శివగురు సుబ్రహ్మణ్య బాలా శరణం శరణం - తిరుచెందూర్ సెంతిల్ నాథా శరణం శరణం
||శివగురు||
బాల దండాయుధ పాణీ శరణం శరణం - పళణి సుబ్రహ్మణ్యవేలా శరణం శరణం
॥ శివగురు ||
కార్తికేయస్వామి శరణం కావడి ప్రియుడా నీవే శరణం ||2||
వేలాయుధనే నీవే శరణం నాగరాజా నీవే శరణం ||2||
దేవసేనాపతి శరణం శరణం
తారకాసుర సంహర శరణం శరణం ||2||
|| శివగురు ||
పంపా గణపతి సోదర శరణం పంథళ బాలుని సోదర శరణం ||2||
పంచామృత ప్రియ నీవే శరణం పరమేశ్వరసుత స్వామి శరణం ||2||
భస్మాభిషేక ప్రియుడా శరణం శరణం
మయూర వాహన మమ్ము కావరా శరణం శరణం ||2||
||శివగురు||
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
లిరిక్స్ పంపినవారు :
*వై. వెంకటసుబ్బారెడ్డి స్వామి*