గరుడ పురాణము*🌺 *అధ్యాయం -3* *గరుడునికి పురాణసంహిత వరదానం* 🍂

P Madhav Kumar


గరుడునికి పురాణసంహిత వరదానం

శౌనకాది మహామునులు ఈ గరుడ మహాపురాణమును వినాలని వుందని అత్యంత ఉత్సుకతతో వేడుకోగా సూతమహర్షి ఇలా అన్నాడు. బదరికాశ్రమంలో ఒక నాడు వ్యాసమునీంద్రులు పరమాత్మ ధ్యానంలో వుండగా గమనించి నేనక్కడే ఆయన సమీపంలోనే నేలపై కూర్చుండి పోయాను. ఆయన కనులు తెరువగానే ప్రణామం చేసి ఇలా ప్రార్ధించాను.


🌺గురుదేవా! మీరు భగవానుడునైన శ్రీహరి స్వరూపాన్ని జగత్ సృష్ట్యాదులనీ నాకు బోధించండి. మీరింతసేపూ ఆ పరమపురుషుని ధ్యానంలోనే ఆయనను దర్శించగలిగారనీ కూడ నాకు అవగతమైనది. అన్నాను. ఈలోగా మిగతా శిష్యులు కొందరు. మునీంద్రులు అక్కడకు చేరారు. వ్యాసమహర్షి మాతో నాయనలారా నాకు ధ్యానంలో గోచరించేది శ్రీమహావిష్ణువే. ఆయన గూర్చి చెప్పగలవాడు చతురాననుడు బ్రహ్మదేవుడే. ఆయన మాకు అనుగ్రహించిన గరుడమహాపురాణాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను.


🌺ఒకమారు నారదుడు, దక్షప్రజాపతి, భృగుమహర్షి, నేనూ సత్యలోకానికి వెళ్ళాము.ఆయన మాకు అనుగ్రహించిన గరుడమహాపురాణాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను.ఒకమారు నారదుడు, దక్షప్రజాపతి, భృగుమహర్షి ' నేనూ సత్యలోకానికి వెళ్ళాము. అది బ్రాహ్మణుడు గురువులకే గురువు సృష్టికర్తయైన ఆ దేవదేవునికి ప్రణామం చేసి హే దేవ !దేవేశ సర్వ వేదసారము, సర్వజ్ఞాన పాఠమూ మీరే! మాకు సారతత్త్వాన్ని అనుగ్రహించండి' అని ప్రార్ధించాం. 


🌺సర్వశాస్త్రసారభూతము గరుడ మహాపురాణము. ప్రాచీన కాలంలో శ్రీ మహావిష్ణువు నాకూ, శివునికీ, అన్యదేవతలకూ దీనిని వినిపించాడు. అంటూ బ్రహ్మ ఆ సందర్భాన్ని . ఇలా వివరించాడు.ఒకమారు ఇంద్రాది దేవతలతో కలిసి శివదర్శనానికై నేను కైలాసానికి వెళ్ళాను. అక్కడ పరమశివుడు పరమభక్తితో ఎవరినో ధ్యానించడం చూసి ఆశ్చర్యపోయాను. ఆయన కనులు తెఱచి మమ్ము చూడగానే మేము ప్రణామం చేసి 'హే సదాశివా! మీరు ఇంకొక దేవుని ధ్యానిస్తున్నట్లు మాకు అనిపించింది. మీ కంటె గొప్ప దేవుడు వేరొకరున్నారని మాకింత వరకూ ఎవరూ చెప్పలేదు. మీరే ధ్యానించదగ్గ పరమ దేవతా స్వరూపముంటే మమ్ము కరుణించి ఆ పరమసారతత్త్వాన్ని మాకూ అనుగ్రహించండి అని అడిగాను. 


🌺బ్రహ్మాది దేవతలారా! నేను సర్వఫలదాయకుడు, సర్వవ్యాపీ, సర్వరూపుడు , సర్వ ప్రాణి హృదయవాసీ, పరమాత్మా, సర్వేశ్వరుడునగు విష్ణుభగవానుని సదా ధ్యానిస్తుంటాను. బ్రహ్మదేవా!ఆ స్వామి ఆరాధనలో భాగంగానే ఎల్లవేళలా భస్మాన్నీ, జటా జూటాన్నీ ధరించి నిరంతర ప్రతాచరణ నిరతుడనైవుంటాను. ఎవరైతే సర్వవ్యాపకుడూ, అద్వైతుడు , జయశీలుడు , నిరాకారుడు, సాకారుడు, పద్మనాభుడు, నిర్మల విశుద్ధ పరమహంస స్వరూపుడు అయి వుండి తాను వెలుగుతూ విశ్వాన్ని వెలిగిస్తూన్నాడో ఆ పరము పదపర మేశ్వర భగవానుడైన శ్రీహరిని నేను ధ్యానిస్తున్నాను. ఈ విష్ణు సారతత్త్వాన్ని ఆయన వద్దకే పోయి తెలుసుకోవాలి పదండి అన్నాడు పరమేశ్వరుడు. 

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat