గానం : జంగిరెడ్డి గురుస్వామి
ముక్కంటి తనయుడ ముల్లోక పూజ్యుడ ముజ్జగాలు ఏలే గణపయ్య
గౌరమ్మ వడిలోన గారాల బాలుడ గండర గండవు నీవయ్య ॥కోరస్||
॥ముక్కంటి॥
కన్నులారా గాంచితి కన్నెమూల గణపతి ||కోరస్||
మనసారా వేడితి కాణిపాక శ్రీపతి
॥ముక్కంటి॥
గజరాజ గం గణపతి దేవా.. గణములకే అధిపతివి నీవయ్య
మహారాజ బం భజనల దేవా మూషిక వాహనమెక్కి రావయ్య ॥కోరస్||
అరుణ కాంతుల్లోన ఆది పూజల్లోన వేదమంత్ర ఘోష వినుచుంటివా
దీప వెలుగుల్లోన దివ్య తేజుడవై భక్త కోటికి దీవెనిస్తున్నవ ||కోరస్||
ఆశ్రిత జన రక్షక అభయ మొసగు నాయక ||కోరస్||
ఆరంభ పూజిత హేరంభ వినాయక
॥ముక్కంటి॥
గజరాజ గం గణపతి దేవా.. గణములకే అధిపతివి నీవయ్య
మహారాజ బం భజనల దేవా మూషిక వాహనమెక్కి రావయ్య ॥కోరస్॥
కరిముఖ అందాలు మణిరత్న కిరీటాలు ఆభరణ ప్రియుడవు విఘ్నేశ్వర
తల్లి తండ్రి ప్రేమ లోగిల్లల్లో మురిసే తనయుడవే నీవు సర్వేశ్వర
॥కరిముఖ అందాలు||
ఓ ఈశ్వర నందన వందన సిరిచందన ||కోరస్||
నంది వర్ధనానవాన నీకే గజముఖ వదన ||కోరస్|
॥ముక్కంటి॥
గజరాజ గం గణపతి దేవా.. గణములకే అధిపతివి నీవయ్య
మహారాజ బం భజనల దేవా మూషిక వాహనమెక్కి రావయ్య ॥కోరస్||
మూషిక వాహనమెక్కి రావయ్యా
మూషిక వాహనమెక్కి రావాయ్యా
మూషిక వాహనమెక్కి రావాయ్యా
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
లిరిక్స్ పంపినవారు :
*వై. వెంకటసుబ్బారెడ్డి స్వామి*