40. పలికినంత పుణ్యమే శ్రీరామ నామము - Palikinanta punyame Sri raama namamu - శ్రీరామ భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

40. పలికినంత పుణ్యమే శ్రీరామ నామము - Palikinanta punyame Sri raama namamu - శ్రీరామ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

సాకి.

జపమేమి చేసేనో జనక మహారాజు. కళ్యాణ రాముని కాళ్ళు కడుగా...
ఏ తపంబు ఫలించె వాల్మీకి మౌని.
భక్తి రామాయణంబు రాసి ముక్తినొందే...

పల్లవి

పలికినంత పుణ్యమే శ్రీరామ నామము
రాఘవ మమ్ము బ్రోవరా
రాఘవ మమ్ముకావరా...
" పలికినంత పుణ్యమే"
చరణం 1

కఠినమైన బోయవాణ్ణి పరమాత్మగ చేసినది
వాల్మీకి ప్రియమైనది శ్రీరామనామము
దైవమే తన ఎంగిలి ఫలములు తిన్నాడని
శబరికెంతొ ప్రియమైనది శ్రీరామ నామము
రాఘవ మమ్ము బ్రోవరా..
రాఘవ మమ్ము కావరా
"పలికినంత పుణ్యమే"
చరణం 2

బంధిఖాన జీవితాన పరుషము నిలిపేనని
భక్త రామదాసు నిమిత్తమైన నామము
అణువు లోన తనువు లోన నిలువెల్ల నీ వేనని
గుండె చీల్చి చూపిన హనుమలోని నామము
రాఘవ మమ్ము బ్రోవరా
రాఘవ మమ్ముకావరా
"పలికినంత పుణ్యమే"
చరణం 2

కలుషాత్ముని రావణుని ఎదురొడ్డి నిలచినా
జఠాయువుకు ప్రియ మైనది శ్రీరామ నామము
యజ్ఞ యాగాదులందు రాక్షసులు పగబూనగ
మునివర్యులు పలికినది శ్రీరామ నామము
రాఘవ మమ్ముబ్రోవరా
రాఘవ మమ్ము కావరా
" పలికినంత పుణ్యమే"

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow