అమ్మా అమ్మా దుర్గమ్మా ఆదిశక్తివి నీవమ్మా
పది చేతులు నీకు నీకమ్మా పసిడి కాంతుల దుర్గమ్మా
బల్లెం చేత పట్టావు దుష్టుల భరతం పట్టావు
ఎర్రని కన్నుల కాంతులు మెడలో పుర్రెల దండలు
ఎర్రని చీరలు కట్టేవు పచ్చని గాజులు వేసేవు
ఘల్లున గజ్జలు కట్టేవు గంతులేసి ఆడేవు
ఉగ్రరూపం దాల్చావు క్షుద్ర శక్తుల మట్టు బెట్టావు
వేపాకు పందిళ్లు నీకమ్మా నిమ్మకాయల దండలు నీకమ్మా
దుష్టులను దును మాడేవు భక్తులను కాపాడేవు
కాళీ కాళీ అమ్మ మహంకాళీ కాళీ కాళీ అమ్మ భద్రకాళీ
అమ్మ రావే దుర్గమ్మ రావే తల్లి రావే మమ్మేలుకోవే
కాళీ కాళీ అని కాళీ మాత నిను కొలిచినాము తల్లీ
దుర్గా దుర్గా అని దుర్గామాత నిను వేడినాము తల్లీ
శక్తి శక్తి అని శక్తి రూపముగా కొలిచినాము తల్లీ
అమ్మా అమ్మ అని ఆదరించమని పిలిచినాము తల్లీ