కంఠము నిండుగ గరళమయా
నీ దేహము నిండుగ భస్మమయా
వేషము చూస్తే జంగమయా
నీ రూపము జూస్తే లింగమయా
ఇల్లు లేని జోగి వంటూ వల్లకాటిలో ఉంటాడని
దక్షుడంటుంటే దాక్షాయణి నీ వెంటే
|కంఠము|
పెద్ద పెద్ద జడల వాడని ఎద్దు పైన తిరుగు తాడని
దక్షుడంటుంటే దాక్షాయణి నీ వెంటే
|కంఠము|
స్వర్ణాభరణం లేనివాడని నాగులు మెడలో వేసినాడని
దక్షుడంటుంటే దాక్షాయణి నీ వెంటే
|కంఠము|
పట్టు వస్త్రము లేనివాడని పులిచర్మం కట్టినాడని
దక్షుడంటుంటే దాక్షాయణి నీ వెంటే
|కంఠము|
వీభూది రేఖలు పూసేవాడని రుద్రాక్ష మాలలు వేసినాడని
దక్షుడంటుంటే దాక్షాయణి నీ వెంటే
|కంఠము|