శ్రీ వేంకటేశ్వర లీలలు భాగము 25 - పద్మావతి లభించుట

P Madhav Kumar


🌻 *పద్మావతి లభించుట* 🌻

🍃🌹ఆకాశరాజు యజ్ఞము చేసే నేలను బంగారు నాలితో దున్నసాగాడు. దున్నుతుండగా నాగలి ఆగి క్రింద యేదో తగినట్లయినది. తీరా నేలలో చూస్తే ఒక పెట్టె కనబడింది. ఆ పెట్టెలో ఒక సహస్రకమల పుష్పమున్నూ, ఆ పుష్పము మధ్య అందాల పాపయు కనబడినది.


🍃🌹ఇంతలో ఆకాశవాణి ‘ఓ ఆకాశరాజా! నీవు ధన్యుడవు. నీకు పూర్వజన్మాంతర సుకృతము కలదు, కనుకనే ఈ బిడ్డ నీకు దొరికినది. ఈమెను నీవు పెంచుకొనవలసియున్నది. 


🍃🌹నీ వంశము పునీతమగుటకు ఈమెను పెంచుకొనడము కారణమవుతుంది’ అని యన్నది ఆకాశరాజుకు అపరిమితమయిన ఆనందము కలిగినంది. నేటికి కదా! నా జన్మ, నా వంశము సార్ధకమయినవని అనుకున్నాడు. 


🍃🌹బుగ్గ పై చిరునవ్వు వికసించే ఆ పసిపాపను యెత్తుకొని తనివితీరా ముద్దాడినాడు. ఆ బిడ్డను ధరణిదేవి చేతికిచ్చి విషయము తెలిపినాడు. ఆమె ఆ పాప నెత్తుకొని అవ్యక్తానందము ననుభవించినది. 


🍃🌹ధరణీదేవి ఆ బిడ్డను తన ప్రాణముగా భావించుకొని పెంచసాగినది. సద్ర్బాహ్మణులులను రావించి, వారిని గౌరవించి, బిడ్డకు నామకరణ మహోత్సవ ముహూర్తము పెట్టుడనగా వారు ముహూర్తము పెట్టిరి. 


🍃🌹ఆ ముహూర్తమున సహస్ర పత్రకమలములో లభ్యమయిన కారణాన ఆ చిన్నారి పాపకు పద్మావతి అని పేరు పెట్టినది. లక్ష్మీదేవియే తమ యింట వెలసినట్లుగా భావించి ఆకాశరాజు, ధరణీదేవి ఆనందించుచుండిరి. 


🍃🌹ఆ పాప బోసి నవ్వులతో వారి హృదయానంద నందనవనములో పువ్వులా అల్లారు ముద్దుగా పెరగసాగింది.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat