అమృత బిందువులు - 25 సామాజిక తత్వం - 1

P Madhav Kumar


*సామాజిక తత్వం - 1*

గంధపుచెట్టు చుట్టూ ఉన్న తుమ్మచెట్లు కూడా గంధపు వాసనే వేస్తాయి. 


విందులు వినోదాలు చేసేముందు పేదవారికి పట్టెడన్నం పెట్టాలని యోచించు.


జరగని ఆశలకు ఎదురు చూడకు. వెన్ను చూపకు.


రధసారథి సరిలేక పోతే రధం దారితప్పినట్లు , యజమాని సరిలేకపోతే సంసార రధం దారి తప్పగలదు.


ఆలోచనలు మంచిదైతే అభివృద్ధి చెందగలవు. చెడ్డదైతే పతనం కాగలవు.


మంచి వారితో స్నేహము పరిమళించగలదు. చెడ్డవారితో స్నేహము వికటించ గలదు.


అవమానించడము అవివేకుల అంతులేని ఆశ , నిరాశ చెంది భరించడము వివేకుల కర్తవ్యము కాగలదు.


సాధనతో మనస్సును పరిమళించే మల్లెపూల వనములా తీర్చిదిద్దు కోవచ్చును.


పరోపకారులు తియ్యని ఫలాలవంటి వారు. ఫలాలు తింటే ఎంత రుచికరమో పరోపకారుల సేవలు కూడా అంతే రుచి నివ్వగలవు.


వృక్షము పక్షి గూటికి రక్షణ యజమాని కుటుంబానికి రక్షణ. 


సత్యపాలన వలన ధర్మము , నిరంతర అధ్యయనమువలన విద్య , శుచిత్వం వలన

రూపం. మంచి నడవడిక వలన జాతి రక్షింప బడతాయి.


దుర్వినియోగం చేస్తే హక్కులన్నీ కోల్పోతాం.


అనుకున్నది సాధించడంలోనే ఆనందం ఉంది.


ప్రతి శక్తి వంతుడుకి ఒక బలహీనత వుంటుంది.


ఆకలి , దరిద్రము మనిషిని శత్రువుల బానిస గావించును.


అంతరాత్మ అభ్యంతరంచేసే ఏ పనిని మనం చేయకూడదు.


మాట్లాడడంలో విచక్షణ పాటించడం వాగ్ధాటికన్నా ముఖ్యమైనది. 


జీవితానికి గొప్ప అర్థం భూతదయను కలిగి వుండుటయే.


అబద్దపు సాక్ష్యము చెప్పుట , చేసిన మేలు మరచుట వలన మనిషి పతన మవుతాడు.


బాధ్యత లేని హక్కులుండవు , చట్టానికి లోబడకపోతే స్వేచ్ఛ వుండదు.


మనిషి గొప్పతనం అతని దుస్తులతో కాక అతని నడవడితో తెలుస్తుంది.


ఎవరికైనా సేవ చేస్తున్నప్పుడు అతని లోపాలను చూసి అసహ్యించు కోరాదు.


కాలం విలువైంది. రేపు అనుదానికి రూపులేదు. మంచిపనులు వాయిదా వేయరాదని తెలుసుకో.


త్రికరణశుద్ధిగ జేసిన పనులను దేవుడు మెచ్చును. లోకం మెచ్చును. అంతరాత్మయు మెచ్చును.


మనిషి ఔన్నత్యాన్ని తెలియజేసేవి సభ్యత మరియు సంస్కృతులే.


సాధనమున పనులు సమకూరు ధరలోన.


త్రికరణశుద్ధిగా ఇతరులకు ఉపయోగపడటం త్యాగులకు మాత్రమే సాధ్యమగును.


శాంతము సముద్రముకన్నా గొప్పది.


అగ్రకులజుడైన , హీనకులజుడైన , నిక్కమెరిగినవాడే ఘనుడు.


పట్టుదల , ఏకాగ్రత , బుద్ధిబలం (ప్లానింగ్) , దక్షత (సమర్థత) - ఈ నాలుగు వున్నవారినే విజయం వరిస్తుంది.


కలసివుంటే కలదు సుఖం - దురాశ దుఃఖానికి చేటు. 


పరోపకారానికి మించిన పుణ్యము లేదు.


అహింసయే పరమ ధర్మము. అదియే పరమాత్మ తత్వం.


ఉపాధ్యాయులు విద్య అనే గృహానికి మూల స్తంభల్లాంటి వారు. ఆ గృహములో జ్ఞానరక్షణ పొందే వారు విద్యార్థులు.


మహాత్ముల సందేశములలో విలువలతో కూడిన అంశాలుంటాయి. ఆ అంశాలే నేటి సామాజిక ప్రగతికి వెలుగు మార్గాలు కాగలవు.


కొందరికి పోరాటమే ఊపిరి. పోరాటములోనే జీవించెదరు. పోరాటంలోనే మరణించగలరు. పోరాటమే తమ జీవిత పరమావధి కాగలదు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat