భేతాళ కథలు - 10 - మహాసుకుమారి
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

భేతాళ కథలు - 10 - మహాసుకుమారి

P Madhav Kumar


మహాసుకుమారి


విక్రమార్కా! జాగ్రత్తగా విను. మదనపురాన్ని పాలించే మీనకేతుడికి ముగ్గురు భార్యలుండేవారు. రాజుకి ఆ ముగ్గురియందూ సమాన ప్రేమే. ఒకనాడతను మంత్రితో - "నేనొకరోజు పెద్ద భార్య అయిన సౌందర్యవతితో పూలవసంలో విహరిస్తూంటే - ఒక చెట్టునుంచి పువ్వు రాలి ఆమె చేతిమీద పడింది. అంతే క్షణంలో ఆమె చెయ్యి ఎర్రగా కందిపోయింది.


మరొకసారి నేను నా రెండో భార్య శుభాంగితో మేడమీద విహరిస్తున్నాను. ఆ వేళ పున్నమి. వెన్నెల వచ్చింది. అంతే ఆమె పున్నమి వెన్నెలను సహించలేక మూర్ఛపోయింది.


ఇక - నా మూడో భార్య విలాసవతి విషయం విను. ఒకసారామె చిన్న పిల్లవాడి రోదన వింటూనే చెవులు దిబ్బళ్ళు వేసి స్మారకం (స్పృహ) తప్పిపడిపోయింది" అన్నాడు. "రాజా! వీరు ముగ్గురిలోనూ అత్యంత సుకుమారి ఎవరు?" అడిగాడు భేతాళుడు. సౌందర్యవతి చేతి మీదపడిన పువ్వులో ఏ కీటకమో ఉండి కుట్టుటచే ఆమె చేయికంది ఉండ వచ్చును. నిండు వెన్నెలకు యౌవనంలో ఉన్నవారికున్మాదం కలిగించే గుణం ఉంది. శుభాంగికి అటువంటి వ్యాధి ఉండి వెన్నెల వలన ప్రకోపించి ఉండవచ్చును. కాని... విలాసవతి శరీరమేకాక మనసుకూడా మహాసుకుమారమయినది కనుకనే బాలుడి రోదనకే ఆమె సొమ్మసిల్లిపోయింది. ఆమే మహాసుకుమారి." చెప్పాడు విక్రమార్కుడు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow