అన్నపూర్ణా దేవి హారతి పాట - Annapoorna Devi Haarathi Song - Telugu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

అన్నపూర్ణా దేవి హారతి పాట - Annapoorna Devi Haarathi Song - Telugu

P Madhav Kumar


 అన్నపూర్ణా దేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా

విష్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంటా

నా తనువునోతల్లినీ సేవ కొరకు అర్చింతునోయమ్మ పైజన్మవరకు


నా తనువు అచలాంష నీ పురము చేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి ||అన్నపూర్ణా దేవి||


నా తనువు ఉధకాంశ నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి ||2||

నా తనువు తేజోంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి ||2||

||అన్నపూర్ణా దేవి||


నా తనువు మరుదంశ నీ గుడికి చేరి నీ చూపు కొసలతో విసరాలి తల్లి ||2||

నా తనువు గగనాంశ నీ మనికి చేరి నీ నామ గానాలు మ్రోయాలి తల్లి  ||2||

||అన్నపూర్ణా దేవి||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow