటికి ఉచ్ఛస్ధానంలో ఉండాలి. ఒకవేళ నిర్మాణ రీత్యా వీలుచిక్కక పోతేనే కనీసం మధ్యమ స్ధానంలో ఉండేలా జాగ్రత్త పడాలి.
- నార్త్‌ఫేసింగ్ హౌస్‌కు సింహద్వారం నార్త్‌ఈస్ట్‌లోనే ఉండాలి. ఎట్టి పరిస్ధితిల్లో వాయువ్యంలో ఉండకూడదు.
- సింహద్వారం మూలకు అమర్చకూడదు.మూల నుండి అడుగు, అడుగున్నర దూరంలో అమర్చకోవాలి.
- వెస్ట్‌ఫేసింగ్ హౌస్‌కు పశ్చిమ వాయువ్యంలో సింహద్వారం ఏర్పరచుకోవాలి. పశ్చిమ నైఋతిలో ఎట్టి పరిస్ధితిలో సింహద్వారం ఏర్పాటు చేసుకోకూడదు.
- సౌత్ ఫేసింగ్ ఇంటికి దక్షిణ ఆగ్నేయంలో సింహద్వారం అమర్చకోవాలి. దక్షిణ నైయుతిలో ఎట్టి పరిస్ధితిలో సింహద్వారం ఏర్పాటు చేసుకోకూడదు.
- ఈస్ట్‌ఫేసింగ్ హౌస్‌కు సింహద్వారం తూర్పు ఈశాన్యంలో ఉండాలి. తూర్పు ఆగ్నేయంలో ఉండకూడదు.
- సింహద్వారం ముందు ఎలాంటి అడ్డంకులు ఉండరాదు. కనీసం పూలకుండీలు కానీ, క్రీపర్స్ కానీ... సింహద్వారం ఎదురుగా ఉండకూడదు అలానే చెట్టు నీడలు కూడా సిం
- హద్వారం పై పడకూడదు.
- సింహద్వారం ఎప్పుడూ రోడ్ లెవల్‌కు ఎత్తులో ఉండి తీరాలి.
- మెయిన్‌డోర్ వద్దకు చేరుకునేందుకు మెట్లు ఉన్నట్లయితే ఈ మెట్లు బేసి సంఖ్యలో ఉండాలి.
- మెయిన్‌డోర్‌కు ఎదురుగా పాడుబడిన, వాడకుండా వదిలి వేయబడిన గృహాలు లేకుండా చూసుకోవాలి.
- మన ఇంటి మెయిన్‌డోర్... ఎదుటి ఇంటి మెయిన్‌డోర్‌కు ఖచ్చితంగా ఆపోజిట్‌గా ఉండరాదు.
- సింహద్వారం ... కాంపౌండ్‌వాల్‌కు అమర్చిన గేటు ఒకే దిశలో ఉండడం వాస్తు రీత్యా మంచిది.
- సింహద్వారం యొక్క ఎత్తులో సగం వరకు వెడల్పు ఉండేలా సింహద్వారాన్ని తయారు చేసుకోవాలి. సింహద్వారం చెక్కతప్ప... ఇనుమువంటి లోహాలు వాడకూడదు.
- మెయిన్‌డోర్ పై భాగంలో బాత్రూమ్ లావేటరీ వచ్చేలా పై అంతస్తులో నిర్మాణాలు చేయకూడదు.
- సింహద్వారానికి స్లయిడింగ్ డోర్ వాడకూడదు.
- ఇల్లంతా ఊడ్చి సింహద్వారం దగ్గర పోగు పెట్టడం... డస్ట్‌బిన్ సింహద్వారం దగ్గరలో ఉంచటం, చీపుర్లు, బూజు ర్రలు సింహద్వారం వెనుక ఉంచడం వాస్తురీత్యా మంచిదికాదు.
- మెయిన్‌డోర్‌కు ఎదురుగా పాదరక్షలు విడువరాదు.
- సింహద్వారం... పగుళ్ళుచ్చినా... తీసివేసేటపుడు కిర్రు శబ్దాలు చేసినా అది ఆ గృహంలో నివసించే వారికి మంచిది కాద.
- మెయిన్‌డోర్‌కు సెల్ఫ్ క్లోజింగ్ సిస్టమ్ అమర్చకూడదు.
- మీ సింహద్వారం ఎదురుగా దేవాలయం ఉండకూడదు.
డైనేజీ విషయంలో సైతం వాస్తు ఎన్నో నియమాలను వివరించింది. పాటించామా జీవితాంతం... ఆనంద ప్రమోదాలే. . నిర్లక్ష్యం చేశామా... పలురకాల బాధలు.
- ఇంల్లో అన్నిరకాల ఉపయోగించిన నీరు, వర్షపు నీరు, తూర్పు ఈశాన్యం నుంచి గానీ ఉత్తర ఈశాన్యం నుంచి గానీ బలయటకు వెళ్ళేలా ఏర్పాటు చేసుకోవాలి. డ్రైనేజీని ఏర్పాటు చేసే సమయంలో ఈ నియమాన్ని విధిగా పాటించి తీరాలి.
- పశ్చిమ నైఋతి ఉత్తర దిశ మీదుగా నీరు ఈశాన్యం పైపు నడిచి బయటకు వెళ్ళాలి. అలానే దక్షిణ నైఋతి నుండి దక్షిణం, తూర్పులగుండా ప్రవహించి ఈశాన్యం నుంచి బయటకు వెళ్లేలా డ్రైనేజీలు నిర్మించాలి.
- ఈ విధంగా నీరు ఫ్రీగా నడిచి ఈశాన్యానికి నడిచే రీతిగా కాలవలు నిర్మించాలి. నైఋతిలోని నీరు ఆగ్నేయానికి వాయువ్యాయానికి ఫ్రీగా నడిచేందుకు వీలుగా నైఋతి నుండి వాయువ్యానికి, ఆగ్నేయానికి వాటం ఉండేలా జాగ్రత్తపడాలి.
- వాయువ్యానికి చేరిన నీటిని ఈశాన్యం వైపు నడవాలంటే వాయువ్యం కన్న ఈశాన్యం పల్లంగా ఉండాలి. ఇదే రీతిగా ఆగ్నేయ మూలకన్న కలువ ఈశాన్యంలో పల్లంగా ఉండాలి. అప్పుడే నైఋతి నుండి ఆగ్నేయానికి చేరిన నీరు ఫ్రీగా ఈశాన్యానికి వెళ్తాయి.
- ఇంట్లో కాలకృత్యాలకు ఇతర ఇతర అవసరాలకు వినియోగించిన నీటిని ఎలా అయితే ఈశాన్యం గుండా బయటకు పంపామో అదే రీతిగా ఇంటి స్లాప్‌లు కూడా ఈశాన్యంలో పల్లంగా ఉండేలా జాగ్రత్త వహించి వర్షపు నీరు స్లాబ్ పై నిలువ ఉండకుండా ఈశాన్యంలో ఏర్పాటు చేసిన తూము ద్వారా బయటకు వెళ్ళేలా స్లాబ్ నిర్మాణం సమయంలో పూర్తి జాగ్రత్తలు పాటించాలి. లేని పక్షంలో స్లాబ్‌పైన వర్షపు నీరు నిలచి పోయి, స్లాబ్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది.
- 6. ఈశాన్యం గుండా డ్రైనైజ్ వాటర్‌ను బయటకు పంపడం కుదరని పక్షంలో... వాయువ్యం మీదుగా లేదా, ఆగ్నేయం గుండా డ్రైనేజీ వాటర్‌ను బయటకు పంపేలా ఏర్పాట్లు చేసుకోవాలి.
- మెట్లు అంటేనే బరువుతో కూడినవి కనుక మెట్లను ఏర్పాటు చేసుకోనే సమయంలో బరువు
- వేయతగని ప్రాంతంలో మెట్లు నిర్మించకుండా ఎన్నో జాగ్రత్తలు వహించాలి.
- దక్షిణ దిశ,పడమర దిశలో మెట్లు ఏర్పాటు చేసుకోవడం వాస్తురీత్యా సముచితం.
- ఇంటి బయట ఏర్పాటు చేసుకోనే మెట్లు.... తూర్పున అయితే ఆగ్నేయంలో ఉత్తరంలో అయితే వాయువ్యంలో పడమర అయితే నైయుతిలో, దక్షిణంలో అయితే నైయుతిలో నిర్మించుకోవాలి.
- మెట్లు తూర్పు నుంచి పడమరకు ఎక్కేలా, ఉత్తరం నుంచి దక్షిణానికి ఎక్కేలా ఉండాలి. మధ్యలో లభించిన ఖాళీకి అనుగుణంగా మెట్లును వేరే దిశకు మళ్ళించవచ్చు.
- మెట్లు సంఖ్య ఎప్పుడు బేసి సంఖ్యలోనే ఉండాలి. సంఖ్య చివర జీరో వుండకూడదు.
- ఈశాన్యంలో ఇంటి మధ్యలో మెట్లు ఎట్టి పరిస్ధితిలో నిర్మించుకూడదు. ఆర్ధికంగా చాలా వేతలు పడాల్సి వస్తుంది. స్టెయిర్ కేస్ దిగువన.... కిచెన్,బాత్‌రూమ్,పూజ గది వంటివి నిర్మించుకోకుడదు. మెట్లు క్రింద భాగం స్లోరేజ్‌కు ఉపయోగించుకోవచ్చు.
- పై అంతస్తుకు వెళ్ళెందుకు దిగువ సెల్లార్‌కు కానీ బేస్‌మెంట్‌కు కానీ వెళ్ళేందుకు ఒకే స్టెయిర్ కేస్‌ను ఉపయోగించకండి.సెల్లార్‌కు వెళ్ళేందుకు వేర్ స్టెయిర్‌కేస్ ఏర్పాటు చేసుకోమని సూచిస్తుంది వాస్తు.
- స్టెయిర్ కేస్‌లో టర్నింగ్‌లు ఎప్పుడూ క్లాక్‌వైజ్ డైరెక్షన్‌లోనే ఉండాలి. యాంటీక్లాక్‌వైజ్ డైరెక్షన్‌లో మెట్లు టర్నింగ్‌లు ఉండడం వాస్తు విరుద్ధం.
- సాధ్యమైనంత వరకు స్పిరల్,సర్క్యులర్ కేస్‌లను ఏర్పాటు చేసుకోవద్దు.
- పై అంతస్తు లేదా టెర్రాస్ పైకి వెళ్ళే స్టెయిర్ కేసుకు రూఫ్ ఉండి తీరాలి.
- స్టెయిర్ కేస్‌కు డోర్స్ ఉంటే.... లోయర్ డోర్ కన్నా అప్పర్‌డోర్ 10 అంగుళాల వరకు తక్కువ ఎత్తులో ఉండాలి. స్టెయిర్ కేస్ దిగువన సేఫ్టీలాకర్స్,విలువైన సంపదతో కూడిన అల్‌మైరాలు ఉంచకూడదు.
- ఇంటి చుట్టూ తిరిగి వచ్చేలా స్టెయిరకేస్‌ను అమర్చడం బహుళ అంతస్తుల బిల్డింగ్స్‌లో చూస్తుంటాం. వాస్తు శాస్త్ర రీత్యా ఇవి ఎన్నో అనర్ధాలకు దారితీస్తుంది.
- దక్షిణం నుండి ఉత్తరానికి, పడమర నుండి తూర్పుకు మేడమెట్లు ఎక్కేలా ఏర్పాటు చేసుకోవడం శాస్త్ర విరుద్ధం. ఇలాంటి గృహంలో అభివృద్ధి లోపిస్తుంది. అనేక రకాల శారీరక మానసిక బాధలు చుట్టుముడతాయి.
- పడమర, దక్షిణ గోడలకు ఆనుకుని మెట్లు నిర్మించవచ్చు. తూర్పు, ఉత్తర గోడలకు దూరంగా ఉండేలా మెట్లు నిర్మించుకోవాలి.
- మెట్లు వాలు 30 నుండి 45 డిగ్రీల నడుమ ఉండాలి. అంతకు మించి ఉంటే మెట్లు ఎక్కడం శ్రమ అవుతుంది. మోకాళ్ళు నడుం నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంది.
- కార్ గ్యారేజ్ విషయంలో ఎంతో మంది వాస్తు నియమలను ఉల్లఘింస్తున్నారు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ గ్యారేజ్ నిర్మించుకోవడమో..... ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ కార్‌ను ఉంచుకోవడమో చేస్తున్నారు. కార్ గ్యారేజ్ అనగా వాహనాలు నిలిపే విషయంలు కూడా వాస్తు ఎన్నో నియమలను సూచించింది.
- గ్యారేజ్ నిర్మాణానికి వాయువ్యం, ఆగ్నేయం, రెండు దిక్కులే ది బెస్ట్.
- గ్యారేజ్‌లో ఫ్లోరింగ్,ఈస్ట్, నార్త్ దిక్కులు పల్లంగా ఉండేలా చూసుకోవాలి.
- కార్ గ్యారేజ్‌లో పార్కింగ్ చేశాక....రెండు మూడూ అడుగులు మినిమంగా చుట్టూ ఖాళీ ఉండేలా గార్యేజ్ నిర్మాణం జరగాలి.
- .కార్ షెడ్ ఎట్టి పరిస్ధితిలో కాంపౌండ్‌వాల్‌కు గానీ, మెయిన్ హౌస్‌కు కానీ తగలకుండా నిర్మించుకోవాలి.
- ఈశాన్యంలో కార్ పార్క్ చేయడం కానీ, గ్యారెజ్ నిర్మించుకోవడం కానీ చేయనే చేయకూడదు.
- ఒకవేళ బేస్‌మెంట్‌లో అయితే..... ఈశాన్యం మూలన కూడా కార్ పార్క్ చేసుకోవచ్చు.
- కార గ్యారేజ్ ఏర్పాటు చేసుకోవచ్చు.
- ఆగ్నేయంలో కార్ పార్క్ చేస్తే తరుచు కార్ రిపెయిర్ వస్తుంది.తక్కువగా తిరుగుతుంది.
- వాయువ్యంలో గార్యేజ్‌లో కార్ పార్క్ చేస్తే తిరుగుడు పుల్‌గా ఉంటుంది. అయితే రిపెయిర్స్ చాలా తక్కువగా ఉంటాయి.
- గ్యారేజ్‌కు యొక్క గేటు తూర్పు లేదా ఉత్తర దిక్కుకు తిరిగి ఉండాలి.
- గ్యారేజ్‌కు ఏర్పాటు చేసే గేటు.... ఇంటి సింహద్వారం కన్నా ఎత్తుగా ఉండకూడదు. అలాగే కాంపౌండ్ వాల్ కన్నా ఎత్తుగా ఉండకూడదు.
- గ్యారేజ్‌లో చెత్త చెదారం ఉంచకూడదు.త్వరగా ఫైర్ అయ్యే ఎలాంటి పదార్ధాలు గ్యారేజ్‌లో ఉంచకూడదు.
- సెప్టిక్ ట్యాంక్ నిర్మాణంలో వాస్తు నియమాలు పాటించడం చాలా అవసరం.
- సెప్టిక్ ట్యాంక్‌ను ఈశాన్యం,నైఋతి, ఆగ్నేయ మూలల్లో ఏర్పాటు చేయకూడదు.
- ఉత్తరం గోడలను తొమ్మిది భాగాలు చేసి వాయువ్య మూల నుండి మూడవ భాగంలో సెప్టిక్ ట్యాంక్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
- గృహం యెక్క ప్లింత్‌కు, కాపౌండ్‌వాల్‌కు టచ్ కాకుండా మినిమం 2 అడుగుల దూరంలో ఉండేలా సెప్టిక్ ట్యాంక్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
- ఇంట్లో వున్న మరుగుదొడ్ల సంఖ్యకు అనుగుణంగా సెప్టిక్ ట్యాంక్‌ను ఏర్పాటుచేసుకోవాలి.
- సెప్టిక్ ట్యాంక్ నుంచి వెలువడే దుర్గంధం బయటకు పోవడానికి తప్పకుండా పైప్ ఏర్పాటు చేసుకోవచ్చు.
- స్ధలాభావం వలన సెప్టిక్ ట్యాంక్ ఉత్తరం దిక్కులోని 3వ భాగంలో పైన చెప్పినట్లు ఏర్పాటు చేసుకోలేకపోతే సెప్టిక్ ట్యాంక్‌ను వాయువ్య దిశలో కాంపౌండ్ వాల్‌కు ఇంటిప్లింత్‌కు దూరంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవచ్చు.
- ఇంటిలో తలుపులు కానీ, కిటికీలు కానీ తూర్పు,ఉత్తర దిశలలో ఎక్కువగా, దక్షిణం,పడమర దిశలో తక్కువగాను ఉండేలా చూసుకోవాలి.
- తలుపులన్నింటి కన్నా సింహద్వారం తలుపు పెద్దదిగా ఉండాలి.మిగిలిన తలపులన్నీ ఒకే పరిమాణంలో ఉండాలి. ఒకవేళ కొన్ని తలపులు పెద్దదిగా ఏర్పాటు చేసుకోవాలినిపిస్తే.... ఇలాంటి పెద్ద తలుపులు,దక్షిణం-పడమరలలో మాత్రమే ఉండేలా ఉత్తరం,తూర్పు దిశలో ఉండకుండా జాగ్రత్త వహించాలి.
- తలుపులు,కిటికీలు ఎప్పూడూ సరిసంఖ్యలో మాత్రమే ఉండాలి.
- తలుపులు, కిటికీలు ఏర్పాటు చేసుకునే సమయంలో క్రాస్ వెంటిలేషన్ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.అంటే ఒకదానికొకటి ఎదురు బొదురుగా ఉండేలా జాగ్రత్తా వహించాలి.
- ఇంట్లో ఏ గదికైనా గుమ్మాలు.... ఉత్తర ఈశాన్యం,తూర్పు ఈశాన్యంలో ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో ఏ గదికైనా..... ఉత్తర వాయువ్యం,తూర్పు ఆగ్నేయం, దక్షిణ నైఋతి,పడమర నైఋతిలో గుమ్మాలు ఉండకుండా గృహ నిర్మాణ సమయంలో జాగ్రత్తలు వహించాలి.
- సెయిర్ కేస్‌కం ప్రారంభంలో, ఎండింగ్‌లో డోర్స్ ఏర్పాటు చేసుకోవడం వాస్తురీత్యా మంచిది.
- కిటికీలు వెడల్పు విషయంలో తేడాలున్నా ఎత్తు విషయంలో ఒకేలా ఉండేలా జాగ్రత వహించాలి.
- గార్డెన్ ఏర్పాటులో మంచిగా వాస్తు నిబంధనలు పాటిస్తే... మానసికంగా ఆనందం, ప్రశాంతత, ఉల్లాసం లభిస్తాయి. గార్డెన్, లాన్, డెకరేటివ్ ప్లాంట్స్ ఎల్లప్పుడూ తూర్పుదిశలలో ఉండేలా చూసుకోండి.
- కుక్కలకు పెట్ హౌస్, పక్షుల కోసం ఏర్పాటు ఎప్పుడూ వాయువ్యంలోనే చేయాలి.
- గార్డెన్‌లో చెత్తా చెదారం లేకుండా ప్రతి రోజూ క్లీన్ అండ్ గ్రీన్‌లా చేసుకోవాలి.
- మెయిన్ గేట్ నుంచి ఇంటిలోకి వెళ్ళే దారిక ఇరువైపులా చిన్నచిన్న పూల మొక్కలు వంటివి పెంచుకోవచ్చు.
- గార్డెన్‌తో పాటు స్విమ్మింగ్ పూల్ నిర్మించుకోవాలంటే కేవలం ఈశాన్య దిశలో తప్ప.. మరే దిక్కులో స్విమ్మింగ్‌ఫూల్ నిర్మాణం చేయకూడదు.
- గార్డెన్‌లో ఫౌంటెయిన్స్, గార్డెన్ మధ్యలో ఏర్పాటు చేయకూడదు. ఈశాన్యంలోనే ఏర్పాటు చేసుకోవాలి.
- ఇంటిలోపల నిమ్మ, జీడిమామిడి, నేరేడు, తుమ్ము, ఈత, జిల్లేడు, కుంకుడు, మామిడి, మారేడు, చింత చెట్లు పెంచకూడదు.
- పనస, అశోక, వేప, కొబ్బరి, మర్రి, రావి, జామ, వంటి చెట్లను ఇంటిలో పెంచుకోవచ్చు.
- వాస్తు బలం గల స్థలం, కాస్తయినా చాలు - గృహస్థుకు చేస్తుంది ఎంతో మేలు.
- మొదట స్థలశుద్ధి చేయండి - పిదప ఇల్లు కట్టేందుకు సిద్ధం కాండి.
- స్థలానికి ఈ శాన్యంలో శంఖుస్థాపన చేయడం - పంచభూతాలకు ఆహ్వానం పలకడం.
- ముందు ఇంటి చుట్టూ ప్రహారి పునాది నిర్మించు - మీడట అన్ని విధాల అది నిన్ను రక్షించు.
- నైఋతిని మూలమట్టానికి సరిచేసి కట్టడం - సక్రమమైన సిరులను పొందడం.
- పునాది త్రవ్వకం ఈశాన్యం నుండి ప్రారంభించు - అదియే నిర్మాణాన్ని సత్వరం ముగించు.
- పునాది గోడ నైరృతి నుంచి మొదలు పెట్టి కట్టడం - అనేక శుభాలకు హారతి పట్టడం.
- తూర్పున బావి - మార్పులేని సుఖాల తావి. (తావి = పరిమళం)
- అగ్నేయ కూపం - అతివల అవర్ధాలకు ప్రతిరూపం.
- దక్షిణంలో బావి - తరుణులకు మరణాల దీవి.
- నైరృతిలో నుయ్యి - మృత్యువు చాచిన చెయ్యి.
- పడమట బావి - పురుషుని ఆరోగ్యానికి ఎండమావి.
- వాయవ్యంలో బావి - జగడాల కొరివి.
- ఉత్తరంలో నుయ్యి - ఉత్తమ దీవెనలిచ్చు చెయ్యి.
- ఈశాన్యలో నుయ్యి - విశేష శుభ ఫల ప్రదాయి.
- మొదట ఈశాన్యంలో త్రవ్విన బావి - ఆ నీటితో కట్టినిల్లు బంగారు దీవి.
- తూర్పు మరియు తూర్పు ఈశాన్యలలో వాటర్ పంప్ - ఆరోగ్యాన్ని ఇంట
- నిలిపే లక్కీ స్టాంప్.
- ఉత్తరం మరియు ఉత్తర ఈశాన్యలలో భూమిలో వాటర్ ట్యాంక్ - సంపదల
- రాబడికి స్విస్ బ్యాంక్.
- ఆగ్నేయంలో భూమిపై ట్యాంకుతో నీరు నిలువ - అన్ని విధాల సుఖశాంతులకు విలువ.
- దక్షిణ పశ్చిమాలలో భూమిపై ట్యాంకుతో నీరు నిలువ వుంచటం - సుఖ శాంతులను పెంచటం.
- నైరృతి వాయవ్యాలలో భూమిపై ట్యాంకుతో నీరు నిలువ వుంచడం - సాటిలేని
- శాంతికి పట్టం కట్టడం.
- ఆగ్నేయ నైరృతులలో భూమిలో నీటి నిలువ - దీర్ఘ రోగమరణాలకు చేరువ.
- దక్షిణ పశ్చిమాలలో భూమిలో నీరు నిలువ చేయడం - మృత్యు ముఖద్వారానికి చేరుకోవడం.
- వాయవ్యాలలో భూమిలో నీటి సంప్ - లౌకిక వ్యవహారల తెగదెంపు.
- పడమటి కన్నా తూర్పున ఎక్కువ ఖాళీ స్థలం వుండటం - పురుషుని కీర్తి కిరీటం.
- దక్షిణం కన్నా ఉత్తరాన ఎక్కువ ఖాళీ స్థలం - సిరులకు, స్త్రీల సుఖాలకు ఆలవాలం.
- తూర్పు కన్నా పడమట ఎక్కువ ఖాళీ స్థలం - పరుషుల యోగ్యత విఫలం.
- ఉత్తరం కన్నా దక్షిణంలో ఎక్కువ ఖాళీ స్థలం - అన్ని అనర్ధాలకు మూలం.
- ఈశాన్యంలో ఖాళీ లేని గేహం - శ్వాస నిలిచిపోయే దేహం (గేహం = ఇల్లు).
- విదిక్కుల స్థలం ఇంటికి ఆగ్నేయ వాయవ్యాలలో సమాన ఖాళీ వుంచు - అది నీ ప్రతిష్ఠను పెంచు.
- విదిక్కుల స్థలం ఇంటికి అన్నింటికన్నా ఈశాన్యంలో ఖాళీ ఎక్కువ - ఉంటే
- ధన, కనక వస్తు వాహనాలకు ఉండదు తక్కువ.
- తూర్పు స్థలాన్ని కలుపుకో - కీర్తి సంపదలను గెలుచుకో.
- ఆగ్నేయ స్థలాన్ని కలపుకోవద్దు - ఆపదలను దాపునకు పిలుచుకోవద్దు.
- దక్షిణ స్థలాన్ని కలుపుకోకు - రక్షణ కవచాన్ని కోల్పోకు.
- నైరృతి స్థలం వూరకవచ్చినా కలుపుకోకు - కష్టాలను కొని తెచ్చుకోకు.
- పశ్చిమ స్థలాన్న కలుపుకోవడం - పచ్చని ఆరోగ్యానికి చిచ్చు పెట్టుకోవడం.
- వాయవ్య స్థలాన్ని కలుపుకున్నవారు - మనశ్వాతిని కోల్పోతారు.
- ఉత్తర స్థలాన్ని కలుపుకో - ఉత్తమ ఫలాన్ని అందుకో.
- ఈశాన్యంలోని స్థలాన్ని కొనడం - విశేష ఐశ్వర్యాలతో వృద్ధిచెందడం.
- ఈశాన్యంలో స్థలంపోతే - ఇంట్లో ఇనుపగజ్జెల మోతే (ఇనుపగజ్జెలుదరిద్రానికి గుర్తులు)
- తూర్పు, తూర్పు ఈశాన్యంలో భూగృహ నిర్మాణం - కలిగించును నిత్యకల్యాణం.
- దక్షిణాన భూగృహ నిర్మాణం - ఆయుక్షీణతకు కారణం.
- పడమట భూగృహ నిర్మాణం - కడతేరని కష్టాలతో రణం. (రణం = యుద్ధం)
- ఉత్తరం, ఉత్తర ఈశాన్యంలో భూగృహ నిర్మాణం - స్త్రీలకు ముత్యాల ఆభరణం.
- ఉదయం లేవగానే తూర్పు వాకిలి తెరవటం - ఆరోగ్యసంపదలనాహ్వానించడం.
- తూర్పు వాకిలి లేనప్పుడు ఉత్తరం వాకిలి తెరవాలి - ఉత్తమోత్తమ గాలులతో మీ ఇల్లు నింపాలి.
- తూర్పు ద్వారం - శుభకరమైన వరం.
- తూర్పు ఆగ్నయ ద్వారం - అగ్నికి, వ్యాధులకు, చోరులకు స్థావరం.
- దక్షిణ ఆగ్నేయ ద్వారం - స్త్రీలకు చేస్తుంది ఉపకారం.
- దక్షిణ ద్వారం - గృహస్థులకు శుభకరం.
- దక్షిణ నైరృతి వాకిలి - సుదతుల సుఖాలను నలుగదంచు రోకలి.
- పశ్చిమ నైరృతి వాకిలి - పురుషుల జీవితాలకు ఘోరకలి.
- పశ్చిమ ద్వారం - గృహస్థులకు క్షేమకరం.
- పశ్చిమ వాయవ్య ద్వారం - పలు శుభాలకు పసిడి హారం.
- ఉత్తర వాయవ్య ద్వారం - నిరంతర చంచల వ్యవహారం.
- ఉత్తర ద్వారం - ఉత్తమ ప్రగతికి రత్నహారం.
- ఉత్తర ఈశాన్య ద్వారం - విత్త ప్రాప్తికి, స్త్రీ సౌభాగ్యానికి ఆధారం.
- తూర్పు ఈశాన్యద్వారం - యజమాని కీర్తికి, సంతతి పురోగతికి మందారం. (మందారం = కల్పవృక్షం).
- ఈశాన్యం గదికి తూర్పున నిష్క్రమణ ద్వారం - శుభాలు అపారం.
- ఆగ్నేయం గదికి తూర్పులో నిష్క్రమణ ద్వారం - ఇంటికి నీచమైతే ఆరోగ్యానికి హానికరం.
- ఆగ్నేయం గదికి దక్షిణ ఆగ్నేయంలో నిష్క్రమణ ద్వారం - స్రీలకు సౌభాగ్యకరం.
- నైరృతి గదికి దక్షిణంలో నిష్క్రమణ ద్వారం - ఇంటికి నీచమైతే ఇంతులకు ప్రాణాపాయకరం.
- నైరృతి గదికి పశ్చిమంలో నిష్క్రమణ ద్వారం ఇంటికి నీచంలో వున్న - పురుషులకు ఆరోగ్యం సున్న.
- వాయవ్యం గదికి ఉత్తరంలో నిష్క్రమణ ద్వారం - ఇంటికి నీచంలో వున్నస్త్రీలకు అశాంతి మిన్న.
- ఈశాన్యం గదికి ఉత్తరాన నిష్క్రమణ ద్వారం - సిరులకు ఆకరం.
- తూర్పు నుండి దక్షిణ నైరృతి ద్వార గమనం - స్రీలకు సంకటాల ఆగమనం. (ఆగమనం = రాక)
- తూర్పు నుండి పశ్చిమ నైరృతి ద్వార గమనం - పురుషులకు అరిష్టాల ఆగమనం.
- తూర్పు నుండి పడమటికి వరుస వాకిళ్ళ నడక - వరించును కీర్తి పురుషులకు వీడక.
- తూర్పు నుండి పశ్చిమ వాయవ్యానిక గమనం - ఆనారోగ్యాల ఆగమనం.
- తూర్పు ఆగ్నేయం నుండి పశ్చిమ ద్వారగమనం - యజమానిని చేస్తుంది పతనం.
- దక్షిణ ఆగ్నేయం నుండి ఉత్తర వాయవ్యానికి నడక - కడలేని కలహాలకు పుట్టుక.
- దక్షిణ ఆగ్నేయం నుండి ఉత్తర ఈశాన్యానికి నడక - కమ్మని కలల తీరాలకు చేరిక.
- దక్షిణం నుండి ఉత్తర వాయవ్య ద్వార గమనం - స్త్రీలకు కలిగించున దుర్వర్తనం.
- దక్షిణం నుండి ఉత్తర ఈశాన్య ద్వారగమనం - వనితలకు సౌభాగ్య జీవితానికి విహారవనం. (వనిత = స్త్రీ).
- పశ్చిమం నుండి తూర్పు, ఉత్తర ఈశాన్యద్వారాల నడక - నిశ్చయంగా శుభాలనిస్తుంది తప్పక.
- పశ్చిమం నుండి తూర్పు ఈశాన్యానికి ద్వార గమనం - పురుష సంతానానికీ, విజ్ఞానికీ సోపానం.
- ఉత్తరం నుండి దక్షిణానికి ద్వార గమనం - తరగని సిరులకు ఆహానం.
- ఉత్తరం నుండి దక్షిణానికి ఆగ్నేయానికి నడక - కలహాగ్నికి రాచుకునే పిడక.
- ఉత్తరం నుండి దక్షిణ నైరృతి నడక - ఆడవారికి అశుభాల పడక.
- దక్షిణానికి వాకిలి ఉన్న యింటికి - తప్పక ఉండాలి వాకిలి ఉత్తరానికి.
- ఇంటికి పశ్చిమాన వుంటే వాకిలి - తూర్పున కూడా తప్పక ఉండాలి వాకిలి. కాపురం లేని దక్షిణ ద్వారమున్న కొట్లకు ఉత్తరంలో ద్వారం ఉంటే ఫరవలేదు లేక పోయినా యే బాధా లేదు. కాపురు చేయని పశ్చిమ ముఖద్వారమున్న కొట్లకు తూర్పుకు ద్వారం ఉండటం మంచిది - లేకున్న లేదు ఇబ్బంది. ఇంటికి తూర్పు ద్వారం లేకుంటే - పురుషుల జీవితాలకు తంటే.
- ఇంటికి ఉత్తర ద్వారం లేకుంటే - ఇంతల జీవితాలకు మంటే.
- స్థలం దిక్సూచికి వున్నప్పుడు నాలుగు దిక్కులకు పెట్టు ద్వారాలు - సాటిలేని రీతిలో కలుగు భోగభాగ్యాలు.
- వీలులేనప్పుడు శయ్యవెయ్యి తూర్పు గదిలో సుఖ నిద్ర, ఉత్సాహము కల్గు మదిలో.
- ఆగ్నేయంలో రెండవ సంతానం నిద్రించడం - ఆనందపు విందులు నెప్పుడు పొందడం.
- దక్షిణం గదిలో పడక - ఆరోగ్యానిస్తుంది వీడక.
- నైరృతి గదిలో యజమాని పడక - అభివృద్ధి దిశలకు గృహస్థుసాగించే నడక.
- పడమటి గదిలో పడక - ఒడిదుడుకులు లేని సుఖాల కూడిక.
- వాయవ్యంలో మూడవ సంతానం నిద్రించడం - వివాదాలకు తావుండక జీవించడం.
- ఉత్తరాన పిల్లల నిదుర గదులు - ఉత్తమ ప్రగతికి మూలికలు.
- ఈశాన్యం గదిలో బార్యాభర్తల పడక - నశింపజేయు వ్యాధులు కూడిక.
- తూర్పు తలాపి నిద్ర - ఆరోగ్య భద్రతకు ముద్ర.
- దక్షిణం వైపు తలవుంచి నిద్రించడం - ఆరోగ్య ధవళ పతాకాన్ని ఎగిరించడం. (ధవళ = తెల్లని, నిర్మలము).
- నిదురించునపుడు పడమటికి వుంచిన తల - ఉవ్వెత్తున చేలే పీడకలల అల.
- ఉత్తరంగా తలవుంచి నిద్రించడం - తత్తరపాటును కలిగించు వ్యాధి విషాలను చిందించడం.
- తూర్పు ముఖంగా ఆగ్నేయంలో వంట - ఇంట ఎడతెగని సుఖాల పంట.
- ఆగ్నేయంలో పొయ్యి - అమరించును శుభాల వెయ్యి.
- దక్షిణ ముఖంగా వండు వంట - దరిద్రాన్ని కొని తెచ్చుకొనే తంట.
- నైరృతి ఉపగృహంలో పొయ్యి - వీలులేనప్పుడు వెయి.
- తూర్పు, పశ్చిమ గదుల్లో వంట - పురుషుల ఆరోగ్య, యశస్సుల దహించే మంట.
- దక్షిణ, ఉత్తర గదుల్లో పొయి - సిరికి, స్త్రీ ఆరోగ్యానికి గొయ్యి.
- పశ్చిమ ముఖంగా వండే వంట - వాయవ్య గదిలో చేసుకో ఇంట.
- ఉత్తర వాయవ్యంలో పొయ్యి - కత్తెర బోనులో పెట్టిన చెయ్యి.
- ఉత్తర ముఖంగా చేయి వంట - ఉపద్రవాల ఊబి గుంట.
- ఈశాన్యంలో పొయి - ఐశ్వర్యాలను మంచు నుయ్యి.
- స్టోర్ రూమ్ ఈశాన్యం - శుభాల ప్రగతి శూన్యం.
- స్టోర్ రూమ్ నైరృతి ఉపగృహంలో - నిత్య పురోగతి ఆ యింటిలో.
- స్టోర్ రూమ్ ఆగ్నేయం వంట గదికి పశ్చిమాన - ఉత్తమ ఫలితాలు స్థిరపడును ఆ ఇంటిలోన.
- దక్షిణ పశ్చిమాల్లో స్టోర్‌రూమ్‌లు - ధన ధాన్య సమృద్ధికి నిలయాలు.
- ఉత్తరంలో స్లోర్‌రూం - వాస్తుకెప్పుడూ విరుద్ధం.
- ఇంటిలో పూజగది ఏ దిశలో వున్నా - ఎలాంటి లోటు కలుగదన్నా!
- ఈశాన్య గదిలో స్థిర నిర్మాణం - వాస్తుబల నివారణం. (స్థిర నిర్మాణం = రాయి, సిమెంటు అరుగు)
- పశ్చిమ, దక్షిణాన పూజ గదులు స్థిర నిర్మాణం - వాస్తు బలపోషణం (పోషణం = పెంచటం)
- తూర్పుముఖంగా దేవుని అర్చించు - ఆరోగ్య భాగ్యాలను ఆర్జించు.
- పశ్చిమ ముఖంగా అర్చన - శుభాలను చేర్చు నిచ్చెన.
- భువికి రవియే ఆధారం - అందుకే తూర్పు పడమర ముఖంగా పూజలకు అంత ప్రాచుర్యం.
- తూర్పున స్నానం గది - సుఖశాంతులకు విడిది.
- దక్షిణాన గొయ్యిలేని స్నానం గది - సకల శుభాల రథసారథి.
- పశ్చిమాన గొయ్యిలేని స్నానం గది - సుఖాలకు పెన్నిధి.
- ఉత్తరాన స్నానం గది - ఉత్తమ సుఖాలు కలిగిస్తుంది.
- తూర్పు ముఖంగా లెట్రిన్‌లో కూర్చోకండి - అది ఆరోగ్యానికి గండి.
- తూర్పున సెప్టిక్ ట్యాంకు - ఉన్నతికి మంచి లింకు.
- ఆగ్నేయంలో మరుగు దొడ్డి - ఆరోగ్య ధనానికి చక్రవడ్డి (శుభం)
- ఆగ్నేయంలో గొయ్యితో ఉన్న మరుగుదొడ్డి - ఆరోగ్యాన్ని చితుకగొట్టు ఇనుప కడ్డి.
- దక్షిణ ముఖంగా లెట్రిన్‌లో కూర్చొనండి - నిత్యం ఆనందంగా ఉండండి.
- సెప్టిక్ ట్యాంక్ దక్షిణం - సెప్టీలేని బ్రతుకే అనుక్షణం (సెఫ్టీ = క్షేమం)
- నైరృతిలో గొయ్యితో పాయిఖానా - వేస్తాయి ఇంటిలో రోగాలు ఠికానా.
- పడమర ముఖముంచి లెట్రిన్‌లో కూర్చోకండి - ఆరోగ్యాన్ని పాడుచేసుకోకండి.
- సెప్టిక్ ట్యాంక్ పడమట వుంచడం - ఇంటిలోనికి రోగాలను రప్పించడం.
- వాయవ్యంలో పాయిఖానా - సుఖాలకు పరచిన జంబుఖానా.
- యవ్యంలో గొయ్యితో మరుగుదొడ్డి - వాడులాటకు చిచ్చుబుడ్డి.
- ఉత్తరంలో సెఫ్టిక్ ట్యాంక్ - ఉత్తమ ఫలితాలకు ఫస్ట్ ర్యాంక్.
- ఉత్తర ముఖంగా లెట్రిన్‌లో కూర్చొనండి - ఉత్తమ ఆరోగ్యాన్ని కూర్చుకొనండి.
- ఈశాన్యంలో మరుగుదొడ్డి - అంతులేని అరిష్టాల మడ్డి. (మడ్డి = మలినం)
- ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం - అనారోగ్యానికి సోపానం.
- తూర్పు ఉత్తర సరిహద్దులనంటి నిర్మించే మరుగుదొడ్లు - వంటిమీదకెగజిమ్మే చిచ్చుబుడ్లు.
- తూర్పు గోడకు వుండే అటక - భయపెట్టే పటాక.
- దక్షిణం గోడకు ఉండే అటక - స్త్రీకి బంగారు పటకా (పటకా = వడ్డాణం).
- పడమటి గోడకు ఉండే అటక - శుభఫలితాలకు పీఠిక.
- ఉత్తరం గోడకు ఉండే అటక - ఉపద్రవాల పుట్టుక.
- దక్షిణ, పశ్చిమాలలో అటకలు వున్నప్పుడు - తూర్పు, ఉత్తరాలలో అటకలున్నా తప్పులేదప్పుడు.
- తూర్పు నుండి పడమటికి తాపలు కట్టుకో - కీర్తి కిరీటం పెట్టుకో.
- ఉత్తరం నుండి దక్షిణానికి మెట్లు కట్టుకో - ప్రీతిగా ధనాన్ని ఆకట్టుకో.
- ఈశాన్య, నైరృతి గదుల్లో మెట్లు నిర్మించడం - సుఖాన ఉన్న ప్రాణాన్ని దు:ఖాలపాలు చేయుకోవడం.
- దక్షిణం, పశ్చిమగదుల్లో మెట్ల నిర్మాణం - శుభాల తోరణం.
- ఇంటి లోపల ఈశాన్యంలో మెట్లు నిర్మించడం - ఈశాన్యం తెగి బరువైనందుకు పురోగతి స్తంభించడం.
- ఇంటిలోపల నైరృతిలో మెట్లు నిర్మించకు - కోరికోరి కష్టాలు తెచ్చుకోకు.
- ఇంటి వెలుపల దక్షిణ నైరృతి మెట్ల ల్యాండింగ్ క్రింద గదుల నిర్మాణం - నైరృతి పెరిగి పల్లమై స్త్రీల ప్రగతికి పడుతుంది గ్రహణం.
- ఇంటి వెలుపల పశ్చిమ నైరృతి మెట్ల ల్యాండింగ్ క్రింద గదులు వేయడం - పల్లమై పెరిగిన నైరృతితో పురుషుని నిర్వీర్యం చేయడం.
- ఇంటి బయట ఉత్తర వాయవ్యంలో మెట్ల ల్యాండింగ్ క్రింద గదులు వేసినప్పుడు - ఈశాన్యంలో ఇంటి పారుకు పిల్లరు వేయాలి అప్పుడు.
- ఇంటి బయట తూర్పు ఆగ్నేయంలో మెట్ల ల్యాండింగ్ క్రింద గది వేసిన - ఇంటి పారుకు పిల్లరు వేయాలి ఈశాన్యంలోన.
- తూర్పు వాలు వరండా - పురుషుల ఆరోగ్యానికి అండ.
- దక్షిణం వాలు వరండా - సిరికి, స్త్రీకి గుండెల మీద బండ.
- పశ్చిమం వాలు వరండా - పురుషుల ఆరోగ్యానికి ఎర్రజెండా (అపాయం)
- ఉత్తరం వాలు వరండా - స్త్రీల సుఖాలకు, ఐశ్వర్యాలకు గెలుపుదండ.
- తూర్పు వరండాలో ఆగ్నేయాన గది - సుఖశాంతులను ఇచ్చు నిధి.
- దక్షిణ వరండాలో ఆగ్నేయాన గది - స్త్రీలను బాధల పాలు చేయు ముళ్ళ గుది.
- దక్షిణ వరండాలో నైరృతి అర - స్త్రీలకు ప్రశాంతిని చేకూర్చే సితార.
- పశ్చిమ వరండాలో పశ్చిమ నైరృతి గది - పురుషులకు సుఖాలనిచ్చే జీవనది.
- పశ్చిమ వరండాలో వాయవ్యం అర - పురుషుని అభివృద్దిని చించి వేయుకత్తెర.
- ఉత్తర వరండాలో వాయవ్యాన గది - అతివల ఆర్ధిక శుభాలకు ప్రోది. (ప్రోది = పెంపు)
- ఉత్తర వరండాలో ఈశాన్యన గది - ఉవిదల శుభలాభాలను చేస్తుంది బూది. (బూది = బూడిద).
- తూర్పు వరండాలో ఈశాన్యన గది - పురుష పురోగతిని క్రుంగదీయు గుది (గుది = పశువుల మెడలో వేసేబండకొయ్య).
- ఇంటిపైన తూర్పున కట్టిన మేడ - పురుషులకు పీడ.
- ఆగ్నేయంలో మేడ ఇంటిపైన - అది దించుకోలేని కుంపటి తలపైన.
- దక్షిణ భాగంలో మీది సాధం - ధనాభివృద్ధికి లక్ష్మీపాదం.
- ఇంటిపైన నైరృతిలో సౌధం - గృహస్తునకు కలిగించు ప్రమోదం.
- పశ్చిమంలో పైనున్న మేడ - పురుషుల పురోభివృద్ధికి జాడ.
- ఇంటిపైన మేడ వాయువ్యంలో - అస్థిరత సుస్థిరం ఆ గృహంలో.
- ఉత్తరాన పై మేడ - ధనాభివృద్ధికి అడ్డుగోడ.
- ఈశాన్యంలో ఇంటిపైన మేడ - గృహస్థులపై కూలిన రాతి గోడ.
- ఇంటిపై తూర్పున నీటితొట్టి నిర్మాణం - పురుషుల పలుకుడిని గ్రుచ్చుకొను పదును బాణం.
- వీలులేనప్పుడు ఇంటిపైన ఆగ్నేయంలో నీటి తొట్టిని వుంచు - కాని నైరృతిలో దానిని మంచిన కట్టడం నిర్మించు.
- దక్షిణంలో ఇంటిపైన నీటి ట్యాంక్ కట్టించుకో - భోగభాగ్యాలను ఇంటిలో పెంచుకో.
- ఇంటిపై నైరుతిలో నీటి ట్యాంక్ - రెట్టింపు సిరులకు బ్యాంక్.
- పడమటి దిక్కున ఇంటిపై నీటి ట్యాంక్ నిర్మించుకో - ఆరోగ్యాన్ని ఇంటిలోనికి రప్పించుకో.
- అనుకూలం లేనప్పుడే ఇంటిపై వాయవ్యలో నీటితొట్టిని పెట్టుకో - కానీ ఆగ్నేయంలో, నైరృతిలో, ఒకదాన్ని మించి ఒకటి ఎత్తైన కట్టడాలు కట్టుకో.
- ఉత్తరంలో ఇంటిపైన నీటి ట్యాంక్ కట్టడం - ఉన్న ధనాన్ని బయటకు నెట్టడం.
- 183. ఇంటిపైన ఈశాన్యంలో నీటిట్యాంక్ - ఇంటిలోన ఖాళీ ట్రంక్.
- తూర్పు సరిహద్దులో చేసిన నిర్మాణం - కూర్చుకొన్న శుభాల నిర్మూలనం.
- దక్షిణం రోడ్డు ఎత్తు వున్నప్పుడు సరిహద్దుపై చేసిన నిర్మాణం - భోగభాగ్యాలిచ్చు రవి కిరణం.
- పశ్చిమం రోడ్డు ఎత్తు ఉన్నప్పుడు సరిహద్దు మీద నిర్మాణం - గృహస్తు మెడలో మణిహారం.
- ఉత్తర సరిహద్దు మీద చేసిన నిర్మాణం - సిరికీ, స్త్రీ పురోగతికీ విషబాణం.
- ఆగ్నేయంలో తూర్పు సరిమద్దును, ఇంటిని అంటని ఉపగృహం - అతివలకు అనంత శుభాల అనుగ్రహం.
- ఆగ్నేయంలో తూర్పు సరిహద్దును, తాకిన ఉపగృహం - ఉవిదలకు అశుభాల ఆగ్రహం.
- నైరృతిలో ఇంటినంటని ఉపగృహం - నిత్య శుభాల సంగ్రహం. (సంగ్రహం = కూడబెట్టు).
- వాయువ్యంలో ఉత్తర సరిహద్దుపై ఉపగృహం - శుభాలకు నిగ్రంహం. (నిగ్రహం =
- అడ్డగించడం). వాయువ్యంలో ఉత్తర ప్రహరిని, ఇంటిని అంటని ఉపగృహం దివ్య సుఖాలను ఇచ్చును అహరహం. (అహరహం = ఆనుదినం)
- ఈశాన్యంలో ఉపగృహం - నాశనం చేయు మద్యపాన దాహం.
- తూర్పు భారం - ఐశ్వర్య, కీర్తులు దూరం.
- దక్షిణాన భారం - ధన, ధైర్యాలకు వరం.
- పశ్చిమంలో భారం - నిరంతర సుఖాల తీరం.
- ఉత్తర దిశలో బరువు - విత్తం, చిత్తశాంతి కరువు.
- ఈశాన్యంలో బరువు - ఇక వుండదు సుఖమైన బ్రతుకు దెరువు.
- గదికి తూర్పున బీరువావుంచకు - వచ్చే నీ రాబడిని త్రుంచకు.
- గదికి ఆగ్నేయంలో బీరువా - ధనాన్ని తన్నుకుపోయే బోరువ. (బోరువ = పెద్దపెద్ద)
- గదికి దక్షిణాన బీరువా - ధనం రావడానికి వరవ. (వరవ = తూము)
- నైరృతిలో ఉత్తరాభిముఖంగా వుంచిన బీరువా - పెరిగిపోవు సిరుల కరువ. (కరువ = కొండ) గదికి నైరృతిలో తూర్పు ముఖంగా వుంచిన డబ్బు మందసం సిరులకు నిరంతరావాసం (మందసం = పెట్టె)
- గదికి పశ్చిమంలో దూర్పు ముఖంగా వుంచిన బీరువా - సిరులకు చొరవ. (చొరవ = ప్రవేశం)
- గదికి ఉత్తర వాయవ్యంలో బీరువా - సిరి చలనానికి త్రోవ.
- గదికి ఉత్తరాన వుంచిన డబ్బు మందసం - ఎప్పుడూ తారాడవలసిందే డబ్బుకోసం.
- గదికి ఈశాన్యంలో బీరువా - దరిద్రానికి చేరువ.
- తూర్పున పల్లపు అరుగులు - జీవిత నౌకను సుఖశాంతులు తీరానికి చేర్చు సరంగులు. (సరంగులు = నావికులు) తూర్పు అరుగులు మెర - పురుషులకు కొరడా చురక.
- ఆగ్నేయంలో నైరృతికన్నా ఎత్తైన అరుగు - ఇంటిలోని వారికి ఆరోగ్యం కనుమరుగు.
- దక్షిణాన పల్లపు అరుగులు - ధనోన్నతికి మెరుగులు.
- దక్షిణాన పల్లపు అరుగులు - ధనానికి తీరని తరుగులు.
- నైరృతిలో ఎత్తైన అరుగులు - ఐశ్వర్యాన్ని పెంచు బంగారు మురుగులు. (మురుగులు = చేతి అభరణాలు)
- పశ్చిమాన ఎత్తైన అరుగులు - అభివృద్ధి దిశకు పరుగులు.
- పల్లపు అరుగులు పశ్చిమం వైపు - యజమాని నడకలు పతనం వైపు.
- పశ్చిమ వాయవ్యంలో పల్లపు అరుగులు - ఐశ్వర్యానికి విరుగులు.
- ఉత్తరాన ఎత్తైన ఆరుగులు - స్రీల శుభాలను పిండిచేయు తిరుగళ్ళు. (తిరుగలి = విసురురాయి).
- ఉత్తరాన పల్లపు అరుగులు - సుఖాలకు పట్టు చెరుగులు.
- ఉత్తర ఈశాన్యంలో ఎత్తైన అరుగులు - స్త్రీల శుభాలకు చిరుగులు.
- తూర్పు ఈశాన్యంలో ఎత్తైన అరుగులు - పురుషుల ఘనతను క్రుళ్ళజేయు పురుగులు.
- తూర్పు పల్లంలో తులసి మొక్క - స్త్రీల ఆరోగ్యమునకు సుఖమైన పక్క.
- దక్షిణాన తులసికోట - స్త్రీల ఆరోగ్యానికి కంచుకోట.
- పడమట తులసికోట కట్టండి - ఆరోగ్యానికి పట్టం కట్టండి.
- ఉత్తరాన ఎత్తులో తులసికోట - ఉత్తమ ఫలితాలివ్వడం వుత్తమాట.
- ఈశాన్యంలో తులసికోట - ఇంతులకు ఆరోగ్యమివ్వదు యే పూట.
- తూర్పున చెట్లను పెంచకు - వాస్తు బలాన్ని త్రుంచి కష్టపడకు.
- తూర్పు ఆగ్నేయంలో పూల మొక్కలను పెంచు - శుభఫలితాలను అనుభవించు.
- దక్షిణ ఆగ్నేయంలో చెట్లను పెంచు - అవి శుభాలను నీఇంటవుంచు.
- దక్షిణ దిశలో వృక్షపోషణ - ఇంటికి అన్ని విధాల రక్షణ.
- దక్షిణ నైరృతిలో చెట్లపెంపు - స్త్రీలను ఆరోగ్యంతో నింపు.
- పశ్చిమ నైరృతిలో చెట్లను పెంచడం - పురుషులకు ఆరోగ్యం కలిగించడం.
- పశ్చిమంలో చెట్లను పెంచడం - ఆరోగ్యాన్ని పోషించడం.
- పశ్చిమ వాయువ్యంలో పెంచుకొను చెట్లు - ఉన్నతికి, ఆరోగ్యానికి బంగారు మెట్లు.
- ఉత్తర వాయవ్యంలో పూల మొక్కలు - అభివృద్దిని మోసుకొచ్చు రెక్కలు.
- ఉత్తరాన వృక్షపోషణం - విత్తము క్షీణం అనుక్షణం (విత్తం = ధనం).
- ఉత్తర ఈశాన్యంలో చెట్లు - స్త్రీల ఆరోగ్యానికి పాము కాట్లు.
- తూర్పు ఈశాన్యంలో చెట్లు - పురుషుల ఆరోగ్యానికి విషపు బొట్లు.
- తూర్పున పల్లం - సుఖశాంతులకు అరచేతనున్న తరగని బెల్లం.
- ఈశాన్యం కన్నా ఆగ్నేయం పల్లం - ఆరోగ్యానికి కళ్ళెం.
- దక్షిణం పల్లం - అదృష్టాన్ని అడ్డుకొనే గొళ్ళెం.
- నైరృతి పల్లం - మరణానికి మూలం.
- పశ్చిమం పల్లం - సుఖాలను పొడుచు శూలం.
- ఈశాన్యం కన్నా వాయవ్యం పల్లం - వ్యవహారంలో చెల్లం.
- ఉత్తరం పల్లం - బంగారు పళ్ళెం.
- ఈశాన్యం పల్లం - ఐశ్వర్య, ఆరోగ్యాలకు హారతిపళ్ళెం.
- నైరృతికన్నా ఆగ్నేయం, వాయవ్యం, ఈశాన్యం పల్లం - సంతృప్తినిస్తుంది ఉల్లం. (ఉల్లం = మనస్సు)
- తూర్పు మెరక - ఆరోగ్య, ధనాలను గ్రుచ్చు గొరక. (గొరక = ఇనుపబాణం).
- దక్షిణంలో మెరక - పాడిపంటలిచ్చు ఏరువాక.
- నైరృతి ఉన్నతి - నరులకు అభ్యున్నతి.
- పశ్చిమం ఎత్తు - గృహస్థుల పాలిటి బంగారు సొత్తు.
- ఆగ్నేయం కన్నా వాయవ్యం ఎత్తు - గృహస్తులను దిగువకు ఒత్తు. (ఒత్తు = అదుము)
- నైరృతికన్నా ఆగ్నేయ, వాయవ్య, ఈశాన్యాలు ఎత్తు - చేస్తాయి యజమానిని తొత్తు. (తొత్తు = బానిస).
- ఉత్తరం మెరక - దరిద్రానికి పడక.
- 254. ఈశాన్యం మిఱ్ఱు - ఐశ్వర్యానికి కొఱ్ఱు. (కొఱ్ఱు = శూలం)
- వాన నీరు, వాడుకనీరు తూర్పు ఈశాన్యానికి పారనిమ్ము - నిరంతరంగా శుభాలు రానిమ్ము.
- ఈశాన్యంగా జల ప్రవాహం - సకల సంపదలకు ఆధారం.
- ఇంటిలోని నీరు తూర్పున పారించు - నీ ఇంటిల్లిపాదని శుభాలు వరించు.
- ఇంటిలోని నీరు దక్షిణానికి పోవడం - ఇంతులు అనారోగ్యవతులు కావడం.
- ఇంటిలోని నీరు దక్షిణ నైరృతి నుండి వెళ్ళడం - స్త్రీల ఆరోగ్యం చెడడం.
- వాన నీరు వాడుక నీరు పశ్చిమ నైరృతి నుండి పోవడం - పురుషులు అనారోగ్యానికి గురికావడం.
- నైరృతిలో జల ప్రవాహం -వికృత ఫలితాల నివహం. (నివహం = గుంపు) వర్షపు నీరు, వాడుక నీరు పడమటికి పారడం - పురుషుని ఆరోగ్యం దిగజారడం.
- ఇంటిలోను నీరు ఉత్తరానికి పారడం - ఇంతులకు ఆరోగ్యం చేకూరడం. ఇంటిలోని నీరు, ఆవరణంలోని నీరు ఉత్తర ఈశాన్యానికి పారనిమ్ము - కలకంఠిదరికి ఆరోగ్యం చేరనిమ్ము (కలకంఠి = స్త్రీ)
- తూర్పు దిశలో తూము - సుఖశాంతులకు నోము.
- తూర్పు ఆగ్నేయం తూము - పిల్లలకు భయం కలిగించే మోము.
- దక్షిణం వైపు తూము వుంచడం - సుకశాంతులను త్రుంచడం.
- దక్షిణ నైరృతి తూము - స్త్రీల ఆరోగ్యానికి కత్తిమీద సాము.
- పశ్చిమ నైరృతి తూము - పురుషుల ప్రతిభకు ధూము.
- పశ్చిమ దిశలో తూము - పలు సుఖాలను కాటు వేయు పాము.
- ఉత్తర వాయువ్యంలో తూము - నిత్యం జగడాల గీము. (గీము = ఇల్లు)
- ఉత్తర దిశలో తూము - ఉత్తమ దశకు మూలము.
- ఉత్తర ఈశాన్యంలో తూము వుంచడం - సిరులకు నివాసం కల్పించడం.
- తూర్పు ఈశాన్యంలో తూము - పురుషులు ఆరోగ్య పంటకు నీరు తోడు ఏతాము.
- తూర్పు గోడకన్నా పడమటి గోడ ఎత్తు - తరుగులేని సౌభాగ్యాలను వీడని పొత్తు.
- పడమటి గోడకన్నా తూర్పు గోడ ఎత్తు - అనారోగ్యానికి పొత్తు.
- దక్షిణం గోడకన్నా ఉత్తరం గోడ ఎత్తు - ఐశ్వర్యానికి విపత్తు.
- ఉత్తరం గోడకన్నా దక్షిణం గోడ ఎత్తు - అష్టైశ్వర్యాలు నీ సొత్తు.
- తూర్పు గోడ వక్రం - పురుషులకు గోడు కలిగించే చక్రం (వక్రం = వంకర).
- దక్షిణం గోడ వక్రం - స్రీల ఆరోగ్యాన్ని కబళించే నక్రం (నక్రం = మొసలి).
- పడమటి గోడ వక్రం - అరిష్టాల క్రమం. (క్రమం = వరుస)
- ఉత్తరం గోడ వక్రం - స్త్రీకి, సిరికి హానికరం.
- తూర్పు గేటు - ఇంటిలోనికి రానివ్వదు యే లోటు.
- తూర్పు ఆగ్నేయం గేటు - శుభాలకు బల్లెం పోటు.
- దక్షిణ ఆగ్నేయం గేటు - శుభాలకు రక్షణయిచ్చే వల్లెవాటు.
- దక్షిణాన గేటు వుంచడం - శుభాలకు రాచబాట నిర్మించడం.
- దక్షిణ నైరృతి గేటు - కాలనాగు కాటు.
- పశ్చిమ నైరృతిలో గేటు వుంచడం - అకాల మరణాన్ని ఆహ్వానించడం.
- పడమర గేటు - పురుషుల కీర్తికి సీటు.
- పశ్చిమ వాయవ్యం గేటు - పలు శుభాలకు చోటు.
- ఉత్తర వాయవ్యం గేటు - ఇంట్లో వారికి నిత్యం చేటు.
- ఉత్తరంలో గేటు - సంతోష తంత్రులు మీటు.
- ఉత్తర ఈశాన్యంలో గేటు - ఉత్తమ శుభాలకు తోడ్పాటు.
- తూర్పు ఈశాన్యంలో గేటు వుంచడం - సుఖశాంతులకు బాటను వేయడం.
- ఆగ్నేయం బ్లాకునకుతూర్పుతో పాటు వుండాలి దక్షిణంలో గేటు తప్పక - అప్పుడే గృహంలో స్థిరపడుతుంది శుభ వీచిక.
- నైరృతి బ్లాకునకు గేటు పరిసరాలను బట్టి దక్షిణం లేదా పశ్చిమంలో - అప్పుడే అది సుఖాలకు ఆటపట్టు.
- వాయవ్యం బ్లాకునకు ఉత్తరంతో పాటు గేటు పశ్చిమంలో - పురోగతికి ఆగ్రాసనం ఆ గృహంలో.
- ఈశాన్యం బ్లాకులో తూర్పు, ఉత్తరాలలో గేట్లు, అవి అభివృద్ధికి మెట్లు.
- తూర్పు వైపు గొయ్యితో గోబర్‌గ్యాస్ ప్లాంట్ - ఇంట భోగభాగ్యాల గ్రాంట్
- దక్షిణాన గొయ్యితో గోబర్‌గ్యాస్ ప్లాంట్ - ఇంట్లో శుభాలకు డిస్కౌంట్.
- పడమటి గొయ్యితో గోబర్‌గ్యాస్ ప్లాంట్ - ఇంట్లో అశుభాల అకౌంట్.
- ఉత్తరాన గొయ్యితో గోబర్ గ్యాస్ ప్లాంట్ - ఇంట నిత్యం శుభాల ప్రజంట్.
- ఆగ్నేయ ద్విశాల నిర్మాణం - చోరాగ్నులకు ప్రేరణం.
- నైరుతి ద్విశాల నిర్మాణం - సౌఖ్యానికి చంద్రశాలావరణం.
- వాయువ్య ద్విశాల నిర్మాణం - వ్యవహారాల్లో విజయాలు శూన్యం.
- ఈశాన్య ద్విశాల నిర్మాణం - అరిష్టాలకు స్థానం.
- త్రిశాలకు తూర్పున ఖాళీస్థలం - పురుషుల పలుకుబడికి బలం.
- త్రిశాలకు దక్షిణాన ఖాళీస్థలం - స్త్రీల సుఖాలను నరకు కరవాలం.
- త్రిశాలకు పడమట బయలు - పురుషుల ఆరోగ్యానికి తప్పును హొయలు. (హొయలు=విలాసం).
- త్రిశాలకు ఉత్తరాన ఖాళీజాగా - స్త్రీల సౌభాగ్యాలను పెంచును బాగా.
- తూర్పు ఆగ్నేయం పెంపు - అనర్థాలను నింపు.
- దక్షిణ ఆగ్నేయం కోణంగ పెంపు - అనేక తగవులతో తలవంపు.
- రోడ్డు లేనప్పుడు దక్షిణ ఆగ్నేయం స్థలం మూలమట్టంతో పెరుగుదల ఆ ఇంటివారి కీర్తికి మెరుగుదల.
- దక్షిణ నైరుతి పెరుగుదల - తరుణుల శుభాల అరుగుదల. (తరుణులు=స్త్రీలు)
- పశ్చిమ నైరుతి పెంచడం - పురుషుని జీవితాన్ని త్రుంచడం.
- పశ్చిమ వాయువ్యం కోణంగా పెంపు - చపలత్వాన్ని నింపు.
- రోడ్డు లేనప్పుడు పశ్చిమ వాయువ్య స్థలం మూలమట్టంగా పెరుగుదల - శుభఫలితాలకు ఎదుగుదల.
- ఉత్తర వాయువ్యం పెరుగుదల - వంశాభివృద్ధికి తరుగుదల.
- ఉత్తర ఈశాన్యం పెంపు - ఐశ్వర్యాన్ని ఇంట నింపు.
- తూర్పు ఈశాన్యం పెంచు - పురుషుల ఆరోగ్యభాగ్యాలను ప్రతిష్ఠించు.
- ఆగేయం తెంపు - ఉండబోదు తలవంపు.
- నైరుతి తెంపు - రాబోదు ముంపు.
- వాయువ్యం తెంపు - మైత్రికి ఇంపు.
- ఈశాన్యస్థలం తెంచుకోకు - వంశాభివృద్ధిని త్రుంచుకోకు.
- అనవసరంగా స్థలం తెంచుకోకు - అనుమానాలను పెంచుకోకు.
- తూర్పు కప్పు - మగసంతతికి ముప్పు.
- తూర్పు ఆగ్నేయం హద్దుపై కప్పు వేయుట - సంతతి సుఖశాంతులను నిప్పులలో త్రోయుట.
- రోడ్డు ఎత్తు ఉన్నప్పుడు దక్షిణం కప్పు - తరుణుల సౌభాగ్యానికి మెప్పు.
- రోడ్డు ఎత్తు ఉన్నప్పుడు నైరుతి, కప్పు వేసుకో - సిరులను కుప్పపోసుకో!
- రోడ్డు ఎత్తు ఉన్నప్పుడు పశ్చిమం కప్పు - గృహస్థు ప్రతిష్ఠను చాటిచెప్పు.
- ఉత్తర వాయవ్యం కప్పు - స్థిరత్వానికి త్రుప్పు. (త్రుప్పు = చిలుము).
- ఉత్తరం కప్పు - విత్తమునకు నిప్పు.
- ఈశాన్యం కప్పు వేసికొనడం - యమపాశాన్ని గొంతుకు బిగించుకొనడం.