రామ రఘు రామా
నీ నామమే మధురమయా || 2 ||
భక్తుల బ్రోవుమయా
దాసులా గావుమయా
దశకంఠుని వధియించుటకై
దశరథ తనయుడవైతివా
దైత్యులను వధియించి
లోకాన్నే కాచితివా
రామ రఘు రామా
నీ నామమే మధురమయా
భక్తుల బ్రోవుమయా
దాసులా గావుమయా
గురువు యాగము గాచుటకై
రక్షణకై వెళ్ళితివా
తాటకిని వధియించి
చక్కగ జనులను బ్రోచితివా
రామ రఘు రామా
నీ నామమే మధురమయా
భక్తుల బ్రోవుమయా
దాసులా గావుమయా
శివుని విల్లుని త్రుంచితివి
సీతను చేపట్టితివి
ఒకటే మాట ఒకటే భాణం
ఒకటే సతియని తెలిపితివా
రామ రఘు రామా
నీ నామమే మధురమయా
భక్తుల బ్రోవుమయా
దాసులా గావుమయా
తల్లి మాటను మీరకనే
కారడవులకు వెళ్ళితివా
అడవులలో నివసించి
సత్యాత్ముడవై వెలిగితివా
రామ రఘు రామా
నీ నామమే మధురమయా
భక్తుల బ్రోవుమయా
దాసులా గావుమయా