అయ్యప్ప షట్ చక్రాలు (33)

P Madhav Kumar


కంఠమలై సహస్రార చక్రము (3)


అయ్యప్ప భక్తులకు కోటి అనుమానాలు. అందులో ఒక ముఖ్యమైనది "పొంన్నoబలమేడు" లోని స్వర్ణ మందిరం. అది సరిగ్గా ఎక్కడ వున్నది, ఉంటే ఎందుకు కనపడదు. ఇది ఒక కట్టుకథయా? ఎందుకు ఎవరూ అక్కడకు పోలేరు. కారణం 


మీలో ఎందరో మీ యాత్రలో భాగంగా అచ్చన్ కోయిల్ శ్రీ ధర్మశాస్త్ర దేవాలయంకు వెళ్లి వుంటారు. అక్కడ ఉన్న మేలిమి బంగారుతో మెరసిపోవు కరవాలమును చూసి వుంటారు. చదవండి ఆ కరవాలము యొక్క ఉద్భవము. దీనితో పాటే పొన్నoబలమేడు పై మీకు గల సందేహాలు తీరి పోతాయి.


పొన్నంబల వాసనే శరణం అయ్యప్ప


పొన్+అంబల+మేడు. పొన్ అనగా బంగారు. అంబలం అనగా నివాస స్థలం. మేడు అనగా గుట్ట. అంతా స్వర్ణ మయం ఆ గుట్ట పైని శాస్తా నివసించు స్వర్ణ మణిమయ నానావిధ, నవవిధ రత్నమయ విడిది. తమిళ నాడుకు చెందిన తిరునల్వేలి తాలూకా పావూర్ సత్రం నకు చెందిన ఒక బ్రాహ్మణుడికి జీవితాశయం ఏమన కాంతమలై లోని పొన్నoబల నాథుని దర్శించాలి. ప్రతి దినం ఆశాస్తను వేడుకొనే వాడు. అట్లే కరుప్పన్న స్వామిని కూడా ఉపాసన చేసేవాడు. భక్తులపై అపార కరుణ కల ఆ శాస్త ఒకనాడు కరుప్పన్న ను పిలిచి ఆబ్రహ్మణుడి కోరికను తీర్చుమని చెప్పెను.


అంత కరుప్పన్న ఆ బ్రాహ్మణుడు వద్దకు వచ్చి "విప్రవర్యా, భక్తా! ఆ స్వామి ఆనతి మేర నిన్ను ఆ కాంతమల ఆలయము నకు తీసుకెళ్ల వచ్చాను. కానీ ఒక షరతు. అక్కడకు పోయి తిరిగి వచ్చు వరకు, నీవు నీ చేతితో దేనిని తాకరాదు అని చెప్పి, ఆ విప్రుని చేయి పట్టుకొనెను.


క్షణ మాత్రమున ఇరువురు ఆ ఆలయము లో నున్నారు. ఆపర్వతమే స్వర్ణమయ, నవరత్న ఖచిత మణిమయములచే దివ్యమైన కాంతితో వెలుగోoదు చున్నది. దాని వైభవం వర్ణింప మాటలు చాలవు. కనులు చెదరి పోవుచున్నవి. పూర్ణ పుష్కలా సమేతుడై స్వామి దివ్య తేజస్సు తో ఉదయభాను కిరణుoడై వెలుగోoదు చున్నాడు. బ్రాహ్మణుడికి మతి పోయినది. తన్ను తానే గాక సర్వం మరచినాడు. కరుప్పన్న స్వామి చెప్పిన హెచ్చరికను మరచాడు. తన్మయత్వానికి లోబడి పోయినాడు. స్వార్థం మేల్కొనింది.


పుణ్యాత్ముల స్వార్థం లోకకళ్యాణమునకై ఉంటుంది, అలానే కోరుకుంటారు కానీ తమ కోసం ఏదీ ఆశించరు. తనలాగే ఈ అలౌకిక ఆనందం, భూలోకమున నున్న అచ్చెoకోవెల చుట్టూ ప్రక్కల భక్తులు కూడా అనుభవించాలి అని అనుకున్నాడు. అదియే ఆయన స్వార్థం. స్వామి యొక్క సంకేతమేదైనా ఒకటి తీసుకొని వచ్చి కోవెలలో ఉంచాలనే సంకల్పం మనస్సు నందు ఏర్పరచుకొన్నాడు. అక్కడున్న స్వామి కరవాలమును తాకాడు.


అంతే! ఉత్తర క్షణము కరవాలముతో పాటు వచ్చి కోవెలలో పడ్డాడు. కరుపన్న స్వామి చెప్పినట్లుగానే పాపం ఆ భక్త శిఖామాణి, స్వామిని చూచినా కళ్ళతో ఈ మాయా సoసారాన్ని చూడ నోచుకోలేదు. అంధుడై పోయినాడు. 


అతని తప్పిదానానికి ఫలితం ఈ నాటి వరకు అతని సంతతి అంతయు అంధత్వముతో బాధలు పడుచున్నది. అతడి చే కోవెలకు తీసుకొని రాబడిన స్వామి స్వర్ణ కరవాలము నేటికిని మన కంటికి విందు కలిగిస్తూ కోవెలలో స్వామి వద్ద స్థిరమై నిలిచి ఉన్నది. మేలిమి బంగారు తో తళ తళ లాడుతూ భక్త కోటి కన్నులు ఆ బ్రాహ్మణుడు కళ్లుగా, చూస్తున్నట్టుగా, స్వామికి కోవెలలో మరింత వన్నె తో అలరారు చున్నది. 


ఆ పుణ్య భక్త శిఖరాగ్రేశ్వరుడు బ్రాహ్మణుడు, అతని సంతతి, కళ్ళు శాశ్వితముగా మనకి ధారబోశారు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat