పల్లవి :–
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
ఓ రామ ఓ రామ ఓం కార రామ || శ్రీ రామ ||
చరణం :-1
చారు సుందర రామ జానకి రామ
పాలించరా తండ్రి పావన రామ || శ్రీ రామ ||
చరణం :-2
కోరితి రా నిన్నే కోదండ రామ
దయ చూడరా మమ్ము దశరధ రామ || శ్రీ రామ ||
చరణం :-3
కరుణించు మమ్మేలు కళ్యాణ రామ
అడిగితి రా నిన్నే అయోధ్య రామ || శ్రీ రామ ||