సత్యనారాయణా స్వామి హారతి పాట - Satyanarayan Swami Haarathi Paatalu - 3 Songs - Telugu Lyrics

P Madhav Kumar

 

సత్యనారాయణా స్వామి హారతి పాట - 1
=========


సత్యనారాయణా స్వామికి మనమంతా నిత్యామంగళమానరే,

 జనులారా సత్యామంగళామానరే ||సత్యనారాయణా||


ఆవుపేడలు తెచ్చి పచ్చాటి కళ్ళాపీచల్లి

పగడిముగ్గులు వేయారే జనులారా పగడిముగ్గులు వేయారే ||సత్యనారాయణా||


తట్టుపీటలు తెచ్చిపట్టుబట్టలు పరచి

సన్న బియ్యముపోయరే జనులారా సన్న బియ్యముపోయరే ||సత్యనారాయణా||


ఛెంబు కలశముగట్టిటెంకాయ పూజా చేసి

ఒంగి దండముచేయరే జనులారా ఒంగి దండముచేయరే ||సత్యనారాయణా||


అర్ధశేరు గోధుమ రవ్వతీనుపావు పంచాదారా 

పండ్లుఫలహారములు కలుపరే జములారా పండ్లుఫలహారములు ||సత్యనారాయణా||


కీరు పూరీ చేసీ నైవేద్యముజూపి, 

ఒక్కాపొద్దులు విడువరే జనులారా ఒక్కాపొద్దులు విడువరే ||సత్యనారాయణా||


కోరినవారికికొడుకులను వరమిచ్చి 

కొటి సంపతి కలుగునే జనులారా కొటి సంపతి కలుగునే  ||సత్యనారాయణా||


అడిగినవారికీ 

అధిక సంపతి కలుగునే జనులారా అధిక సంపతి కలుగునే ||సత్యనారాయణా||


సత్యనారాయణా స్వామి హారతి పాట - 2
=========


సత్యనారాయణా పూజలుచేసిన

పాపం పరిహారం ఇలలో పాపం పరిహారం ||సత్యనారాయణా|| 


నిరతమునిను కొలిచినవారికి

ఆశలు తీర్చెదవోదెవా ||సత్యనారాయణా||


పున్నమిరోజునపుడమిలో జనులు

సత్యనారాయణా పూజలు చేసెదరు ||సత్యనారాయణా||


విష్ణువు నీవే బ్రహ్మవు నీవే మహేశ్వరుడవు నీవే

ఆరాగముతో అనురాగముతో

ఆశలు తీర్చెదవోదేవా ||సత్యనారాయణా||


సత్యనారాయణా స్వామి హారతి పాట - 3

=========


శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా

మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా ||శ్రీ||


నోచిన వారికి నోచిన వరము

చూసిన వారికి చూసిన ఫలము ||శ్రీ||


స్వామిని పూజించే చేతులే చేతులటా

 మూర్తిని దర్శించే కనులే కన్నులటా

తన కథ వింటే ఎవ్వరికైనా జన్మతరించునటా ||శ్రీ||


 వేళైనా శుభమైనా కొలిచే దైవం  దైవం

అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం ||శ్రీ||


అర్చన చేద్దామామనసు అర్పణ చేద్దామా

స్వామికి మదిలోనేకొవెల కడదామా

పదికాలాలు పసుపు కుంకుమలుఇమ్మని కోరెదమా ||శ్రీ||


మంగళమనరమ్మాజయమంగళమనరమ్మా 

కరములు జొడించిశ్రీ చందనమనరించీ 

వందనమనరే సుందరమూర్తికివందనమనరమ్మా ||శ్రీ||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat