దీపో హరతు మే పాపం దీపజ్యోతిర్నమోస్తుతే॥
భావము : ప్రమిదలోని జ్యోతి దీపజ్యోతి. అది శ్రేష్ఠమైన జ్యోతి. ఆ జ్యోతి సాక్షాత్తు మోక్షప్రదాతయైన జనార్దనుని స్వరూపము. నా సమస్త పాపములను హరించివేయు ఓ జ్యోతీ | నీకు నమస్కారము.
2. శుభం కరోతి కల్యాణం ఆరోగ్యం సుఖ సంపదః |

ద్వేష బుద్ధి వినాశాయ ఆత్మజ్యోతిర్నమోస్తుతే
భావము : దైవ స్వరూపమైన జ్యోతి నాకు సమస్త శుభములను కలిగించుగాక. మేలును, ఆరోగ్యమును, సుఖమును, సంపదలనొసంగుగాక. నా లోని ఈర్ష్య, ద్వేషములతో కూడిన బుద్ధిని నశింపజేయునట్టి ఆత్మయనెడు జ్యోతీ । నీకు నమస్కారము.

3. ఆత్మజ్యోతిః ప్రదీప్తాయ బ్రహ్మజ్యోతిర్నమోస్తుతే
బ్రహ్మజ్యోతిః ప్రదీప్తాయ గురుర్ణ్యోతిర్నమోస్తుతే
భావము : ఆత్మయనెడు జ్యోతిని బాగుగా ప్రకాశింపజేయు పరమాత్మయనెడు జ్యోతికి నమస్కారము. నాలోని బ్రహ్మయనెడు జ్యోతిని వెలిగింపజేయు గురుస్వరూపమైన జ్యోతీ! నీకు నమస్కారము.
దీపము శ్రేష్ఠము, పవిత్రమైనది. అది జనార్ధనుని స్వరూపము. మన ఆత్మయే ఒక జ్యోతి స్వరూపము. అది పరమాత్మ స్వరూపము. గురు స్వరూపము కూడా. అట్టి జ్యోతికి నమస్కరించుట మన విధి.