శ్రీ వేంకటేశ్వర లీలలు భాగము 1 - నైమిశారణ్య ప్రాధాన్యము

P Madhav Kumar


🌻 *నైమిశారణ్య ప్రాధాన్యము* 🌻

🍃🌹శ్రీలతో తులతూగుచూ పాడిపంటలు పుష్కలముగా నుండి సర్వప్రజలు నీతిమంతులై విలసిల్లిన దేశము భారతదేశము. 


🍃🌹అందమైన హిమాలయములు, మహా శిల్పుల పనితనమునకు మచ్చుతునకలుగానున్న దేవాలయములు మున్నగు వానితో దేశము శోభాయమానముగానుండెడిది. 


🍃🌹ఎచ్చట జూచినను దైవపూజలే యెచ్చట వినినను పుణ్య కథా శ్రవణములే! ఎచ్చట మెట్టినను ఆధ్యాత్మిక చింతనలే! అట్టి పవిత్ర భారత దేశమున అనఱ్యములు ప్రజలకు విజ్ఞాన విషయములందించుటలో విజ్ఞాన విశేషములను శోధించి, నూతన విషయములు కనుగొని, ప్రజల ఉపయోగార్థమందించెడివారు. 


🍃🌹భయంకరారణ్య సీమలందు మోక్షకాముకులై అనేక మంది మునీశ్వరులు తపస్సు చేసుకొనుచెండెడివారు. చక్రవర్తులు, రాజులు, పరిపాలనను సరిగా చేయుచు మధ్యమధ్య ఆయా మునీశ్వరులను సందర్శించి వారు ప్రబోధములు వినిచు ఉత్తేజితులయ్యెడివారు. 


🍃🌹నైమిశారణ్యము భారతదేశమున గల అరణ్యములలో గొప్పదై విలసిల్లినది. సూతులవారు శౌనకాది మహర్షుల కనేక పౌరాణిక కథలను, భగవన్మాహాత్మ్యములను ఆ యరణ్యమునందే చెప్పెడివారు. 


🍃🌹సర్వవేద పురాణ విజ్ఞాన నిధియైన సూతులవారు చెప్పు విషయములు ఆసక్తికరములై మోక్షదాయకములై యుండెడివి. ఆయన విప్పని ధర్మసందేహములు లేవు. చెప్పని పురాణ రహస్యములు లేవు. 


🍃🌹అనేక ధార్మికాంశములతో ఆయన శౌనకాదులకు సర్వ పురాణములు వినిపించుచుండిరి.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat