అయ్యప్ప సర్వస్వం - 15

P Madhav Kumar


*గురుమహత్మ్యమ్*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


1. గకారః సిద్ధిదః ప్రోక్తోరేఫః పాపస్యదాహక | 

ఉకారః శంభురిత్యుక్త స్త్రీత యాత్మా గురుఃస్మృతః ॥


2 నిర్గుణంచ పరంబ్రహ్మా గురురిత్యక్షరద్వయమ్ । మహామంత్రం మహాదేవి గోపనీయం పరాత్పరమ్ ॥


3. గురురిత్యక్షరం యస్యజిహ్వాగ్రేదేవి వర్తతే |


తస్యకింసద్యతే మోహః పారైర్వేదన్యకిం వృధా 11 


4. గకారోచ్ఛారణ మాత్రేణ బ్రహ్మహత్యావ్యపోహతః | ఉకారోచ్చారన మాత్రేణ ముత్యతే జన్మపాతకాత్ ॥


5. రేఫోచ్చారణ మాత్రేన ఉకారోచ్ఛారణాత్ పునః ।

విసర్గోచ్చారణాత్ కోటి జన్మజం పాతకం హరేత్ ॥ 


6. గురురిత్యఓరం దేవి జపతోమమనిశ్చితమ్ । బ్రహ్మ మత్యాపురాముక్తా సత్య మేతన్నసంశయః || 


7. పరశురామోమాతృవధాత్ దేవేంద్రో బ్రహ్మ హింసనాత్ । 

పాతకాదపి ముక్తోబూతగురోరుచ్ఛారణ మాత్రతః ॥


*శ్రీ గురు వందనము*


8. గురోశ్మా ట్యె , బవవ్యాది కషాయసమదీప్తయే | సర్వసంగపరిత్యాగ పతాకాయైనమోనమః ॥


9. గురుం సర్వాత్మకం నిత్యం పరిచ్చిన్న మినోదితమ్ । సంవిమోమయతేలోకం దేమాయశ్రీ గురోర్నమః |


10. అస్మాదృ ఓ మహామంద జనానుగ్రహయోనయే ॥ స్థూలదేహావతారాయై కరుణాయైగురోర్నమః |


11. భక్తసంతాపశమనై కాంతిదీక్షితదీప్తయే | 

శ్రీ గురోర్హసితోదార చంద్రికాయైనమోనమః ॥


12. భక్త సంచిత దుష్కృత్య వనదావాగ్నయేగురోః కోపాయానస్యరూపాయ భీకరాయనమోనమః ॥


*శాస్త్రేగురోరావశ్యకత్యమ్*


 13. గురుంవినాయస్తుమూఢః పుస్తకాది విలోకనాత్ | జపబంధంసమాప్నోతికిల్బిషం పరమేశ్వరి ॥ 11 


14. నమాతా నపితా భ్రాతాతస్యకోవాగతిః ప్రియే ।

గురురేకో వరారోహే పాపం నాశయతి క్షణాత్ | 


15. గురుంవినాయతస్తంత్రే విదికారః కథంచన |

అత్వవ ప్రయత్నేన గురుః కర్తవ్యముత్తమః ॥ 


*గురు - మంత్ర - దేవతానామైక్యమ్*


16. గురరేకః శివః ప్రోక్తః సోహం దేవినసంవయః | గురుస్త్వమపి దేవేశిమంత్రో పిగురురుచ్చతే. 


17. అతోమంత్రో గురౌదేవేనహిభేదః ప్రజాయతే |

కదచిత్ న సహస్రారేపద్మే ద్యేయోగురుః సదా॥


18. కదాచిత్ హృదయాబోజేకదాచిత్ దృష్టిగోచరే | దేవతా - గురు - మంత్రోవైక్యం సంభావయన్ ధియా ॥ తదాసిద్ధోద్యవేన్మంత్రః ప్రకటేహాని రేవచ ॥


శ్రీ గురుమహత్మ్యమును మాటలతో వర్ణించుట బహు దుస్తరము. భారతీయ సంస్కృతి గురువును సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా గుర్తించినట్లు పైశ్లోకము వలన తెలియుచున్నది. భక్తి , యోగ , జ్ఞాన , వైరాగ్య , మంత్రశాస్త్ర , తంత్రశాస్త్ర , పురాణ , బ్రహ్మవిద్యలకు గురువు నిలయము. వేదముల యొక్క సారము శిరోభాగమైన ఉపనిషత్తులు మొదలైన వాటి అన్నింటిలోను గురువు పవిత్ర మహిమ కీర్తింపబడినది. పరమభక్త శిఖామణి యైన శ్రీగోస్వామి , తులసీదాసు తన రామచరిత మానసను ప్రారంభిస్తూ గురువునకీ విధంగా నమస్కరించాడు.


*వందేగురు పద - కంజ - కృపాసింధు నర -  రూప - హరి | మహామోహతను పూజ , జానువచన రవికర నికర ॥*


ఇచ్చట గురువును *“నర రూప - హరి"* మనుష్య వేషంలో నున్న సాక్షాత్తు పరమాత్మయని చెప్పియున్నాడు. గురువు పరమాత్మ స్వరూపుడగుట వలన అతడు కృపాసాగరుడగుటలో సందేహము లేదు. అతని పలుకులు గాడమోహాంధకారాన్ని నశింప జేయుటకు ప్రకాశవంతమైన సూర్యకిరణములతో సమానంగా వుంటవి.


జ్ఞానం లేకుండా హృదయాన్నావరించిన అంధకారం నశింపదు. జ్ఞానం గురువు కృపాకటాక్షముల వలననే ప్రాప్తిస్తుంది.


*"ఇహ ఆచార్యవాన్ పురుషోవేద"* అని ఛాంద్యోఖ్యోపనిషత్తు చెప్పింది. అందువలననే శ్రుతులు *"ఆచార్యదేవోభవ"* అని ఆజ్ఞాపించాయి. జ్ఞానంతో సమానమైన ఇతర పవిత్ర వస్తువు మరియొకటి లేదు. *"నహిజ్ఞానేన సదృశం పవిత్ర మిమవిద్యతే"* అనేక జన్మలనుండి ప్రోగుపడియున్న పాపములను భస్మం చేసే శక్తి ఒక్క జ్ఞానానికే వుందని శ్రీకృష్ణభగనానుడే చెప్పియున్నాడు.


*యధాంసి సమిద్యోగ్నిర్చస్మసాత్ కురుత్ కెర్జున ,*

*జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతేతధా ॥* 


ఏ విధంగా మండే అగ్ని సమిధలను భస్మం చేయునో అదేవిధంగా జ్ఞానాగ్ని సంపూర్ణ కర్మములను భస్మం చేస్తుంది.


ఇట్టి పవిత్ర జ్ఞాన తత్వాన్ని జ్ఞానవంతుడైన గురువు నాశ్రయించి వానిని శరణు జొచ్చి వానిదయను సంపాదించి పొందవలసిన దేకాని ఇతరముల వలన లభ్యంకాదు. అజ్ఞానావరణ విభక్తమైన కారణంగానే జీవుడు మరల మరల విభిన్నయోనులలో జన్మించి తరుణోపాయం దొరకక తిరుగుతూ దుఃఖమనే తిరుగలిలో పడవేయబడి త్రిప్పబడుతు (విసరబడుతు) వుంటాడు. అజ్ఞానంతో గ్రుడ్డివాడైన జీవుని నేత్రమునకు జ్ఞానాంజన రూపమైన శలాకతో జ్ఞానాన్ని వికసింప జేయుట వలననే గురువు వందనీయుడగు చున్నాడు.


ఆదిశంకాచార్యులవారు గురుశబ్దానికి వ్యాఖ్య వ్రాస్తూ *అవిద్యా - హృదయ - గ్రంధి బంధ - మోక్షోయతో భవేత్ . తమేవ గురువీత్యా హుద్గురు - శబ్ధానమోగినః ॥*


బందమునకు ముఖ్యకారణమైన అవిద్యారూపమైన హృదయ గ్రంధిని చేధించుటకు సమర్థుడైన వాడు గురుపదంతో పిలువబడు చున్నాడు.


మరొక విధంగా దాని వ్యాక్య ఈ విధంగా వుంది. *గృణాతి ఉపదిశతి ధర్మమితిగురుః గిరతి జ్ఞానమితిగురుః |*

*యద్వాగీయతేస్తూయతే దేశ గంధర్వాదిభిరితిగురుః*


ఎవరైతే ధర్మోపదేశం చేస్తారో , అజ్ఞాన రూపమైన మనస్సును నాశనం చేసి జ్ఞానరూపజ్యోతిని ఎవరు ప్రకాశింప చేస్తారో దేవగంధర్వాదులతో ఎవరుస్తుతింప బడుతారో అతడే సాక్షాత్తు దేవుని సంజ్ఞారూపమైన గురువని తెలియవలెను. పరమార్థపథంలో మార్గంలో గురుదేవుని మార్గదర్శకత్వం లేకుండా ఒక అడుగు కూడా ముందునకు వేయుట అసంభవము. ఈలోకంలో పొందిన వాడే సాఫల్యాన్ని పొందుతాడు. అందువలన *గురుమహత్మ్యమును ఎల్లప్పుడు స్మరిస్తూ శుభములను పొంద గోరువాడు గుర్వాజ్ఞాపాలనారతుడై గురువు దయకు పాత్రుడై యుండవలెను.*


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*🌹🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat