సాకీ:
సృష్టి ఆదిలో వెలసిన ధర్మం, సృష్టి అంతం వరకూ నిలిచే ధర్మం, ఒకే ఒక ధర్మం
అదే సనాతన ధర్మం
పల్లవి:
కులమన్నది మన జీవన వృత్తిరా
మతమన్నది మన దైవిక శక్తిరా
మనమంతా హిందువులం ఒకరికొకరు బంధువులం
విడివిడిగా బిందువులం
ఏకమైతె సింధువులం
దుష్టశక్తుల దాడులకు బెదిరి పోనిదీ
గుళ్లు గోపురాలు కూల్చినా చెదిరి పోనిదీ
ప్రాణాలు తీసినా మాసిపోనిదీ
మానాలు దోచినా మారిపోనిదీ
యుగయుగాలుగా శిఖరంలా నిలిచివున్నది
సనాతన ధర్మం నిలిచివున్నది
//మనమంతా//
ఆ అంధకార రోజులలో దుర్మదాంధుల పాలనలో
ఇంటింటా గుడులే వెలసి గుండె గుండెలో దైవం వెలిగి
సనాతన ధర్మం భరతావనిలో సుస్థిరమైయున్నది
నేడు ప్రపంచ వ్యాప్తమై ప్రజ్వరిల్లు తున్నది.
సనాతనం, హైందవం నిరంతరం, మహోన్నతం
//మనమంతా//
అణువణువులో దేవుడు అందరిలో పరమాత్ముడుఈ జగమంతా ఆ దైవ స్వరూపమనీ హైందవ విశ్వాసం
ఆధ్యాత్మికతకు ప్రతిరూపం
హిందువుగా జన్మించుటే మహాపుణ్యం
హిందువుగా జీవిస్తే బ్రతుకు ధన్యం
మన సనాతన ధర్మం నిత్యం సత్యం సతతం శాశ్వతం
//కులమన్నది
// ఈ పాటను ఎలా పాడా లో ఇక్కడ టచ్ చేసి వినండి.
