Karthika Puranam | కార్తిక పురాణం - 10వ అధ్యాయము | అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము:
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

Karthika Puranam | కార్తిక పురాణం - 10వ అధ్యాయము | అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము:

P Madhav Kumar

🌷అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము:

జనకుడు వశిష్టుల వారిని గాంచి "ముని శ్రేష్ఠ! యీ అజామీళుడు యెవడు? వాడి పూర్వ జన్మ మెటువంటిది? పూర్వ జన్మంబున నెట్టి పాపములు చేసియుండెను? ఇప్పడీ విష్ణు దూతలు వైకుంటమునకు తీసుకొనిపోయిన తరువాత నేమి జరిగెను? వివరించ వలసినది" గా ప్రార్ధించెను.

అంత నా మునిశ్రేష్టుడు జనక మహారాజును గాంచి యిట్లు పలికెను…

జనకా! అజా మీళుని విష్ణు దూతలు వైకంఠమునకు తీసుకొనిపోయిన తరువాత యమ కింకరులు తమ ప్రభువగు యమ ధర్మరాజు కడ కేగి, "ప్రభూ! తమ అజ్ఞ ప్రకారము అజామీళుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణు దూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీళుని విమాన మెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. మేము చేయునది లేక చాల విచారించుచూ యిచటకు వచ్చినారము' అని భయ కంపితులై విన్నవించు కొనిరి.

“ఔరా! ఎంతపని జరిగెను? ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి యుండలేదే? దీనికి బలమైన కారణము ఏదైనా వుండి యుండవచ్చును" అని యముడు తన దివ్య దృష్టితో అజామీళుని పూర్వ జన్మ వృ త్తాంతము తెలుసుకొని "ఓహొ! అది యా సంగతి! తన అవసాన కాలమున "నారాయణ" అని వైకుంఠవాసుని స్మరణ జేసి యుండెను. అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకొని పోయిరి. తెలియకుండా కాని తెలిసి కాని మృత్యు సమయన హరినామ స్మరణ ఎవరు చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగుతుంది. కనుక అజామీళునికి వైకుంఠప్రాప్తి కలిగెను కదా!” అని అనుకొనెను.

అజామీళుడు పూర్వ జన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడుగా నుండెను. అతడు అపురూపమైన అందంచేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్టి యై శివారాధన చేయక, శివాలయము యొక్క ధనము నపహరించుచు, శివుని విగ్రహము వద్ద ధూప దీప నైవేద్యములను బెట్టక, దుష్ట సహవసములను మరిగి విచ్చలవిడిగా తిరుగు చుండెడి వాడు. ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములు వుంచి పడుకునేవాడు.

ఇతని కొక బిద బ్రాహ్మణ స్త్రీ తో రహస్య సంబంద ముండెడిది. ఆమె కూడా అందమైనద గు టచే చేయునది లేక ఆమె భర్త చూచియు చూడ నటుల నుండి భిక్షాటనకై వురూరా తిరుగుచూ ఏదో వేళకు యింటికి వచ్చి కలం గడుపుచు౦డెడి వాడు.

ఒకనాడు పొరుగూరికి వెళ్లి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిని బెట్టుకొని వచ్చి అలిసిపోయి "నాకు యీ రొజున ఆకలి మిక్కుటముగా నున్నది త్వరగా వంట చేసి పెట్టుము", అని భార్యతో ననెను. అందులకామె చిదరించుకోనుచు, నిర్లక్ష్యముతో కళ్ళు కడుగుకొనుటకు నీళ్లు కూడా యీయక, అతని వంక కన్నెత్తి యైననూ చూడక విటునిపై మనస్సు గలదియై మగని తూలనాడుట వలన భర్తకు కోపము వచ్చి మూలనున్న కర్రతో బాదెను. అంత ఆమె భర్త చెతి నుండి కఱ్ఱ లాగు కొని భర్తను రెండితలు కొట్టి బైటకు త్రోసి తలుపులు సివేసెను. అతడు చేయునది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక యింటి ముఖము పట్ట రాదని తలపోసి దేశాటనకు వెడలిపోయెను.

భర్త యింటి నుండి వెడలి పోయెను కదా యని సంతోషించి, ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగు పై కూర్చుండి యుండగా ఒక చాకలి వాడు ఆ దారిని పోవుచుండెను. అతనిని పిలిచి "ఓయీ! నీవి రాత్రి నాతో రతి క్రీడ సలుపుటకు ర"మ్మని కొరెను. అంత నా చాకలి “తల్లి! నీవు బ్రాహ్మణ పడతివి. నేను నీచకులస్తుడను, చాకలివాడిని. మీరీవిధంగా పిలవడం యుక్తము కాదు. నేనిట్టి పాపపు పని చేయను” అని బుద్ధిచెప్పి పోయెని.

ఆమె ఆ చాకలివాని అమాయకత్వమునకు లోలోన నవ్బుకొని అక్కడి నుండి బయలుదేరి ఆగ్రామ శివార్చకుడు దగ్గరికి వెళ్లి తన కామవాంఛ తీర్చమని పరిపరివిధముల బ్రతిమాలి ఆ రాత్రంతా అతనితో గడిపి ఉదయము ఇంటికి వచ్చి ” అయ్యో! నేనెంతటి పాపమునకు ఒడిగట్టితిని? అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెళ్లగొట్టి క్షణమైన కామవాంఛకు లోనై మహాపరాధము చేసితిని” అని పశ్చాత్తాపము పొంది, ఒక కూలి వానిని పిలిపించి కొంత ధనమును ఇచ్చి తన భర్తను వెదకి తీసుకురావలసినదిగా పంపెను.

కొన్ని దినముల గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను. అప్పటి నుండి ఆమె మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను.

కొంతకాలనికి శివార్చకునికి ఏదో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణిస్తు మరణించెను. అతడు రౌరవాది నరక కూపములబడి నానాబాధలు పొంది మరల నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తనికి కుమారుడై కార్తీక మాసంలో నదీస్నానము చేసి దేవాతదర్శనము చేసి ఉండటంవలన నేడు జన్మముల పాపములు నశించుటచేత అజామీళుడై పుట్టెను. ఇప్పటికి తన అవసాన కాలమున “నారాయణా” అని శ్రీహరిని స్మరించటం వలన వైకుంఠనికి పోయెను.

బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగ గ్రస్తురాలై చనిపోయెను. అనేక యమయాత నలనను భవించి ఒక మాల వాని యింట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మ రాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను. మాల వాడా ఆ శిశువును తీసుకొనిపోయి అడవి యందు వదిలిపెట్టేను.

అంతలో నొక విప్రుడు ఆ దారిన పోవుచు పిల్ల యేడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన యింట దాసికిచ్చి పోషించెను. ఆ బాలికనే అజామీళుడు ప్రేమించెను. వారి పూర్వ జన్మ వృత్తాంత మిదియే.

నిర్మల మైన మనస్సుతో శ్రీ హరిని ధ్యానించుట, దాన ధర్మములు చేయుట, శ్రీ హరి కథలను ఆలకించుట, కార్తిక మాస స్నాన ప్రభావముల వలన నెటువంటి వారైననూ మోక్ష మొంద గలరు. గాన కార్తిక మాసము నందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వార లిహపర సుఖములు పొంద గలరు.

*ఇట్లు స్కాంద పురాణా౦త ర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి దశమా ధ్యాయము - పదవ రోజు పారాయణము సమాప్తమ..


🌷ఓం నమో నారాయణాయ..🙏🙏
🌷ఓం నమః శివాయ...🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow