*గరుడ పురాణము*🌷 *ఐదవ అధ్యయనం-మొదటి భాగం*

P Madhav Kumar

 *ఈ వేనుడు నాస్తికుడు, పొగరుబోతు, మహర్షులను,పూజ్యులను దారుణంగా* 🌹

 *ధ్రువ వంశం-దక్ష సంతతి* 


శివాది దేవతలారా! ఉత్తానపాదునికి ఇద్దరు భార్యలు; సురుచి, సునీతి, వారిలో సురుచికి ఉత్తముడు, సునీతికి ధ్రువుడు పుట్టారు. వారిలో ధ్రువుడు చిన్నతనంలోనే నారద మహర్షి కృప వల్ల ప్రాప్తించిన ఉపదేశానుసారం దేవాధి దేవుడైన జనార్ధను ఆరాధించి ఆయన దర్శనభాగ్యాన్ని పొందాడు. ఆ తరువాత చాలా కాలం పాటు మహారాజుగా, మనిషిగా బాధ్యతలను నిర్వర్తించి దేహాంతంలో విశ్వంలోనే కాంతివంతమైన నక్షత్రంగా ఉత్తమ స్థానంలో నిలిచాడు.


🌺ధ్రువుని కొడుకు శిష్టుడు. ఆ తరువాత ఆ వంశంలో పరంపరగా ప్రాచీన బరి, ఉదారధి, దివంజయుడు, రిపుడు, చాక్షుషుడు, రురు, అంగుడు, వేనుడు రాజ్యం. చేశారు. ఈ వేనుడు నాస్తికుడు, పొగరుబోతు, మహర్షులను, పూజ్యులను దారుణంగా అవమానించేవాడు. దేశం పాడైపోతుండంతో మరో దారిలేక మహర్షులు కుశాఘాతా లతో వానిని చంపివేశారు! రాజ్యం అరాచకం కాకుండానూ, విష్ణుమానస పుత్రుని కోసమూ ప్రయత్నాలు చేయసాగారు. ముందు వేనుని శరీరం కాస్త వెచ్చగా వుండగానే మంత్ర సహితంగా మంథనం చేయగా ఒక పుత్రుడు ఉద్బవించాడు.


🌺 అతడు నల్లగా, అతిచిన్న పరిమాణంలో వుండడంతో, అతనిని 'ఇక్కడే వుండు' అనే భావంతో 'నిషేద’ అన్నారు. ఈ శబ్దం వల్ల అతని పేరు నిషాదుడుగా స్థిరపడిపోయింది. అనంతర కాలంలో అతడు కొండల మీదికి వెళ్ళిపోయాడు. తరువాత మునులంతా కలిసి తమ తపశ్శక్తిని వినియోగించి శ్రీహరిని జపిస్తూ వేనుని కుడిచేతిని మథించగా అందునుండి విష్ణువే పృథు నామంతో అవతరించాడు.


🌺 ఆయన ప్రజా రంజకమైన పరిపాలనను చేయడమే కాక వారికోసం పృథ్విని పితికి సమస్త ద్రవ్యాలను రాబట్టి ప్రజలను ఐశ్వర్యవంతులను చేశాడు.పృథు తరువాత వంశానుగతంగా అంతర్భానుడు, హవిర్ధానుడు, ప్రాచీన బర్మి రాజులయ్యారు. ఈ ప్రాచీన బర్మి సముద్ర పుత్రియైన సాముద్రిని పెండ్లాడి పదిమంది పుత్రులను కన్నాడు.


🌺 వారందరూ ప్రాచేతన నామంతో ప్రసిద్ధులై ధనుర్వేదంలో నిష్ణాతులై లోకంలో ధనుర్ధారులను తయారు చేశారు. ధర్మాచరణ నిరతులై ప్రజలను కాపాడారు. తరువాత పదివేల సంవత్సరాల పాటు నీటి అడుగున కఠోరతపస్సు చేసి తత్ఫలితంగా ప్రజాపతి పదవినీ, వరప్రసాదియైన మారిషయను దివ్యస్త్రీని భార్యగానూ పొందారు. శివుని చేత శపింపబడిన దక్షుడు ఈ మారిషకే కొడుకుగా పుట్టాడు.


🌺దక్షుడు ముందు నాలుగు రకాల మానస పుత్రులను సృష్టించాడు కానీ శివుని శాపం వల్ల వారు అభివృద్ధి చెందలేదు. ప్రజాపతి కూతురైన ఆసక్తి అను సుందరిని వీరణ పెండ్లాడి వేయి మంది పుత్రులను కన్నాడు కానీ వారంతా నారదమహర్షి ఉపదేశం మేరకు గృహస్థ జీవన విముఖులై పృథ్వి యొక్క హద్దులను చూసివస్తామని పోయి రాలేదు.


🌺దక్షుడు మరల వేయి మంది పుత్రులను కని సృష్టిని కొనసాగించాడు. వారు 'శబలాశ్వ' నామంతో ప్రసిద్ధులయ్యారు. కాని వారు నారదుని బోధనలను విని సన్యాసులయిపోయారు. ఈ మారు దక్షుడిక కోపం పట్టలేక నారదుని మర్త్యలోకంలో జనించాలని శపించాడు. అందువల్ల నారదుడు కశ్యపపుత్రునిగా పుట్టవలసివచ్చింది.


🌺చూడండి భగవంతుడి లీల ఎంత గొప్పదో ! ఈ బ్రహ్మాండం లో సకల జీవ రాశులు,అంతరిక్షం ఎలా ఉద్బవించాయో ,వాటి పేర్లు ఎలా వచ్చాయో ఈ అధ్యయనాలు ద్వారా తెలుస్తుంది.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat